'సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది'. జగతి పబ్లికేషన్స్‌తో పాటు జగన్‌కు చెందిన సంస్థల ఆర్థిక లావాదేవీలను ఈ రోజు సీబీఐ స్తంభింపజేసింది. 1944 ఆర్డినెన్స్ ఆధారంగా సీఆర్‌పీసీ 102 సెక్షన్ ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని జగన్ సంస్థల ఖాతాలలో ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు సీబీఐ పేర్కొన్నది.
'జగన్' అవినీతి, ఆర్ధిక మూలాలపై సిబిఐ ఉక్కు పాదం మోపుతోంది. ఈ చర్య అంతం కాదు ఆరంభం మాత్రమె! 'జగన్' అరెస్ట్ కు సిబిఐ మరి కొంత సమయం తీసుకొనవచ్చు, ఈ లోపు మారిషస్, మొదలైన దేశాలనుండి సేకరించిన సమాచారం ఆధారంగా జగన్ మిగిలిన కంపెనీల పైన కూడా ఇదేవిధమైన చర్య తీసుకోవచ్చు.
ఆ తరువాత 'జగన్' అరెస్ట్, ఆస్థుల స్వాధీనం ఇక లాంచన ప్రాయమేనని పరిశీలకులు భావిస్తున్నారు.
సిబిఐ సంస్థ ' అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని, 'జగన్' సంస్థల ఆర్ధిక లావాదేవీలను స్థంబింప చేయటం వంటి చర్యలు రాజకీయ కక్ష సాధింపు చర్యలు గా 'జగన్' బృందం అభివర్ణించింది."చట్టం తన పని తాను చేసుకు పోతుంది, సిబిఐ నిస్పాక్షికతను ప్రశ్నించటం అవివేకం!" అని 'జగన్' తండ్రి ఎప్పుడూ చెబుతుండేవాడు.
గతంలో వై.యస్.ఆర్ సిబిఐ ని వాడుకున్నట్లుగా ఏ ముఖ్య మంత్రి వాడుకోలేదు. గనుల పందేరాలు, జలయజ్ఞం, భూముల పందేరాలు, రాజకీయ హత్యలు మొదలైన విషయాలు అన్నింటిలోను సిబిఐ ని జేబు సంస్థగా వాడుకున్న వై.యస్.ఆర్, స్వతంత్ర ప్రతిపత్తి గల ఆ సంస్థ పరపతిని బ్రస్టు పట్టించాడు. పరిటాల రవి కేసు విషయం విచారణలో భాగంగా సిబిఐ 'జగన్' ను తన కార్యాలయానికి పిలిపించుకోకుండా 'జగన్' ఇంటికే వెళ్లి విచారణ జరిపి 'క్లీన్ చిట్' ఇచ్చి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.
ప్రస్తుతం సిబిఐ పార్టీ గతంలో కంటే ఏంటో మెరుగ్గా పని చేస్తుంది. 'జగన్' అరెస్ట్ విషయంలో సిబిఐ తాత్సారాన్ని, విజయసాయి రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా కోర్టు కూడా తప్పుబట్టింది. కాంగ్రెస్ పార్టీ తో సహా అన్ని పార్టీల వారు ;జగన్' అరెస్ట్ విషయంలో సిబిఐ మెతక వైఖరి పై ఎన్నో విమర్శలు చేశారు.
'జగన్' అరెస్ట్, ఆస్థుల స్వాధీనం వ్యహారంలో ఇప్పటికే ఎంతో జాప్యం జరిగింది. సిబిఐ ఇప్పటి కైనా చురుగ్గా వ్యహరిస్తున్నందుకు అభినందించాలి. Enforcement Directorate తో కలిసి పనిచేస్తూ త్వరలోనే సిబిఐ 'జగన్' ఆస్థుల వ్యహారం ఒక కొలిక్కి తెస్తుందని ఆశిద్దాం!

Comments