Skip to main content

Posts

Showing posts with the label Telugu articles

ముసునూరు కమ్మ నాయకుల చరిత్ర

ముసునూరు కాపయ నాయకుడు కాకతీయ సామ్రాజ్యం పతనా నంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు ముసునూరు నాయకులు అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన అంధకార యుగం అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో ముసునూరు కాపయ నాయకుడు, ముసునూరు ప్రోలయ నాయకుడు తురుష్క పాలకులతో స్వాతంత్య్ర పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ వివరించాడు.  ఈ ''ముసునూరు యుగం'' రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు. 1323 సంవత్సరములో ఆంధ్ర దేశము అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నది. ఢిల్లీ సుల్తాను పంపిన ఉలుఫ్‌ఖాన్‌ (మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌) మూడు నెలల ముట్టడి తరువాత ప్రతాపరుద్రుని జయించి బంధించాడు. ఓరుగల్లు నెలల తరబడి దోచుకున్నాడు. అమూల్యమైన కోహినూరు వజ్రము, బంగారము, వజ్రవైఢూర్యములు మొదలగు సంపద 20,000 గుర్రములు, ఏనుగులు, ఒంటెలపై ఢిల్లీ తరలించారు. ప్రతాపరుద్ర మహారాజు, దుర్గపాలకుడు గన్నమ నాయుడు (యుగంధర్‌/ మాలిక్‌ మక్బూల్‌) మొదలగు వా...

'కమ్మ గర్జన' అవసరమా?

ఈ మధ్యన నా ఫ్రెండ్ ఒకాయన (వేరే కులం) అన్ని కులాల వాళ్ళు గర్జిస్తున్నారు.. మరి మీరెప్పుడు గర్జిస్తారు అని అడిగాడు. ఇదే ప్రశ్న నన్ను కమ్మ సంఘాల్లోని కొందరు కుర్రాళ్ళు కూడా అడిగారు.  నాకు కూడా ఈ సందేహం రెండు దశాబ్దాల క్రితమే కలిగింది... ఆ సమయంలో కొందరు కులాల గర్జనలు పెట్టుకుని కమ్మ వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. అప్పటి నుండే ఈ రాష్ట్రంలో కులాల కుంపటి రాజుకుంది. మనం కూడా "కమ్మ గర్జన" పెట్టుకుని మన బలం ఏమిటో ఇతర కులాల వారికి చూపించ వచ్చు కదా అని కొందరు పెద్దలను అడిగితే వారిచ్చిన సమాధానం ఈవిధంగా ఉంది. "నిజంగా గర్జించే పులి రోజూ గర్జిస్తూనే ఉంటుంది.. ఆ మాత్రం దానికి అది వేదికలెక్కి రుజువు చేసుకోనవసరం లేదు... ఐనా మనం రోడ్డు మీదకి వచ్చి గర్జిస్తే ఎదుటి వాళ్ళు బెదిరిపోవటానికి ఇదేమి అడవి కాదు.. మన ఒక్క కులం వాళ్ళు గర్జిస్తే అనేక ఇతర కులాల వాళ్ళు మనకు పోటీగా బదులిస్తారు కాబట్టి గర్జనలు.. గాండ్రింపులు మనకొద్దు, మనం అన్ని కులాల వారితో సామరస్యంగా ఉందాం.. అనవసరంగా గర్జించి, గాండ్రించి వారితో గిల్లికజ్జాలు పెట్టుకోవద్దు నాయనా!" అంటూ అయన బదులిచ్చాడు... ఆయన ...

ఈ దేశంలో బ్రతకాలంటే మైనారిటీగా లేక దళితునిగా పుట్టాలా?

ఈ దేశంలో మెజారిటీ మతం ప్రజల, దళితేతర వర్ణాల హక్కులు హరించివేయ బడుతున్నాయి. మన దేశ రాజ్యాంగం, ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఈ దేశంలో ప్రజలని కులాల వారీగా, మతాల వారీగా విభజించి రిజర్వేషన్లు కల్పించారో ఆ రోజే ఈ అసమానతలకు బీజం పడింది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత రచించిన రాజ్యాంగంలో సమాజంలో వెనుక బడిన, అణచివేయ బడిన వర్గాల ఆర్ధిక, సామాజిక స్థాయి మెరుగు పడాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల కాలం పాటు రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయించారు. అది మంచి నిర్ణయమే కానీ, స్వాతంత్రం వచ్చి 69 సంవత్సరాలైనా రిజర్వేషన్ల ఎత్తివేతపై పునస్సమీక్ష జరగలేదు సరికదా! రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఎన్నో కులాలను ఆ జాబితాలో కొత్తగా చేరుస్తూ  రిజర్వేషన్ల శాతాన్ని మరింత పెంచుకుంటూ పోయారు. IAS అధికారి కొడుకైనా.. మంత్రి కొడుకైనా సరే! దళితుడైతే చాలు అతనికి ప్రతిభ... లేకున్నా, ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా రిజర్వేషన్ కోటాలో మంచి కాలేజిలో ఉచిత విద్యతో పాటు, ఉచిత హాస్టల్ వసతే కాకుండా ఉపకార వేతనం కూడా లభిస్తుంది, ఆ తరువాత మంచి ఉద్యోగం వస్తుంది. ప్రమోషన్ లో కూడా అతని సీనియారిటీతో సంబంధం లేకుండా పెద్ద పీట వేస్త...

క్రిమినల్స్ కులమేది?

గత దశాబ్ద కాలంలో ఈ దేశంలో, రాష్ట్రంలో ఎన్నో స్కాములు బయట పడ్డాయి. నిందితుల్లో కొందరికి శిక్ష పడింది, కొందరు తప్పించుకున్నారు, మరి కొన్ని సుదీర్ఘ కాలంగా విచారణలో ఉన్నాయి.  ఇటీవల "అగ్రి గోల్డ్" సంస్థ తన డిపాజిట్ దార్లకు  వేలాది కోట్ల రూపాయల మెచ్యురిటి డిపాజిట్ల తిరిగి చెల్లింపులో విఫలం కావటంతో ఆ సంస్థ నిర్వహిస్తున్న పోంజీ స్కీం వ్యహారం బయట పడింది. వంద కోట్లు అంతకు మించి పబ్లిక్ నుంచి వసూలు చేసే కంపెనీలు తమ అనుమతిని తప్పనిసరిగా సెబీ నిబంధనలు చెబుతున్నాయి. సెబి వద్దనున్న సమాచారం మేరకు ఈ సంస్థ ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని  పేద, మధ్యతరగతి వర్గాల నుంచి రకరకాల స్కీంల రూపంలో 7,000 కోట్ల రూపాయల వరకు సేకరించినట్లు తెలుస్తుంది. దీనిలో ఒక్క ప్రకాశం జిల్లా నుండే 1,500 కోట్లు మదుపు దారులనుండి సేకరించారు.  ఇటీవలి కాలంలో సంస్థ వసూళ్ల కన్నా మెచ్యూర్ అయిన డిపాజిట్లకు చెల్లించాల్సిన మొత్తం పెరగటంతో లిక్విడిటీ సమస్య ఏర్పడింది. దీంతో డిపాజిటర్లకు చెక్కులు బౌన్స్ కావటం ప్రారంభమయింది. ఫలితంగా మదుపర్లు వీధిన పడ్డారు. ఇప్పటివరకు కంపెనీ జారీ చేసిన దాదాపు 290 కోట్ల ర...

మన ఊరు.. మన సంక్రాంతి...మకర సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు లోగిళ్ళకు “తొలికాంతి” సంబరాల సంక్రాంతి అంబరాన్ని అంటిన సంబరాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం, అందరూ బావుండాలి, అంతా మంచే జరగాలి అనే ఆశతో భవిష్యత్తుకు బాటలు పరిచేశాం. గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణ క్షణం భయంతో గడిపిన రైతన్న చల్లగా, చల్లని గాలుల మధ్య, ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. పరవళ్ళు తొక్కిన నదులు, సంద్రాలు, కాలువల సాక్షిగా, తన చమట జల్లుని చిందించి నేల తల్లిని పులకరింప చేసి పచ్చని పల్లెలో వెలుగు నింపుతూ పచ్చగా రంగు వేసినట్లుగా పండిన పంటను చూసి ఎద్దుకొమ్ముల మధ్య సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ సంక్రాంతి పండగ చేసుకుంటున్నాడు. అసలు సంక్రాంతి అంటే! చల్లని గాలుల నడుమ, పచ్చని పైరుల నడుమ, ప్రతీ ఊరు, ప్రతీ ఇల్లు ధాన్యపు రాశులతో, డూ డూ బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు వాళ్ళ విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళు, భం భం అనే జంగర దేవరలు, హంగామాతో హాస్యన్ని పండించే పగటి వేషగాళ్ళు, మా ఇంటికి రండీ అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు, గాలి పటాలతో సందడి చేసే పిల్లలు, ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులు పంద...

ఓ ఉద్యమ యోధుడి వీర చరిత్ర: 'చండ్ర' ప్రచండుడు

దేశం మనకేమి ఇస్తుందని ఎదురు చూస్తోంది నేటితరం. దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించింది వెనకటితరం. స్వాతంత్య్రం, సమసమాజ నిర్మాణం కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగాలు చేసింది ఆనాటి తరం. ఏళ్ళతరబడి ఉద్యమాల్లో,అజ్ఞాత వాసంలో గడిపిన ఆనాటి నాయకుల్లో సుప్రసిద్ధులు చండ్ర రాజేశ్వరరావు . కమ్యూనిస్టు పార్టీకి ఆరున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన రాజేశ్వరరావుగారి సంస్మరించుకునే ప్రయత్నమే ఇది.  భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి 28 సంవత్సరాల  సుదీర్ఘ కాలం నేతృత్వం వహించిన రాజేశ్వరరావు   జీవితం వడ్డించిన విస్తరే. ఒడిదుడుకులు లేని బాల్యమే అయినా, 'చిన్ని నా పొట్ట శ్రీరామరక్ష' అని అనుకోకుండా, పేదల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాటాలు సాగించిన యోధుడు. సైద్ధాంతిక నిబద్ధతకు, నిజాయితీకీ నిలువుటద్దం. తెలంగాణా సాయుధ పోరాట యోధులతో జతకట్టిన కమ్యూనిస్టు. దేశాధినేతలతోనైనా,సాటి కామ్రెడ్స్‌తోనైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించిన నిర్మొహమాటి. నెహ్రూ,ఇందిరాగాంధీలు తీసుకున్న నిర్ణయాల్లో ప్రజోపయోగమైనవాటిని సమర్ధించిన నోటితోనే,వారి నిరంకుశ చర్యలను తెగనాడిన నిష్పక్షపాతి. అపరకర్మలప...

నెట్టింట్లో కూడా 'ఈనాడే' నెంబర్ -1

తెలుగు వార్తా పత్రికల్లో అత్యధికంగా చదివేది 'ఈనాడు' అనే విషయం అందరికి తెలిసిందే! ప్రింట్ మీడియా లోనే కాదు వెబ్ మీడియా లో కూడా ఈనాడే  నెంబర్ 1. ఇంటర్నెట్లో వీక్షకులు ఎక్కువగా  తిలకిస్తున్నది కూడా 'ఈనాడు' పేపర్ మాత్రమే. నాణ్యమైన, విశ్వసనీయమైన వార్తల విషయంలో దేశ, విదేశాల్లోని తెలుగు వారు 'ఈనాడు' పేపర్ కే ఆగ్రతాంబులం ఇచ్చారు. సాక్షి పేపర్ కు, ఈనాడు పేపర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక 'నమస్తే తెలంగాణా' పేపర్ ఐతే కనీసం సోదిలో కూడా లేదు. ఈనాడు : వరల్డ్ ర్యాంకు : 989, ఇండియా ర్యాంకు : 96, USA ర్యాంకు : 1,698 సాక్షి: వరల్డ్ ర్యాంకు : 1614, ఇండియా ర్యాంకు : 134, USA ర్యాంకు : 5,547 నమస్తే తెలంగాణా: వరల్డ్ ర్యాంకు : 9,226, ఇండియా ర్యాంకు : 775, USA ర్యాంకు : 25,493

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వటానికి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటానికి ఇంకెంత కాలం?

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వటానికి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల్లో తెలుగుదేశం, భారతీయ జనత పార్టీలే అధికారంలో ఉన్నందువలన 'భారతరత్న' విషయం త్వరగా తేల్చేస్తే బాగుంటుంది.  కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడే పార్లమెంట్ ప్రాంగణంలో 'ఎన్టీఆర్' విగ్రహం ఏర్పాటు చేశారు, నిజంగా ఇదెంతో గొప్ప విషయమే! పురందేశ్వరి చొరవతోనే ఇది సాధ్యం అయింది. తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతో ఏర్పాటైన NDA ప్రభుత్వంలో కూడా ఈ పని చేయలేక పోవటం నిజంగా సిగ్గుచేటు. ఒక ముఠా నాయకుడిగా తప్ప ముఖ్యమంత్రిగా ఏనాడు పనిచేయని వై. యస్. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మరణించిన 10 నెలలలోనే కడప జిల్లాకు అయన పేరు పెట్టారు. మరి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోయిన తరువాత ఎనిమిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కాని 'కృష్ణా జిల్లా' కు ఆయన పేరు పెట్టలేక పోయింది.  తెలుగుదేశం పార్టీ కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయటానికి సరిపడ...

నాలుగు మంచి మాటలు ....

అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే.మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. లక్ష్యాన్ని సాదించేవరకు నిరాశకు, నిస్పృహకు చోటివ్వక పట్టుదలతో కొనసాగితే తప్పక విజయం నిన్నే వరిస్తుంది. మనం ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తే మనవైపు నాలుగు వేళ్ళు చూస్తూవుంటాయి...ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెదకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో మంచే కనిపిస్తుంది. ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి. ప్రేమ అనేది నీడ లాంటిది..అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది..కానీ స్నేహం దీపం లాంటిది.అది చీకటిలో కూడా నీ గమ్యంని చూపిస్తుంది.  నీవు ఎవరికైన ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు . ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మరిచిపోకు. అంధకారం తరువాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది . అలాగే దుఖం తరువాత వచ్చిన సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది. పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది . ఆత్మవిశ్వాసం మనిషిని విజయప...

పల్లె పిలుస్తోంది!

పట్టణంలో ఏముంది? ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములు, వాహనాల రొద, శబ్ద, ధ్వని కాలుష్యం, దుమ్ము, ధూళి, కార్బన్ డై ఆక్సైడ్ కంపు తప్ప!  కోకిలల కుహు కుహు  రాగాలు, కోడిపుంజుల 'కొక్కొరోకో' సంగీతాలు, పిచ్చుకమ్మల కిచ కిచలు నగరాల్లో   మీకెప్పుడైనా వినిపించాయా?  చెంగున గెంతే కోడె దూడలు, డీ కొడదాం రమ్మనే గొర్రె పొట్టేళ్ళు, అందమైన గోమాతలు, యవ్వనం ఉట్టిపడే గిత్తలు పట్టణాల్లో మీకెప్పుడైనా కనిపించాయా?  ఊర చెరువులో విరబూసిన కలువ, తామరలు, పిల్లకాలువల్లో కాళ్ళకు తగులుతూ గిలిగింతలు పెట్టె మట్టగుడిసెలు, కాలువ గట్లపై విరగ బూసిన పొగడ పూల చెట్లు నగరాల్లో మీరెప్పుడైన చూశారా?  పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ డాగ్స్, తట్టుకోలేనంత కొవ్వు, భరించలేనంత అనారోగ్యం. ఘాటైన పాయిసన్ సెంట్లు, అలేర్జిలు, తుమ్ములు, హోస్పటల్లు, డాక్టర్లు  ఇదేనా నగర జీవితం? తొలకరి చినుకుల మైమరపించే మట్టి వాసన, మత్తెకించే  వేప పూల, విరిసిన బంతిపుల కమ్మటి సువాసన, తంపటివేసిన తేగల, కుంపట్లో కాల్చిన చిలగడ దుంపల,  ఉడకబెట్టిన పచ్చి వేరుశనగ కాయల, నిప్పులపైన దోరగా కాల్చిన మొక్కజొన్...

చలికాలం ఆరోగ్య చిట్కాలు

చలికాలంలో వీచే చల్లని గాలులు, కురిసే పొగమంచు మనుషుల రూపు రేఖలను మార్చేస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద చలిగాలి ప్రభావం తీవ్రంగా వుంటుంది. చర్మం పొడారిపోయినట్లు అవటమేకాక, దురద కూడా వుంటుంది. పెదాలు పగులు తాయి. ముఖం మీద చెమటపొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి ఏర్పడే యిటువంటి మార్పుల వల్ల చర్మపు సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిరుసెక్కి ముఖం అందవికారంగా కనిపిస్తుంది.  ఈ కాలంలో ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకు శరీర ఆకృతితోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  చలికాలంలో మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉండడంతో అవసరం కన్నా అతితక్కువ మంచినీటిని తాగడం ఈ కాలంలో సాధారణం. కాని అలా చేయడంతో జీర్ణశాయం పని తీరు కష్టసాద్యం అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గి మొఖం పొడిబారి పోతుంది. నీరు ఎక్కువగా తాగితే పొడి చర్మం నుంచి రక్షణ పొందవచ్చు.  చలికాలం రోజుకు కనీసం అరగంట పాటయినా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.  ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయి...

పల్లెకు పోదాం... పచ్చటి ప్రకృతిని తిలకించి పులకరిద్దాం.....

ప్రకృతి సౌందర్యం అంతా పల్లెల్లోనే ఉంది. పచ్చటి పొలాలు, కొబ్బరి, తాటి, ఈత చెట్లు, పిల్ల కాలువలు, చెరువులు,  పశువులు... ఇలా ఒక అందమైన చిత్రీకరణ ఒక్క పల్లెటూర్లలోనే ఆవిష్కృతమౌతుంది. శీతాకాలం (శరదృతువు) లో పల్లెటూళ్ళ అందం వర్ణించ నలవి కాదు... కోతకు వచ్చిన వరి పొలాలు, కోసిన వరి కుప్పలు, పొలాల్లో వడ్ల పురులు.. వెరసి, రైతుల కళ్ళల్లో బిడ్డ పుట్టినంత ఆనందం (ఆరుగాలం పంట అక్కరకు వచ్చినందుకు).... ఒక్కసారి 'మంచు దుప్పటి' కప్పుకున్న ఆ పచ్చటి పొలాలను కాలువ గట్ల పైనుండి నడచి వెళ్లి పలకరించండి... ఎడ్ల బండిపై మట్టి రోడ్డు మీద మీ తండ్రి, తాత గారి ఊరుని ఒక సారి చుట్టి రండి... నిజం చెప్పండి, మనం బ్రతికేది ఒక బ్రతుకేనా అనిపించటం లేదు? ఉదయం లేచిన దగ్గర నుండి ఉరుకులు పరుగుల జీవితం, ట్రాఫిక్ జాములు, వాతావరణ, శబ్ద కాలుష్యం, కొంచెం సేపు ఆగి విశ్రాంతి తీసుకుంటే, ఎక్కడ వెనకబడి పోతామో అన్న బ్రతుకు పోరాటం... పక్క వాడిని దాటి ముందుకు వెళ్ళాలన్న ఆరాటం, డబ్బులు కూడబెట్టలన్న ఆశ, ఇవన్నీ మనకు AC గదుల్లో కూడా ఉపిరాడకుండా చేస్తున్నాయి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ లేకుండా నిముషం గడవ...

తెలుగుదేశాన్ని గెలిపించండి! నవరాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోండి.

ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన అతి క్లిష్టమైన సమయంలో ఒకే సారి కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఇప్పుడు సీమాంధ్ర రాష్ట్ర నిర్మాణం అనేది ఒక పెద్ద సమస్య. ఇటుక, ఇటుక పేర్చుకుని ఏంటో జాగ్రత్తగా నిర్మాణం చేసే నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం త్వరిత గతిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం కుల, మత, ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టి ఒక దార్శనికుడు, అభివృద్ధి, పరిపాలన రంగంలో అనుభవం ఉన్న నేత కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.  ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలు, వాటి అధినాయకులను ఒక్క సారి పరిశీలిస్తే,  ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పటి వరకు, కుల, మత, ప్రాంతీయ తత్వాలకు ఆజ్యం పోసింది, ఒక రకంగా రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం అయ్యింది. ఈ పార్టీకి ప్రాంతీయ దృక్పదం ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే నాయకుడు లేడు, పరిపాలన, నిర్ణయాలు అన్ని హై కమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే జరుగుతాయి. ఎవరో దిగ్విజయ్ సింగ్, గులాం నబి ఆజాద్, వీరప్ప మొయిలి, చిదంబరం, జైరాం రమేష్ ఆదేశాలకు అనుగుణం గా ఈ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళకి వెన్నెముక, స్వంత ఆలోచన అనేవి...

కమ్మ వారంతా రాబోయే ఎన్నికలలలో తెలుగుదేశం పార్టీ కే ఓటేయాలా?

ప్రస్తుత తరుణంలో ఓటర్లంతా ప్రాంతాల, మతాల, కులాల వారీగా చీలి పొయారు. రాజయకీయ పార్టీలు కూడా కొన్ని కులాలవారిని ఆకర్షించే విధంగా వారి పార్టీ మానిఫెస్టోలో తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత  కాంగ్రెస్  పార్టీలొ ఒక కులం వారి ఆధిపత్యం ఎక్కువగా ఉండి, మొదటి నుండి అదే కులం వారికి పార్టీలో, ప్రభుత్వంలో కీలక మైన పదవులు లభించాయి. 'తెలుగు దేశం' పార్టీ ఏర్పడక ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం గా ఉన్న 'ఉభయ కమ్యునిస్ట్' పార్టీల్లొ 'కమ్మ వారి' ఆధిపత్యం ఎక్కువగా ఉంది.  తెలుగుదేశం పార్టీ ఏర్పడే వరకు ఆంద్ర రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు, కమ్యునిస్ట్ పార్టీలు బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపక్షం కాలేక పోయాయి. యన్.టి.ఆర్ సారధ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ గా ఎదిగింది.  అప్పటి వరకు అధికారానికి, ముఖ్యమైన పదవులకు దూరంగా ఉన్న కులాల వారికి మొదటి సారిగా ప్రాతినిధ్యం లభించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మ, రెడ్డి కులాల వారితో పా...

ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారికి కలిగే ప్రయోజనాలేమిటి?

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే 'కమ్మవారికి' ప్రయోజనం ఏమిటి? అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. కమ్మవారి జనాభా కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఎక్కువగాను, రాయలసీమలో కొంచెం తక్కువగా, తెలంగాణా లో ఖమ్మం జిల్లాలో   చెప్పుకోదగిన సంఖ్యలో, నిజామాబాదు, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఒక మోస్తరుగా వున్నారు. ప్రస్తుత అసెంబ్లీ లో ఉన్న 28 మంది కమ్మ MLA లలో 24 మంది కోస్తా, రాయలసీమ ప్రాంతాలవారే. కొంతమంది చెప్పినట్టు, ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మవారి జనాభా 4.3%, అనుకుంటే, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో 7.5% ఉంటారు. ఈవిధంగా చూస్తే, 'ప్రత్యేక ఆంధ్రా' లో మనకు కులాల నిష్పత్తి ప్రకారం ఎక్కువ మంత్రిపదవులు, అధికార పదవులు దక్కుతాయి.తెలంగాణా జిల్లాలలో కమ్మవారు నలుగురైదుగురు MLA లు గా ఎన్నికైనా, కనీసం ఒకటి, అరా మంత్రి పదవి దక్కకపోదు.  BC జనాభా, ముస్లిం జనాభా, ఎక్కువగా ఉన్న తెలంగాణా విడిపోతేనే మనకు 'ప్రత్యేక ఆంధ్రా' లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.  గత   ప్రభుత్వం, ముఖ్య మంత్రి, కమ్మవారు ఎక్కువగా ఉన్న జిల్లా ప్రజా పరిషత్ లు, శాసనసభ నియోజక వర్గాలు, BC లకు రిజర్వ్ చేసి రాజకీయంగా కమ్మవారిని ...