తెలుగుదేశం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిన సి.రామచంద్రయ్య స్థానంలో ఖాళి అయిన రాజ్యసభ సీటుకు జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేయటానికి ఆ పార్టీ అధిష్టానం నటశేఖర కృష్ణకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
గత 15 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కమ్మ వారిని ఒక్కరిని కూడా రాజ్యసభకు ఎంపిక చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో కమ్మ వారి పరిస్థితి 'కరివేపాకు'లాగా తయారైంది.
గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున సీటు గ్యారంటీ అని ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో అవకాశం చేజారిన కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ సారి రాజ్యసభ సీటు తనకు కాని, కృష్ణకు కాని కేటాయించే షరతుతోనే కృష్ణ, మహేష్ బాబు అభిమానులను కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించటానికి సన్నద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
1985 లో కాంగ్రెస్ పార్టీ నుండి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 'లోకసభ'కు ఎన్నికయిన 'సూపర్ స్టార్ కృష్ణ' మరోసారి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వటం ద్వారా పార్లమెంట్ లోనికి ప్రవేశించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల కధనం.
ఈ ఏకైక రాజ్యసభ సీటు కోసం 'దక్కన్ క్రానికల్' అధినేత టి.వెంకట్రామి రెడ్డి కూడా తీవ్రం గా ప్రయత్నం చేస్తున్నా చివరకు హీరో కృష్ణకే ఈ సీటు దక్కే అవకాశం ఉందంటున్నారు.
పద్మాలయా స్టూడియో, హీరో మహేష్ బాబు, రమేష్ బాబు, ఆదిశేషగిరి రావు అస్తులపైన గతంలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులకు పరిహారంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పద్మాలయా స్టూడియో కు చెందిన 100 కోట్లు విలువైన భూములను తిరిగి వారికే కట్టబెట్టిన ప్రభుత్వం త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కృష్ణ కుటుంబాన్ని మచ్చిక చేసుకోవటం ద్వారా ఆంధ్ర దేశంలో అశేషమైన అభిమానులున్న 'మహేష్ బాబు' గ్లామర్ ఉపయోగించుకోవటానికి యోచిస్తోంది.

Comments