నందమూరి నట వారసులు ఐక్యంగా నిలిచి 'తెలుగుదేశం' పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకోవటం తెలుగుదేశం నాయకత్వానికి, నందమూరి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. నటరత్న వారసత్వాన్ని పుణికిపుచుకున్న బాలకృష్ణ, జూనియర్ యన్.టి.ఆర్ లకు ఆంధ్ర దేశంలో అశేష అభిమానులున్నారు. 'అబ్బాయి, బాబాయి' కాంబినేషన్ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయానికి బాటలు వేస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు, నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.
నవంబర్ 5 తేది గుంటూరులో జరుగబోయే తెలుగుదేశం పార్టీ 'యువ గర్జన' కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించటం ఖాయం.
తారకరత్నకు, జూనియర్ యన్.టి.ఆర్ కు విభేదాలున్నాయని మీడియాలో వచ్చిన వార్తలు నిరాదారమయినవే. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ యన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ కలిసే ఉన్నారు, అందరు ఐక్యంగా ప్రచారానికి వస్తున్నారు.
తెలుగు చలన చిత్ర రంగంలో ఇప్పుడున్న హీరోలలో చిరంజీవికి సాటి రాగల హీరో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కు పోటి జూనియర్ యన్.టి.ఆర్. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది జూనియర్ యన్.టి.ఆర్ చిత్రం 'యమదొంగ'.
వంద చిత్రాల అనుభవం ఉన్న నటులకంటే, వారి అనుభవం కన్నా తక్కువ వయసు ఉన్న జూనియర్ యన్.టి.ఆర్ నటనలలో పరిణతి ఉంది. అందుకే రికార్డులతో పాటుగా అఖిలాంధ్ర లో అభిమానులను కుడా అధికంగా సంపాదించుకున్నాడు జూనియర్ యన్.టి.ఆర్.
రాబోయే పక్షం రోజుల్లో జరుగబోయే 'యువ గర్జన' నందమూరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు 'దీపావళి' తరువాత వచ్చే మరో పండుగ కాబోతుంది.

Comments