కమ్మ వారి జనాభా ఎక్కువ గా ఉన్న 'కృష్ణ, గుంటూరు, ఖమ్మం' జిల్లాలలో ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రము ఏర్పడక ముందు, తరువాత జరిగిన రెండు, మూడు ఎన్నికల వరకు 'కమ్మ్యునిస్ట్, పార్టీల ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఈ జిల్లాల్లో కమ్మ వారిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. స్వాతంత్రోద్యమ పోరాటంలోను, విశాలాంధ్ర ఉద్యమంలోను కమ్మ వారు ప్రముఖ పాత్ర పోషించారు.
కారణాలేవైనా ఈ జిల్లాల్లో కమ్మవారు అది నుండి 'కాంగ్రెస్' కు వ్యతిరేకం గా 'కమ్మ్యునిస్ట్, స్వతంత్ర పార్టీ, జనత పార్టీ, లోక్ దళ్' వంటి పార్టీల్లో చురుకుగా పని చేసే వారు. అదే విధంగా ఈ జిల్లాల నుండే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులు అసెంబ్లీ కి ఎన్నికయే వారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఆవిర్భవించిన 'తెలుగు దేశం' పార్టీని ఆ పార్టీ వ్యతిరేక నేపధ్యం కలిగిన కమ్మవారు ఆదరించడం లో వింతేమి లేదు. కమ్మవారు కులాభిమానం తో 'తెలుగు దేశం' పార్టీ ని అభిమానిస్తున్నరనే వాదన చేసేవారు ఈ విషయాన్ని గమనించాలి.
ఒక విశేషమేమిటంటే? తెలుగు దేశం పార్టీని అభిమానించే కమ్మ వారిలో ఎక్కువ మంది 'చంద్ర బాబు నాయుడు 'కు వ్యతిరేకం. తెలుగు దేశం పార్టీ మనది, నాయకుడు ఎవరైనా కాని అనే ఉద్దేశంలో ఉంటారు. కారణం? చంద్ర బాబు నాయుడు అధికారంలో ఉన్నంత కాలం 'భయం తోనో, పిరికి తనంతోనో అర్హత, ప్రతిభ ఉన్న కమ్మవారిని కూడా పదవులకు దూరంగా పెట్టాడు. అనాదిగా పార్టీని నమ్ముకుని 'తెలుగు దేశం' ఆవిర్భావ సమయం నుండి పార్టీతో మమేకమైన అనేక మంది కమ్మవారు ఆర్ధికంగా నష్టపోయి ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీకి అన్ని విషయాలలో వెన్ను దన్నుగా ఉన్న యువత సరైన ప్రోత్సాహం లేక నీరసించి పోయింది. కొంత కాలం పాటు యన్.టి.రామారావును, అతని అభిమానులను కూడా దూరంగా పెట్టాడు.
చంద్ర బాబు నాయుడు మనస్తత్వాన్ని దగ్గరగా పరిశీలించిన చాలా మంది విశ్లేషకులు అతనిలో మూడు గుణాలను ప్రత్యేకిస్తారు. ఒకటి, నమ్ముకున్నవారిని దూరంగా ఉంచటం. రెండు, ప్రతి విషయం రాజకీయంగా ఆలోచించి విశ్వాసపాత్రులు కాని వారిని, పార్టీకి ఏమాత్రం ఉపయోగపడని వారిని కూడా శాశ్వత ప్రయోజనాలు కాకుండా, తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి అందలమెక్కించాడు. మూడో గుణం తన నీడను కూడా నమ్మకపోవటం.
ఈ విధంగా చేయటం వలన, అనాదిగా పార్టీని నమ్ముకున్న వారు నిదానంగా పార్టీకి దూరమైనారు. అందలాలెక్కిన వారు పదవులు అనుభవించి పార్టీని అమ్ముకున్నారు.
ఎన్నికలలో ఓటమి చవి చూసి, అధికారానికి దూరమైన తరువాత కొంత కాలానికి చంద్ర బాబు లో కొంత మార్పు వచ్చింది. ఆ విషయం తరువాత కొన్ని విషయాలలో తేట తెల్లమైంది.
క్రమం గా పార్టీలో యన్.టి.రామారావు కు ప్రాధాన్యత పెంచాడు. అదే సమయంలో దూరమైన యన్.టి.రామారావు కుటుంబంతో కూడా సత్సంబంధాలు పెంచుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికలలో అర్హత, బలం కలిగిన కమ్మవారికి భయపడకుండా సీట్లిచ్చాడు. హైదరాబాద్ నగరంలో 'సేరి లింగంపల్లి, యల్.బి.నగర్ సీట్లలో కమ్మవారికి అవకాశం కల్పించాడు. అలాగే ఆ తరువాత జరిగిన హైదరాబాద్ కొర్పొరేషన్ ఎన్నికలలో కూడా ఎనిమిది మంది కమ్మ వారికి సీట్లిచ్చాడు. (ఆరుగురు గెలిచారు) . ఇదో మంచి పరిణామం, చంద్రబాబు లో మార్పు వస్తున్నాడని భావించటానికి ఇదో ఉదాహరణ.
రాజ్య సభ ఎన్నికలలో కూడా, రెండు దఫాలుగా పరిమిత వనరులున్నా కాని కమ్మవారికి ( హరి కృష్ణ, వై.యస్.చౌదరి) అవకాశం కల్పించాడు. గత ఎన్నికలలో రాజశేఖర రెడ్డి కుటిల రాజకీయానికి కుదేలైన తెలుగు దేశం పార్టీకి ఆర్ధికంగా అండదండలు అందించిన ముఖ్యులు, పార్టీ పరంగా అప్పటి వరకు ఏ పదవులు అనుభవించని వారైన Y.S.Chowdary ని గత రాజ్య సభ ఎన్నికలలోను, ఈ ఎన్నికలలో C.M.Ramesh ను ఎంపికచేసి కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారి పట్ల విశ్వసనీయతను చాటుకున్నాడు. ఇది పార్టీ పరంగా చాలా శుభ పరిణామం.
ఈ పరిణామాన్ని విమర్శించే నాయకులు, గతంలో మంత్రులుగా, అధికారిక పదవులు అనుభవించిన వారు, పార్టీని, పదవులను అడ్డం పెట్టుకుని ఆర్ధికంగా లబ్ది పొందిన వారు, గత ఎన్నికలలో పార్టీకి ఏ మాత్రం ఆర్ధికంగా ఉపయోగపడలేదు. (నామా నాగేశ్వర రావు లాంటి కొంతమంది నాయకులు పార్టీ పరంగా లబ్ది పొందక పోయినా, పార్టీ కోసం ఆర్ధికంగా ఎంతో ఖర్చు చేసారు.)
ప్రతి రాజ్య సభ ఎన్నికలలో కమ్మవారికే సీటు కేటాయించాలని భావించటం అవివేకం. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కమ్మ వారి తరువాత తెలుగు దేశం పార్టీని అభిమానించే 'గౌడ' వర్గం నుండి రాజకీయాలలో ఎంతో కొంత విలువలు కలిగిన నాయకుడు 'దేవేంద్ర గౌడ్' ను ఎంపిక చేయటం అభినందించ వలసిన విషయం.
ఒకే కులాన్ని భుజాన వేసుకున్న పార్టీ కాని, ఒకే పార్టీని నమ్ముకున్న కులం కాని రాజకీయంగా ఎంతో నష్టపోక తప్పదు. ప్రతి కులం, ప్రతి పార్టీ ఈ విషయం గుర్తెరిగి నడవాలి.
కమ్మ కుల పరంగా చూస్తె, చంద్రబాబు గతంలో కన్నా కొంత మెరుగైన ధోరణిలోనే వ్యహరిస్తున్నారనే విషయం ఈ మధ్య జరిగిన చాలా విషయాలలో అర్ధమౌతుంది. కాని, చంద్రబాబు ఏ మాత్రం భయపడకుండా 'కమ్మ వారి సంఘం' (సంఘాలు) నిర్వహించే సభలకు ధైర్యంగా హాజరైనప్పుడే ఆయన పూర్తిగా మారారని మనం చెప్పుకోవచ్చు, మనం ఆయనని విశ్వసించ వచ్చు. .
Comments