చిరకాలంగా కాంగ్రెస్ పార్టీ లో కమ్మ వారికీ అందని ద్రాక్షపండులా ఊరిస్తున్న 'రాజ్య సభ' సభ్యత్వం 22 సంవత్సరాల తరువాత చివరికి ఈసారి దక్కింది. ఈ విషయం లో మనం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యం గా 'సోనియా గాంధీ' కి ధన్యవాదాలు తెలియ చేసుకోవాలి.
కాంగ్రెస్ పార్టీలో విద్యాధికురాలు, మంచి వక్త, ఎటువంటి సవాళ్ళ నైనా ఎదుర్కొనే ధీశాలి 'శ్రీమతి రేణుక చౌదరి' 'రాజ్య సభ' కు నామినేట్ చేయబడటం మనందరం ఆనందించే విషయం.
'కిరణ్ కుమార్ రెడ్డి' 'కమ్మవారికి రాజ్య సభ సీటిచ్చినా ప్రయోజనం లేదని, దాని వలన కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం లేదని అధిష్టానం ముందు యెంత మూర్ఖం గా వాదించినా, రేణుక' కు రాజ్య సభ సీటు రాకుండా యెంత అడ్డుపడినా, తన స్వయం ప్రతిభ తో 'రేణుకా చౌదరి' అధిష్టానాన్ని మెప్పించి రాజ్య సభకు ఎన్నిక కాగలిగింది.
కమ్మ వారందరూ ఒకే పార్టీలో ఉండాలనుకోవటం చాలా తప్పు. మనకు ఏ పార్టీ వారు సరైన ప్రోత్సాహం ఇచ్చినా వారికీ మనం కృతజ్ఞత తెలియ చేసుకోవాలి. BJP పార్టీ 'వెంకయ్య నాయుడు' ప్రతిభ, శక్తి సామర్ధ్యాలు గుర్తించి, గుజరాత్ నుండి గత రెండు దఫాలు గా 'రాజ్య సభ' కు ఎంపిక చేసింది. ఈ విషయం లో మనం ఆ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియ చేసుకోవాలి.
మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఆయా కులాలలో 'కమ్మ వారికి' వ్యతిరేకం గా వాదించే వారికి, మన కులాన్ని అకారణం గా ద్వేషించే వారికి మాత్రమే మనం వ్యతిరేకం అని ఈ సందర్భం గా గుర్తుంచుకోవాలి.
Comments