ఈ మధ్యన నా ఫ్రెండ్ ఒకాయన (వేరే కులం) అన్ని కులాల వాళ్ళు గర్జిస్తున్నారు.. మరి మీరెప్పుడు గర్జిస్తారు అని అడిగాడు. ఇదే ప్రశ్న నన్ను కమ్మ సంఘాల్లోని కొందరు కుర్రాళ్ళు కూడా అడిగారు.
నాకు కూడా ఈ సందేహం రెండు దశాబ్దాల క్రితమే కలిగింది... ఆ సమయంలో కొందరు కులాల గర్జనలు పెట్టుకుని కమ్మ వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. అప్పటి నుండే ఈ రాష్ట్రంలో కులాల కుంపటి రాజుకుంది. మనం కూడా "కమ్మ గర్జన" పెట్టుకుని మన బలం ఏమిటో ఇతర కులాల వారికి చూపించ వచ్చు కదా అని కొందరు పెద్దలను అడిగితే వారిచ్చిన సమాధానం ఈవిధంగా ఉంది. "నిజంగా గర్జించే పులి రోజూ గర్జిస్తూనే ఉంటుంది.. ఆ మాత్రం దానికి అది వేదికలెక్కి రుజువు చేసుకోనవసరం లేదు... ఐనా మనం రోడ్డు మీదకి వచ్చి గర్జిస్తే ఎదుటి వాళ్ళు బెదిరిపోవటానికి ఇదేమి అడవి కాదు.. మన ఒక్క కులం వాళ్ళు గర్జిస్తే అనేక ఇతర కులాల వాళ్ళు మనకు పోటీగా బదులిస్తారు కాబట్టి గర్జనలు.. గాండ్రింపులు మనకొద్దు, మనం అన్ని కులాల వారితో సామరస్యంగా ఉందాం.. అనవసరంగా గర్జించి, గాండ్రించి వారితో గిల్లికజ్జాలు పెట్టుకోవద్దు నాయనా!" అంటూ అయన బదులిచ్చాడు... ఆయన సమాధానంతో నాకు జ్ఞానోదయం అయ్యింది.
ఈ మధ్యన కొందరు కుర్రాళ్ళు "మన కులంలో కూడా కొందరు ఆర్ధికంగా వెనుకబడి, పేదరికంలో జీవిస్తున్నారు కదా! మరి మనం కూడా మన కులం వారిని బిసిల్లో చేర్చమని ఆందోళన చేయవచ్చు కదా!!" అని ఇంకో సందేహం లేవనెత్తారు.. నిజమే! కమ్మ వారిలో అనేక మంది పేద వాళ్ళు ఉన్నారు.. కమ్మ వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉంటుంది, ఆకలైనా సరే! ఎవ్వరి వద్దా చేయిచాపి అడుక్కునే గుణం కమ్మవారిలో కనిపించదు.. తెలివితేటలతో, కష్టపడి, పేదరికాన్ని జయించాలనే చూస్తారు తప్ప ఇతరుల దయ, జాలి, దానం ఆశించరు.
కోస్తా జిల్లాల్లో అన్ని కులాల్లో ధనవంతులున్నారు, అదే విధంగా పేదవాళ్ళు కూడా ఉన్నారు. తమ కులంలో ఆర్ధికంగా వెనుకబడిన వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోమనటం, రిజర్వేషన్లు కల్పించమనటం న్యాయమే కానీ.. రిజర్వేషన్ల పేరు చెప్పి కొన్ని కులాల వాళ్ళు తమ కులంలో ధనవంతులకు, భూస్వాములకు కూడా రిజర్వేషన్లు కల్పించమని అడుక్కోవటం, బెదిరించటం అన్యాయం.. ఆర్ధికంగా, సామాజికంగా బలంగా ఉన్నామని, అన్నిరంగాల్లో తమకు తిరుగులేదని ఒకపక్క చెప్పుకునే వీళ్ళు మరోపక్క తామంతా ఆకలితో అలమటిస్తున్నామని, ఒక ముద్ద దానం చేసి తమ ప్రాణాలు నిలపమని దీనాతి దీనంగా అడుక్కోవటం హేయమైన చర్య. పేద వాడి పేరు చెప్పి, వారి పేదరికాన్ని అడ్డం పెట్టుకుని వారి పేరుమీదుగా ప్రయోజనాలు కొట్టేద్దామని కొంతమంది ధనవంతులు ఈ నాటకాన్ని ఆడుతున్నారు.
కమ్మైనా, కాపైనా, రెడ్డైనా, రాజైనా, బ్రహ్మలైనా, కోమట్లైనా, కులమేదైనా.. పేదవాడికి మాత్రమె రిజర్వేషన్లు దక్కాలి తప్ప కులం ముసుగులో ధనికులు సైతం రిజర్వేషన్ల ప్రయోజనాలు ఆశించటం నిజంగా ఎంగిలి కూటికి ఆశపడటమే!
కులాల ప్రమేయం లేకుండా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో అన్ని కులాల వారికి కనీసం పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు కల్పిస్తే ఆర్ధిక అసమానతలు, వెనుకబాటు తనం కొంతవరకు తగ్గే వీలుంటుంది. ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పేద వాడికే దక్కాలి తప్ప.. బడా బాబులకు, దహనవంతులకు కాదు... ఈ విషయంలో కోర్టులు కూడా చొరవ తీసుకుని ఒక పరిష్కారం సూచించాలి.
Comments