ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్ధుల జాబితా చూస్తే జగన్మోహన్ రెడ్డి తో కిరణ్ కుమార్ రెడ్డి లాలుచీ పడ్డాడని స్పష్టంగా అర్ధమౌతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఒక కులానికి, వర్గానికి ప్రతినిధిగా, జగన్ మోహన్ రెడ్డికి కోవర్టుగా వ్యహరిస్తున్నాడు. ఈ విషయం గతంలో కూడా అనేక సందర్భాలలో వెల్లడైంది, తనకు ముఖ్యమంత్రిగా రోజులు దగ్గర పడ్డాయని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి చివరి రోజులలో తన చర్యల ద్వారా జగన్ మోహన్ రెడ్డి సహాయ పడాలని, తద్వారా కుల బాంధవుడిగా, రాజశేఖర రెడ్డి ఋణం తీర్చుకున్న వాడిగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు.
కాంగ్రెస్ పార్టీ తరుపున కావాలనే రాజంపేట, రాయచోటి, ఒంగోలు నియోజక వర్గాలలో బలమైన 'బలిజ' కులస్తులను విస్మరించి తన వర్గం వారికి కట్టబెట్టాడు. ఇక్కడ 'రెడ్డి' సామాజిక వర్గం ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం లేదని తెలిసి కూడా తన సామాజిక వర్గం వారిని నిలబెట్టటం వెనుక 'జగన్' ప్రయోజనం పొందాలనే వ్యూహం అర్ధమౌతుంది.
అలాగే 'మాచెర్ల' నియోజకవర్గంలో బలమైన BC వర్గం వారిని విస్మరించి తన వర్గం వారికి ఇచ్చాడు, ఆర్ధికంగా, కులపరంగా బలమైన 'గల్లా జయదేవ్' కు ఇస్తే గెలిచే అవకాశమున్న 'తిరుపతి' స్థానంలో 'జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆనుకూలంగా వ్యవహరిస్తూ 'బలిజ' అభ్యర్ధికి ఇచ్చాడు, ఇక్కడ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల మధ్య 'బలిజ' ఓట్లు చీలి 'జగన్' పార్టీ అభ్యర్ధి 'కరుణాకర్ రెడ్డి' గెలవాలని 'కిరణ్ కుమార్ రెడ్డి' 'జగన్' మధ్య కుదిరిన రహస్య అజెండాగా రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఒక పధకం ప్రకారం కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తూ జగన్ పార్టీకి లబ్ది చేకూర్చే పధకాలు రచిస్తున్నాడు.
పై నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కనీసం 'రెండో' స్థానంలో నిలిచే పరిస్థితి కూడా లేదు.

Comments