చలికాలంలో వీచే చల్లని గాలులు, కురిసే పొగమంచు మనుషుల రూపు రేఖలను మార్చేస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద చలిగాలి ప్రభావం తీవ్రంగా వుంటుంది. చర్మం పొడారిపోయినట్లు అవటమేకాక, దురద కూడా వుంటుంది. పెదాలు పగులు తాయి. ముఖం మీద చెమటపొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి ఏర్పడే యిటువంటి మార్పుల వల్ల చర్మపు సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిరుసెక్కి ముఖం అందవికారంగా కనిపిస్తుంది. ఈ కాలంలో ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకు శరీర ఆకృతితోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చలికాలంలో మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉండడంతో అవసరం కన్నా అతితక్కువ మంచినీటిని తాగడం ఈ కాలంలో సాధారణం. కాని అలా చేయడంతో జీర్ణశాయం పని తీరు కష్టసాద్యం అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గి మొఖం పొడిబారి పోతుంది. నీరు ఎక్కువగా తాగితే పొడి చర్మం నుంచి రక్షణ పొందవచ్చు. చలికాలం రోజుకు కనీసం అరగంట పాటయినా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా. ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయి...
visit www.kammavelugu.org for more information and History of Kamma caste, kammavar, కమ్మ, కమ్మ వారు, కమ్మ నాయుడు, Kamma Naidu, Naidoo community people across the Globe