ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన అతి క్లిష్టమైన సమయంలో ఒకే సారి కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఇప్పుడు సీమాంధ్ర రాష్ట్ర నిర్మాణం అనేది ఒక పెద్ద సమస్య. ఇటుక, ఇటుక పేర్చుకుని ఏంటో జాగ్రత్తగా నిర్మాణం చేసే నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం త్వరిత గతిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం కుల, మత, ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టి ఒక దార్శనికుడు, అభివృద్ధి, పరిపాలన రంగంలో అనుభవం ఉన్న నేత కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలు, వాటి అధినాయకులను ఒక్క సారి పరిశీలిస్తే, ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పటి వరకు, కుల, మత, ప్రాంతీయ తత్వాలకు ఆజ్యం పోసింది, ఒక రకంగా రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం అయ్యింది. ఈ పార్టీకి ప్రాంతీయ దృక్పదం ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే నాయకుడు లేడు, పరిపాలన, నిర్ణయాలు అన్ని హై కమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే జరుగుతాయి. ఎవరో దిగ్విజయ్ సింగ్, గులాం నబి ఆజాద్, వీరప్ప మొయిలి, చిదంబరం, జైరాం రమేష్ ఆదేశాలకు అనుగుణం గా ఈ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళకి వెన్నెముక, స్వంత ఆలోచన అనేవి ఉండవు. అందుకే అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుని ఇరు ప్రాంతాల వారి ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా, సీమంధ్ర ప్రాంతానికి, హైదరాబాద్ నగరంలో స్థిరపడిన సీమంద్రులకు నష్టం కలిగించే రీతిలో రాష్ట్ర విభజన సమయంలో వ్యవహరించారు. ఈ పార్టీకి ఓటేస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. రాష్ట్రంలో, కేంద్రంలో పలు కుంభ కోణాల్లో ఇరుకున్న కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను మట్టి కరిపించాల్సిన సమయం ఆసన్నమైంది.
రెండో ప్రధాన జాతీయ పార్టీ BJP కి ఒక రకంగా ఈ రాష్ట్ర విభజనలో కొంత పాత్ర ఉంది. ఆ పార్టీ విధానం చిన్న రాష్ట్రాలకు అనుకూలం, గతంలో ఎప్పుడోనే ఆ పార్టీ 'తెలంగాణా' రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ప్రత్యెక 'తెలంగాణా' రాష్ట్ర బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్ ఉభయ సభలలోను ఓటు చేసింది. కాకపోతే గుడ్డిలో, మెల్ల అన్న చందంగా 'సీమాంధ్ర' రాష్ట్రానికి కొన్ని ఆర్ధిక ప్యాకేజీల కోసం, పోలవరం, మరి కొన్ని ప్రాజెక్టుల కోసం, కొత్త రాష్ట్రంలో పారిశ్రామీకరణ వేగవంతం కావటానికి కొన్ని రాయితీల కోసం కొంతలొ కొంత పోరాడి సాధించి పెట్టింది. ఈ పార్టీ జాతీయ నాయకులు, కాబోయే 'ప్రధాన మంత్రి' నరేంద్ర మోడీ 'తెలంగాణా' కంటే 'సీమాంధ్ర' వైపే కొంత సానుకూల వైఖరి కలిగి ఉన్నారు, పైగా ఈయన 'చంద్రబాబు నాయుడు' కు అత్యంత సన్నిహితులు. కేంద్రంలో BJP అధికారంలోకి వస్తే 'సీమాంధ్రకు' జరిగిన నష్టం పూడ్చుకుని త్వరిత గతిన అభివృద్ధి చెందటానికి యెంతో అవకాశం ఉంది.
కమ్యూనిస్ట్ పార్టీల గురించి ఇక్కడ యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ పార్టీలకు అనైతిక పొత్తులతో బలం పెంచుకోవాలనే ఆలోచన తప్ప ఒక నిబద్ధత, సరైన ద్రుక్పధం లేదు. గతంలో విశాలాంధ్రకు మద్దతిచ్చిన సిపిఐ ఇప్పుడు 'తెలంగాణాకు' అనుకూలంగా ఉద్యమాలు చేసింది, నిర్ణయం తీసుకుంది. సిపిఎం కు విధానం అంటూ లేదు. పచ్చి అవకాశవాద పార్టీ.. 'తెలంగాణా ప్రాంతంలో 'తెరాస తోనూ, 'సీమాంధ్ర' ప్రాంతంలో YSRCP తోనూ అనైతిక పొత్తులకోసం అర్రులు చాస్తుంది. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో కాని కేంద్రంలో కాని కలలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, కాబట్టి ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తె ఆ ఓటు మురిగి పోయినట్లే.
లోక్ సత్తా పార్టీ గురించి, జయప్రకాశ్ నారాయణ్ గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ పార్టీ జగన్, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చి వాటికీ ప్రయోజనం కలిగించటానికి తప్ప దేనికి పనికిరాదు. ఈ పార్టీకి ఓటు వేస్తే ఆ రెండు పార్టీలకు ప్రయోజనం, 'తెలుగుదేశం' పార్టీకి నష్టం కలిగించినట్లే!
ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకో తగిన బలం ఉన్న మరో ప్రాంతీయ పార్టీ YSRCP. ఈ రాష్ట్రంలోనే కాక, ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ అవినీతి ఆరోపణలు కలిగిన రాజకీయ నాయకుడు, కోర్టులలో అనేకమైన కేసులలో విచారణ ఎదుర్కొంటున్న నాయకుడు, ఆర్ధిక ఉగ్రవాది, ఒక హంతకుడు, శాడిస్ట్, సైకో గా ముద్రపడిన నాయకుడు, 'దోచుకో, దాచుకో' అనే ఏకైక విధానంతో ఈ రాష్ట్ర ఖనిజ సంపద, ఆర్ధిక సంపద అనేకమైన అక్రమ మార్గాల ద్వారా దోచుకున్న ఏకైక నాయకుడు జగన్ YSRCP కి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయనకు మంచి చదువే కాదు, మంచి తెలివి తేటలు, మంచి ద్రుష్టి కూడా లేదు. జగన్ దురాశ, వక్ర బుద్ధి, చెడు ఆలోచన, విపరీత ప్రవర్తన, చంచలత్వం, తను కోరుకున్న దాన్ని సాధించటం కోసం ఎటువంటి మార్గాన్నైనా ఎన్నుకోవటానికి వెనుదీయని నేర మనస్తత్వం కలిగిన లక్షణాలు కలిగి ఉన్నవాడని మానసిక వేత్తలు ఎందరో చెప్పారు. "కొన్ని క్రూర మృగాలు పంజరంలోనే ఉన్నప్పుడే అరణ్యంలో అనేక జంతువులకు రక్షణ దొరుకుతుంది, కొన్ని మానవ మృగాలు జైల్లో ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు రక్షణ లభిస్తుంది".
జగన్ అధికారంలోకి రావటం అనేది నిజంగా తలచుకొంటేనే ఒక పీడకల! జగన్, అతని పరివారం షర్మిల, అనిల్ కుమార్, విజయమ్మ, వై.వి సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఎన్నికలలో నిలబడి ఈ రాష్ట్రాన్ని దోచుకోటానికి సిద్ధంగా ఉన్నారు. తాను అధికారంలో వస్తే YSR చూపిన అక్రమాల రాచబాటలో ఈ రాష్ట్రాన్ని దోచుకుని, తమ సంపాదన ఎన్నో రెట్లు పెంచుకోటానికి జగన్ మరియు అతని కుటుంబం కాచుకుని కూర్చుంది. YSR దుష్పరిపాలన తాలూకు అక్రమాలు ఇప్పటికి రోజు కొక్కటి బయట పడుతున్నాయి.. YSR అనే విషవృక్షానికి కాచిన కాయలు YS Jagan and family. కాబట్టి విజ్ఞులైన ఓటరులారా దయచేసి దుష్టులకు (YSRCP) ఓటు వేయకండి, ఓటు విలువను కాపాడండి.
'తెలంగాణా', 'సీమాంధ్ర' రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ 'తెలుగుదేశం' ఒక్కటే. గతంలో ఈ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ళు పరిపాలించి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకు వెళ్ళింది ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి 'చంద్రబాబు నాయుడే!'.
'కుల, మత, ప్రాంతీయ తత్వాలకు, కుటుంబ పాలనకు అతీతంగా ఈ రాష్ట్రానికి సమర్ధవంతమైన పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని NTR ఈ ప్రపంచానికి చాటి చెబితే, తెలుగు వాడి సమర్ధతను, శక్తిని ఈ దేశానికి తెలియచేసిన వాడు చంద్రబాబు నాయుడు. NDA కన్వీనర్ గా ఇదు సంవత్సరాల కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న BJP పార్టీతో సఖ్యత నెరపి ఎన్నో, పధకాలు, ప్రాజెక్టులు మన రాష్ట్రానికి సాధించుకు వచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో నడిపించిన నాయకుడు చంద్రబాబు. ఈ రాష్ట్రం IT మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అత్యంత అభివృద్ధి చెంది ఎన్నో వేలకోట్లు ఆదాయం పొందుతూ, ఎన్నో లక్షల మంది విద్యావంతులు మన రాష్ట్రంలో, ఉద్యోగం, ఉపాధి పొందుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు దార్శనికత, దూరదృస్టి వలెనే సాధ్యం అయింది అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ మరువలేని విషయం.
ఈ కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్నప్రధాన సమస్య 'రాష్ట్ర నిర్మాణం' , ఈ ప్రత్యెక పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాటానికి అర్హతలు ఉన్న ఏకైక నాయకుడు, గతంలో పాలనా అనుభవం ఉన్నవాడు, సమర్ధమైన పాలన అందించిన వాడు, కేంద్ర రాజకీయాల్లో అనుభవం, దక్షత కలిగిన వాడు చంద్రబాబు నాయుడు మాత్రమే! ఈ రాష్ట్రంలో 'తెలుగుదేశం', కేంద్రంలో 'బి.జె.పి. అధికారంలోకి వచ్చినప్పుడే 'బంగారు సీమాంధ్ర' కల నేరవేరుతుంది. మన రాష్ట్ర పాలన సమర్ధుడైన నేతకు అప్పగిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఈ దేశంలోనే మన రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుదాం.
'కుల మతాలకు అతీతంగా సమర్ధుడైన నాయకుడికే పట్టం కడదాం... సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం.. తెలుగుదేశాన్ని గెలిపిద్దాం'.
'జై బంగారు సీమాంధ్ర'
Comments