ఈ మధ్యన నా ఫ్రెండ్ ఒకాయన (వేరే కులం) అన్ని కులాల వాళ్ళు గర్జిస్తున్నారు.. మరి మీరెప్పుడు గర్జిస్తారు అని అడిగాడు. ఇదే ప్రశ్న నన్ను కమ్మ సంఘాల్లోని కొందరు కుర్రాళ్ళు కూడా అడిగారు. నాకు కూడా ఈ సందేహం రెండు దశాబ్దాల క్రితమే కలిగింది... ఆ సమయంలో కొందరు కులాల గర్జనలు పెట్టుకుని కమ్మ వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. అప్పటి నుండే ఈ రాష్ట్రంలో కులాల కుంపటి రాజుకుంది. మనం కూడా "కమ్మ గర్జన" పెట్టుకుని మన బలం ఏమిటో ఇతర కులాల వారికి చూపించ వచ్చు కదా అని కొందరు పెద్దలను అడిగితే వారిచ్చిన సమాధానం ఈవిధంగా ఉంది. "నిజంగా గర్జించే పులి రోజూ గర్జిస్తూనే ఉంటుంది.. ఆ మాత్రం దానికి అది వేదికలెక్కి రుజువు చేసుకోనవసరం లేదు... ఐనా మనం రోడ్డు మీదకి వచ్చి గర్జిస్తే ఎదుటి వాళ్ళు బెదిరిపోవటానికి ఇదేమి అడవి కాదు.. మన ఒక్క కులం వాళ్ళు గర్జిస్తే అనేక ఇతర కులాల వాళ్ళు మనకు పోటీగా బదులిస్తారు కాబట్టి గర్జనలు.. గాండ్రింపులు మనకొద్దు, మనం అన్ని కులాల వారితో సామరస్యంగా ఉందాం.. అనవసరంగా గర్జించి, గాండ్రించి వారితో గిల్లికజ్జాలు పెట్టుకోవద్దు నాయనా!" అంటూ అయన బదులిచ్చాడు... ఆయన ...
visit www.kammavelugu.org for more information and History of Kamma caste, kammavar, కమ్మ, కమ్మ వారు, కమ్మ నాయుడు, Kamma Naidu, Naidoo community people across the Globe