త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలలో 'చిరంజీవి' రాజీనామా చేసిన 'తిరుపతి' అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర మంత్రి శ్రీమతి గల్లా అరుణ కుమారి తనయుడు, సినీ నటుడు కృష్ణ అల్లుడు 'గల్లా జయదేవ్' అభ్యర్ధిత్వం పై ఆ నియోజక వర్గం ప్రజలనుండి మంచి స్పందన వ్యక్తమౌతుంది.
ఇప్పటికే 'గల్లా రామచంద్ర నాయుడు' తన 'అమరరాజ' పరిశ్రమ, 'రాజన్న ట్రస్ట్' ద్వారా జిల్లాలో, తిరుపతి ఎంతో మందికి ఉపాధి కల్పించారు, ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టారు. మంచి విద్యావంతుడు, సంస్కారి, తిరుపతి వాసి, స్థానికుడైన 'గల్లా జయదేవ్' తిరుపతి నుండి ప్రతినిధ్యం వహిస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.
ఒకే కుటుంబం నుండి ఇద్దరికీ పదవులేమిటనే వాదన కాంగ్రెస్ పార్టీలో కొందరు చేస్తున్నారు. వారికి గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబం నుండి, ధర్మాన ప్రసాద రావు కుటుంబం నుండి, రామిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుండి, ఆనం కుటుంబం నుండి, కోమటిరెడ్డి కుటుంబాన్ నుండి, జి.వెంకటస్వామి కుటుంబం నుండి, ఇద్దరి చొప్పున, బొత్స సత్యనారాయణ కుటుంబం నుండి ముగ్గురు చొప్పున ఇచ్చినప్పుడు న్యాయం అనిపించిందా? వచ్చే ఉపఎన్నికలలో 'నరసన్నపేట' నుండి ధర్మాన ప్రసాద్ సోదరుడు 'వై .కా.ప' తరుపున పోటిచేస్తున్నాడు, ఇదే నియోజక వర్గం నుండి ముఖ్యమంత్రి, 'ధర్మాన ప్రసాదరావు మరో సోదరుడిని 'కాంగ్రెస్' పార్టీ తరుపున పోటి చేయించటానికి సిద్ధపడుతున్నాడు. అంటే కాంగ్రెస్స్ పార్టీలో ఈ ముఖ్య మంత్రి 'కమ్మ వారికి' ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయం చేస్తాడా? ఎన్నికలలో పోటి చేయటానికి అన్ని అర్హతలు కలిగిన 'జయదేవ్' ను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని 'తెలుగు దేశానికి' కోల్పోయే పరిస్తితి ఉంది.
ఇప్పటికే తిరుపతి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న బలమైన వర్గం మొత్తం వై .కా.ప లోకి వెళ్లి పోయింది. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరుపున 'గల్లా జయదేవ్' పోటి చేసిన పక్షంలో తెలుగుదేశం పార్టీని అనాదిగా బలపరుస్తున్న 'కమ్మ వర్గం' కూడా ఈ సారి కాంగ్రెస్ అభ్యర్ధి 'జయదేవ్' ని బలపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి, తద్వారా ఆయన విజయం సులభం అయ్యే అవకాశం ఉంది.
Comments