అయ్యా,
రాయపాటి సాంబశివరావు గారు, చాలామంది రాజకీయ నాయకుల కంటే మీకు కులాభిమానం కొంచెం ఎక్కువే. ఫోనులో పిలిచినా సరే, మీకు సమయం ఉంటె తప్పకుండా కమ్మ సంఘాల సమావేశాలకు హాజరవుతారు, చాలా సంతోషం.
కమ్మవారు వోట్ల శాతం ఏయే అసెంబ్లీ నియోజక వర్గంలో యెంత ఉందో మీ దగ్గర లెక్కలు ఉన్నాయ్. మీకు అవసరం అయినప్పుడు, మీ ప్రయోజనాలు కాపాడుకోవాలనుకున్నప్పుడు ఈ లెక్కలు మీరు అధిష్టానం ముందు పెడతారు. 'కమ్మవారికి' కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా చాలా అన్యాయం జరిగిందని మీడియాలోనూ, పబ్లిక్ గాను తెగ బాధ పది పోతారు.
కాంగ్రెస్ పార్టీలో కమ్మవారంటే మీ ఒక్క కుటుంబమే కాదు. కమ్మ కులం పేరు చెప్పి, మన కులానికి ప్రతినిధులుగా మీకు యం.పి, మీ తమ్ముడు గారికి యం.యల్.సి, మీ తమ్ముడు కొడుకు గారికి మేయర్, పదవులున్న కాని మీ పదవీ దాహం ఇంకా తీరలేదు. మీకు కేంద్రంలో మంత్రి పదవో లేకుంటే కనీసం టి.టి.డి చైర్మన్ పదవో కావాలి.
రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో మీరు ఆయనను కాకా పట్టి ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్టు, మీ వియ్యంకుడు దేవినేని నెహ్రు కు బంజారా హిల్స్ లో ఖరీదైన స్థలానికి క్లియరెన్స్ ఇప్పించుకున్నారు, ఇంకా అనేక రకాలైన లాభాలు పొందారు. రాజశేఖర్ రెడ్డి కమ్మ కులానికి ఏ ముఖ్యమంత్రి చేయనంత అన్యాయం చేసినా కుడా, మీరు మాత్రం పదవులు పొంది, పనులు చేయించుకుని లాభపడ్డారు. ఆయనకు జేజేలు కొట్టారు. ఆయనంత గొప్పోడు లేదన్నారు (మీరు ఆయనని కీర్తించిన వివరాలు పేపర్ కటింగ్స్ ఉన్నాయి) .
'పురందరేశ్వరి' కి మంత్రి పదవి ఇస్తే మీరు ఓర్వలేరు. కమ్మవారిలో లోక్ సభకు అత్యధిక సార్లు ఎన్నికైన వాడు, మీకంటే మేధావి, విద్యావంతుడు, 'కావూరి సాంబశివరావు' కు మంత్రి పదవి కోసం మీరెందుకు అడగరు? నిజంగా కమ్మ కులం పై మీకు ప్రేమ ఉంటె మీ స్వలాభం కోసం కులాన్ని అడ్డంపెట్టుకుని పైరవీలు చేసుకోవటం కాకుండా, మన కులంలో నిజంగా రాజకీయంగా అన్యాయం జరిగిన వ్యక్తులకోసం గొంతు విప్పండి!
Comments