చలికాలంలో వీచే చల్లని గాలులు, కురిసే పొగమంచు మనుషుల రూపు రేఖలను మార్చేస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద చలిగాలి ప్రభావం తీవ్రంగా వుంటుంది. చర్మం పొడారిపోయినట్లు అవటమేకాక, దురద కూడా వుంటుంది. పెదాలు పగులు తాయి. ముఖం మీద చెమటపొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి ఏర్పడే యిటువంటి మార్పుల వల్ల చర్మపు సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిరుసెక్కి ముఖం అందవికారంగా కనిపిస్తుంది.
ఈ కాలంలో ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకు శరీర ఆకృతితోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చలికాలంలో మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉండడంతో అవసరం కన్నా అతితక్కువ మంచినీటిని తాగడం ఈ కాలంలో సాధారణం. కాని అలా చేయడంతో జీర్ణశాయం పని తీరు కష్టసాద్యం అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గి మొఖం పొడిబారి పోతుంది. నీరు ఎక్కువగా తాగితే పొడి చర్మం నుంచి రక్షణ పొందవచ్చు.
చలికాలం రోజుకు కనీసం అరగంట పాటయినా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.
ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి స్నానం చేయాలి. ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. సాదారణ సబ్బుకు బదులు గ్లిజరిన్ సబ్బులు వాడాలి,
ముఖ సౌందర్యాన్ని కాపాడుకోడానికి ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి, విటమిన్ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది. గాలిలో తేమ చలికాలంలో బాగా తగ్గిపోతుంది కాబట్టి చర్మం కూడా ఈ సీజన్‌లో పొడిబారిపోతూ ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం కలవారు.. సాదా చర్మం కలవారు చలికాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిందే.
రాత్రి పడుకునే ముందు చేతులకు, కాళ్ళకు వేజలైన్ రాసుకోవాలి, పాదాలు పగల కుండా 'సాక్స్ ' వేసుకుంటే మంచిది, వారానికు ఒకసారైన హాట్ ఆయిల్ తో మసాజ్ చే్సుకోవాలి.
ఉదయంపూట 1/4 లీటరు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, అల్లం లేదా పుదినా ఆకు, పది చుక్కల నిమ్మ రసంతో కలిపి తీసుకుంటే మంచిది.
ఉదయం..రాత్రి భోజనం తర్వాత ఆపిల్, దానిమ్మ, అరటి, లేక ఏదైనా ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి.
రాత్రి పూట వరి అన్నం బదులుగా గోధుమ రవ్వ అన్నం లేదా గోధుమ పుల్కాలు, చపాతీ తినటం మంచిది.

Comments