కమ్మ వారు, ముఖ్యంగా కమ్మ యువత ఎక్కువగా అభిమానించే హీరో జూనియర్
యన్.టి.ఆర్. కమ్మ యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్ మరే కమ్మ హీరోకి లేదంటే
అతిశయోక్తి కాదు. పాత తరం కమ్మవారు ఎక్కువగా రామారావును, కృష్ణను, నాగేశ్వర
రావును అభిమానించే వారు.
ఆ తరువాత తరం వారు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లను అభిమానించేవారు. ప్రస్తుత తరంలో కమ్మ యువత జూనియర్ యన్.టి.ఆర్ ను ఎక్కువగా అభిమానించటానికి ముఖ్య కారణం అతనిలో ఉన్న తాత యన్.టి.ఆర్ పోలికలు ఒక కారణమైతే, రెండో కారణం కమ్మవారిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అతన్ని పార్టీ వ్యక్తిగా భావించి అభిమానించి మద్దతు తెలియచేస్తున్నారు.
జూనియర్ యన్.టి.ఆర్ ను చాలా కాలం క్రితం వరకు నందమూరి కుటుంబం వారు తమ
కుటుంబ సభ్యుడిగా భావించలేదు, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని
అతన్ని నందమూరి కుటుంబం లో ఒకడిగా అందరిని ఒప్పించి, అతను కలలో కూడా ఉహించని విధంగా కొన్ని వందల కోట్ల
కట్నమిచ్చి తన మేనకోడలి కూతురితో వివాహం జరిపించి అతనికి, అతని తల్లికి ఒక
గుర్తింపు ఇచ్చాడు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి
చూస్తే చంద్రబాబు కాని, నందమూరి కుటుంబం కాని ఎంత పెద్ద తప్పు చేశారో
అర్ధమౌతుంది. జూనియర్ యన్.టి.ఆర్ 'స్టూడియోN' చానల్ ను తన ఆధీనంలోకి
తెచ్చుకొని ఆ ఛానెల్లో చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి
వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేయటమే కాకుండా, కమ్మవారికి, తెలుగు దేశం
పార్టీకి బద్ధ శత్రువైన 'జగన్'కు అతని పార్టీకి అనుకూలం గా భజన చేయటం
చూస్తుంటే, 'కనకపు సింహాసనంబున శునకమును గూర్చుండబెట్టిన' అనే సామెత
గుర్తుకు వస్తుంది.
నిజంగా, అతనికి కుటుంబ వివాదం ఏమైనా ఉంటె ఆ విషయాలు వాళ్ళతోనే తేల్చుకోవాలి కాని, ఇలా రోడ్డెక్కి కుటుంబాన్ని, పార్టీని రచ్చ చేయటం అతనికి కాని, అతని భవిష్యత్తుకు కాని మంచిది కాదు.
నిజంగా, అతనికి కుటుంబ వివాదం ఏమైనా ఉంటె ఆ విషయాలు వాళ్ళతోనే తేల్చుకోవాలి కాని, ఇలా రోడ్డెక్కి కుటుంబాన్ని, పార్టీని రచ్చ చేయటం అతనికి కాని, అతని భవిష్యత్తుకు కాని మంచిది కాదు.
తెలుగుదేశం పార్టీని, జూనియర్ యన్.టి.అర్ ను అభిమానించేవారు ఎందరో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, జూనియర్ యన్.టి.అర్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరికి పార్టీ శ్రేయస్సు, మనుగడ ముఖ్యం తప్ప వ్యక్తుల శ్రేయస్సు ముఖ్యం కాదు.
ఒక్క సారి గతం లోకి వెళ్లి పరిశీలిస్తే, గతంలో కృష్ణ, నాగార్జున రాజశేఖర రెడ్డి విసిరిన 'కుక్క బిస్కెట్లకు' అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డికి చెక్క భజన చేశారు, వీరిని మనం కమ్మవారి శ్రేయోభిలాషులుగా ఎప్పుడూ భావించనవసరం లేదు.
కాని మనం ఇక్కడో విషయం నిశితంగా పరిశీలిస్తే కనుక, హీరో మహేష్ బాబు కు గతంలో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి ఎన్నో ప్రలోభాలు ఎరవేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రావాలని, లేదా కనీసం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అతన్ని ప్రచారంలో అయినా వాడుకోవాలని చూశారు. మహేష్ బాబు తండ్రి కృష్ణకు 'రాజ్యసభ' సభ్యత్వం, అతని బాబాయికి MLC పదవి, ఇంకా ఆర్ధికంగా కొన్ని ప్రయోజనాలు ఇవ్వజూపినా 'మహేష్ బాబు' వారికి మద్దతు తెలియచేయటానికి కాని, తెలుగుదేశం పార్టీని విమర్సించ టానికి కాని ఇష్టపడలేదు. వారి కోరిక కాదని అన్నందుకు తన ఇంటి మీద, స్టూడియో పైన 'ఆదాయపు పన్ను' శాఖ దాడులు చేయించినా చలించకుండా తన మాట మీదే నిలబడి ఉన్నాడు.
వివాద రహితుడు, తండ్రి మాటను కాదని 'కాంగ్రెస్' పార్టీని దూరం చేసిన 'మహేష్ బాబు' హీరోనా? లేక 'తండ్రి, తాత కలల సౌధం తెలుగుదేశం పార్టీని నాశనం చేయటానికి కంకణం కట్టుకున్న 'హరికృష్ణ, జూనియర్ యన్.టి.ఆర్ లు హీరోలా?
ఇప్పటికైనా ఆలోచించండి, కమ్మ హీరోల్లో నిజమైన హీరో ఎవరో! నటనలో 'దమ్ము' కాదు, చేతల్లో 'దమ్ము' చూపించేవాడే నిజమైన 'మగాడు'.
కమ్మ వారిలో బాలకృష్ణ అభిమానులు బహిరంగంగా కాకపోయినా కనీసం బ్లాగ్స్ లో కాని, వెబ్ లో కాని రెండవ ప్రాధాన్యత ,మహేష్ బాబు' కు ఇస్తే బాగుంటుంది.
Comments
వీళ్ళకే అధికారం ఇచ్చుంటే ..కనీసం లక్ష్మీపార్వతి ని కూడా అడ్డుకోలేక పోయేవాళ్ళు...... ఇప్పుడు పార్టీ కి వ్యతిరేకం గా పని చేస్తే , రేపు రాజకీయాల్లోకి వచినపుడు ఏ మొహం పెట్టుకుని మనల్ని ఓట్లు అడుగుతారు ... ఇప్పటికే విలువలులేని, మానవత్వం లేని వాడు అని బాగా పాపులర్ అయ్యాడు NTR .. ఇది కులం మాట కాదు 90 % పైగా అభిమానుల మాట...
--