తెలుగుదేశం పార్టీ 30 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆ పార్టీ యం.పి నందమూరి హరికృష్ణ తన స్థాయి మరచి పార్టీ పైన, పార్టీ నాయకుల పైన, అధినేత పైన తీవ్రమైన విమర్శలు చేసారు. ఎప్పుడో అమావాస్యకు, పౌర్ణమి కి తప్ప పార్టీ కార్యాలయానికి వచ్చే అలవాటు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే తీరిక లేని ఆయన, ఈ రోజు పార్టీ పైన, నాయకుల పైన విమర్శలు చేయటం చూసి, ప్రతి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిగ్గు పడుతున్నాడు. పార్టీ పదవులు పొంది కార్యకర్తలకు గాని, పార్టీకి కాని ఎప్పుడు అందుబాటులో లేని 'హరికృష్ణ'ను ముందుగా నిలదీయాలి. ఒక్క సారి 'హరికృష్ణ' గతంలోకి తొంగి చూసి కొన్ని నిజాలు చర్చించు కుందాం. 'యన్.టి.రామారావు మరణం తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో తన స్వంత నియోజకవర్గం 'గుడివాడ' నుండి 'యన్.టి,ఆర్ తెలుగుదేశం' పార్టీ తరుపున పోటి చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో హరికృష్ణ, లక్ష్మి పార్వతి, 'చంద్రబాబు నాయుడు' రామారావు ను వెన్నుపోటు పొడిచాడని ఊరూరు తిరిగి గొంతెత్తి అరచినా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు పట్టించుకోలేదు. హరికృష్ణ, లక్ష్మి పార్వతి చరిత్ర తెలిసిన పార్ట...
visit www.kammavelugu.org for more information and History of Kamma caste, kammavar, కమ్మ, కమ్మ వారు, కమ్మ నాయుడు, Kamma Naidu, Naidoo community people across the Globe