వై,యస్.ఆర్ ను నమ్ముకుని తమ వైట్ మనీ అంతా వై.ఎస్.జగన్ కు సమర్పించుకుని వై.ఎస్.ఆర్ తమకు సంతర్పణ చేసిన ప్రభుత్వ స్థలాలు, ఇతర భూముల ఫలహారం ఇప్పుడు తమ పీకలకు చుట్టుకుంటే దిక్కు తోచని పరిస్థితిలో ప్రసాద్ త్రయం ఉన్నారు.
'నిమ్మగడ్డ ప్రసాద్' తన 'మాట్రిక్స్ లాబ్స్' కంపెనీ విలువను అతి తక్కువ సమయంలో ఎన్నో రెట్లు పెంచటం ద్వారా, కంపెనీలో మదుపుదారుల సంపదను వృద్ధి చేయటంలో భారత కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన వ్యక్తి. మూత పడిన ఫార్మా కంపెనీలను కొనుగోలు చేసి ఆనతి కాలంలోనే అత్యంత లాభసాటిగా తీర్చి దిద్దిన 'ప్రసాద్' ఎందరో కార్పొరేట్ దిగ్గజాలకు, మరెందరో పారిశ్రామికవేత్తలకు రోల్ మోడల్.
ప్రసాద్ 2006 సంవత్సరంలో 'మాట్రిక్స్'లో తనకున్న మెజారిటి వాటాను రూ.800 కోట్లకు 'మైలాన్' కంపెనీకి అమ్మి వేశారు. ఆయన వ్యాపార ప్రస్థానం అప్పటినుండి ప్రారంభమైంది. ఆయన ఆ తరువాత 'MAA TV, CARE Hospital, Asian Institute of Gastroenterology, Indu Projects, Infotech Enterprises, MetronomX (USA based) మొదలైన సంస్థలలో పెట్టుబడి పెట్టారు.
అదే క్రమంలో వై.యస్. దృష్టి ఆయనపై పడింది. నెమ్మదిగా ఆయనకు ఇతర ప్రలోభాలు ఎరవేసి ఆయన సొమ్ము తమ సంస్థలైన 'సాక్షి', 'భారతి సిమెంట్స్' లలో అత్యధిక ప్రిమియంతో వాటాలు కొనిపించుకున్నారు. ప్రతిఫలంగా ప్రభుత్వ భూములు, ప్రజలనుండి కారు చౌకగా సేకరించిన భూములు, సాగర తీరం వెంబడి 27,000 ఎకరాలు 'ప్రసాద్' సంస్థ VANPIC కు కట్టబెట్టారు. ఇవన్ని నిమ్మగడ్డ ప్రసాద్ కు ఊరికే కట్టబెట్టలేదు, ఆయన వీటికి సొమ్ము చెల్లించే తీసుకున్నారు, కాని ప్రస్తుతం VANPIC పరిస్థితి అగమ్య గోచరంగా వుంది, ప్రస్తుత ప్రభుత్వం గతంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకుని దీనికి కట్టబెట్టిన భూములను వెనక్కి తీసుకొనే ఆలోచనలో ఉంది.
ప్రసాద్ కు , జగన్ తో, అయన సంస్థలతో ఉన్న లింకుల కారణంగా ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. 'దుష్టులతో సహవాసం' ఆయనకు చేటు తెచ్చిపెట్టింది.
మరో వ్యక్తి 'కోనేరు రాజేంద్ర ప్రసాద్'. 'దుబాయ్ ప్రసాద్'గా పిలవబడే ఈయన చాల కాలంనుండి 'ఖనిజాల' ఎగుమతి వ్యాపారంలో ఉన్నారు. మన దేశంలో Trimex International అనే సంస్థ ద్వారా ఖనిజాల ఎగుమతులు, దుబాయ్ లో Ras Al Khima రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పబడిన RAK Ceramics, RAKINDO Developers, MEC Coal (Indonesia) మరియు అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ EMAAR properties మొదలైన సంస్థలలో భాగస్వామ్యం కలిగిన అత్యంత సంపన్నమైన పారిశ్రామికవేత్త.
గతంలో వై.యస్.రాజారెడ్డితో బైరైతిస్ రవాణాలో ఉన్న పరిచయం ఈయనను వై.యస్.ఆర్ కు దగ్గర చేసింది. ఈయనను అడ్డం పెట్టుకుని వై.యస్.ఆర్ అడ్డంగా డబ్బులు నోక్కేసాడు. 10 పైసలు 'కోనేరు ప్రసాద్'కు ఆశ చూపించి, మిగిలన 90 పైసలు రాజశేఖర రెడ్డి, జగన్ లు అప్పనంగా నోక్కేసారు.
ఇప్పడు EMAAR properties వ్యవహారం 'కోనేరు ప్రసాద్'ను కటకటాల పాలు చేసింది. ఈ వ్యవహారంలో భవిష్యత్తులో కోనేరు ప్రసాద్ తో పాటు, ఆయన కొడుకులు కూడా ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముచ్చటగా మూడో వ్యక్తి 'పొట్లూరి వెంకట ప్రసాద్'. పైన చెప్పుకున్న ప్రసాదులు ఇద్దరికీ ఉన్నంత గొప్ప నేపధ్యం ఈయనకి లేకపోయినా వారికంటే గొప్ప తెలివితేటలు కలవాడు. 'తిమ్మిని బొమ్మిని' చేయటంలో దిట్ట. అడ్డగోలు కంపెనీలు సృష్టించటం, వాటిని అమ్మివేసి సొమ్ము చేసుకోవటంలో ఘనుడు. 2000 సంవత్సరంలో USA లో తన కన్సల్టింగ్ కంపెనీని రూ.270 కోట్లకు SSI లో కలిపివేసి భారీ మొత్తంలో సొమ్ము చేసుకొన్నాడు. ఆ తరువాత ఆ కంపెనీ దివాలా తీసింది.
ఆ తరువాత మారిషస్ లో కొన్ని దొంగ కంపెనీలు సృష్టించి మనీ లందరింగ్ కు పాల్పడ్డాడు. 'నాదర్గుల్' భూముల వ్యవహారంలో ప్రసాద్ కు సహాయ పడినందుకు ప్రతిఫలంగా వై.యస్.ఆర్ ఆయన ద్వారా తన కొడుకు కంపెనీలో షేర్లు భారి ప్రీమియంతో కొనుగోలు చేయించాడు. 'మనీ లాండరింగ్' వ్యవహారంలో సిద్ధహస్తుడైన పొట్లూరి ప్రసాద్ అనేక రకాలుగా జగన్ కంపెనిల్లోకి డబ్బు జమ అయ్యేందుకు సహాయపడ్డాడు.
ప్రస్తుతం ఈయనగారు కూడా CBI దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. రాబోయే కాలంలో ఈయనకు చిక్కులు తప్పక పోవచ్చు.
2004 సంవత్సరం నాటికి వందల కోట్లు వైట్ మనీ కలిగిన ముగ్గురు ప్రసాద్ లు, వై.యస్.ఆర్ వలలో చిక్కుకుని ప్రస్తుతం, 'సొమ్ము పోయే, శని పట్టే' అనే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాని వీరు ఇప్పటికి వై.యస్.ఆర్ అవినీతి గుట్టు ఏమాత్రం విప్పటం లేదు. 'దొంగని, దొంగతనాన్ని దాచిపెట్టిన వాడు కూడా దొంగతో సమానమే'!
ఇప్పటికైనా ముగ్గురు ప్రసాద్ లు తమ కళ్ళు తెరిచి జరిగిన విషయాలు CBI ముందు వెల్లడి చేస్తే, అసలు దొంగలు బయటపడతారు, వారికి శిక్ష పడుతుంది.'చట్టానికి దొరక్కుండా తప్పించుకుని దొరల్లాగా తిరుగుతున్న అక్రమార్కుల ' బండారం ఇప్పటికైనా బయటపెడితే ఈ సమాజానికి కూడా వీరు మేలు చేసిన వారౌతారు.
Comments