కిరణ్ కుమార్ రెడ్డికి పోయేకాలం దగ్గరయ్యిందని కాంగ్రెస్ పార్టీ లోనే కాకుండా అన్ని
వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి అనాదిగా అండగా ఉంటూ వస్తున్న
రెడ్డి వర్గం వోట్లు కాపాడుకుంటూ,
రాష్ట్రము లో మరో బలమైన
వర్గం కాపులను దగ్గరకు చేర్చుకొనే పధకంలో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి
ని ముఖ్యమంత్రిగా, బొత్స సత్యనారాయణను పార్టీ
అధ్యక్షుని గా చేసింది. కాని
రాష్ట్రంలో మెజారిటీ రెడ్లు జగన్ పార్టీకి అనుకూలంగా
ఉన్నారు అనే విషయం ప్రతి
ఒక్కరికి తెలిసిన విషయమే.
ప్రస్తుతం ఈ వర్గం పదవుల
కోసం కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని రాబోయే
ఉప ఎన్నికలప్పుడు జగన్ కు పరోక్ష
మద్దతు తెలియచేయటం ద్వారా మరియు వచ్చే సాధారణ
ఎన్నికల నాటికి ప్రత్యక్షంగా జగన్ వెంట నిలవటానికి
సిద్దపడ్డారు అనే విషయం అన్ని
వర్గాల ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ కు
చేరింది.
ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి
అన్ని ప్రభుత్వ పదవులలో తన వర్గం వారికే
పెద్ద పీట వేస్తూ, ఉప
ఎన్నికలలో కుడా అన్ని సీట్లలో
తన కులం వారికే సీట్లిచ్చి'కుల రంజకం' గా
పాలన చేస్తున్నాడు. ఒక పధకం ప్రకారం
వచ్చే ఎన్నికల నాటికి అన్ని కీలక పదవులలో
తన వర్గం వారిని ఉంచి
ఎన్నికలముందు వై యస్ జగన్
పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదు.
వై యస్ రాజశేఖర రెడ్డిని
వాడుకుని పైకి వచ్చిన కిరణ్
కుమార్ రెడ్డి ఆ తరువాత పదవి
కోసం జగన్ ను వదలి
కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గర అయ్యాడు. రేపు
వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రేస్స్కు చెయ్యిచ్చి మరల జగన్ కు
దగ్గరైతే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.
కాని ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. కిరణ్
అనే వ్యక్తి 'గుడ్డి కన్ను' లాంటి వాడు. "గుడ్డి
కన్ను మూసినా ఒకటే, తెరిసిన ఒకటే".
కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న ఒకటే,
ఉడినా ఒకటే. కాని కిరణ్
కుమార్ ను ఇంకా ఎక్కువ
కాలం ముఖ్య మంత్రిగా సాగనిస్తే
కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడి,
జగన్ మరింత బలోపేతం అవుతాడనే
భయం కాంగ్రెస్ పార్టీలో మరియు ఇతర నాయకులలో
ఉంది.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన
తరువాత తన స్వంత జిల్లాతో
సహా కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాలలో
MLC ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ మధ్య జరిగిన
ఉప ఎన్నికలలో ఘోర పరాజయం పొందింది.
వచ్చే ఉపఎన్నికలలో కూడా కనీసం ఒక్క
సీటు గెలిచే ఆవకాశం లేదు. ఇంత జవాబుదారి
లేని, అసమర్ధ ముఖ్య మంత్రి, మరొకరు
కనిపించరు. కాంగ్రెస్ పార్టీని ఇంతగా బలహీన పరచిన,
బ్రస్టు పట్టించిన కిరణ్ కుమార్ రెడ్డిని
ప్రస్తుతం ఆ పార్టీలో రెడ్డి
వర్గం వారు తప్ప మిగిలిన
కులాల వారు వ్యతిరేకంగా వున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఉప ఎన్నికల
నాటికి 'నాలుగో కృష్ణుడు' ముఖ్య మంత్రి గద్దె
పైకి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ
అధిష్టానం అన్ని విషయాలను సీరియస్
గా పరిశీలన చేస్తుంది. ఈ ముఖ్య మంత్రి
కి పోయేకాలం వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గ్రహాల
పరిస్థితి కూడా కిరణ్ కుమార్
కు అంత అనుకూలంగా లేదు.
Comments