కాంగ్రెస్ పార్టీ వారం రోజుల క్రితం ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో నిర్వహించిన రాజకీయ సర్వేలో ఆ పార్టీకి ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి.
ఆ సర్వేలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు సాదించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సర్వే పరిగణలోకి తీసుకున్న వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులలో కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీలు ఒంటరిగా పోటి చేయవచ్చని, బి.జే.పి, దేవేందర్ గౌడ్ 'నవ తెలంగాణా పార్టీ'లు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని, తెలుగుదేశం, వామపక్షాలు, టి.ఆర్.యస్, బి.యస్.పి పార్టీలు కూటమి ఏర్పాటు చేసి పోటీ చేసే అవకాశాలను ఈ సర్వే పరిగణలోకి తీసుకొంది.
తెలుగుదేశం పార్టీ నాయకులు వలస బాట పట్టినా కార్యకర్తలు పెద్దగా పార్టీకి దూరం కాలేదని, నందమూరి వారసుల ప్రచారం పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చి అదనపు లబ్ది చేకూరుస్తుందని, వామపక్షాల బలం, టి.ఆర్.యస్, బి.యస్.పి పార్టీల పొత్తు వల్ల కోస్తా, తెలంగాణా జిల్లాలలో తెలుగుదేశం అధిక స్థానాలు గెలుచుకోవచ్చని వెల్లడైంది.
తెలుగుదేశానికి 'శ్రీకాకుళం' నుండి 'పశ్చిమ గోదావరి' జిల్లాల వరకు 20 - 25 అసెంబ్లీ స్థానాలు, 'కృష్ణా' నుండి 'నెల్లూరు' జిల్లాల వరకు 40 స్థానాలు వస్తాయని, మొత్తంగా చూస్తే కోస్తా జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి 60 పైగా స్థానాలు లభించే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది.రాయలసీమలో తెలుగుదేశానికి 20 - 25 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణాలో 30 - 35 స్థానాలు దక్కవచ్చని, మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి 115 - 120 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని సర్వేలో వెల్లడైంది. తెలుగుదేశం మిత్రపక్షాలతో కలుపుకొని ఆ పార్టీకి 175 - 180 అసెంబ్లీ స్థానాలు దక్కవచ్చని ఈ సర్వే పేర్కొంది.
ప్రజారాజ్యం పార్టీ రెండో అతి పెద్ద పార్టీగా ఏర్పడవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ప్రజారాజ్యం పార్టీకి కోస్తా జిల్లాలలో 45 - 50 అసెంబ్లీ సీట్లు, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో 15 - 20 అసెంబ్లీ సీట్లు మించి రాకపోవచ్చని, మొత్తంగా చూస్తే 65 - 70 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవచ్చని సర్వేలో వెల్లడైంది.
కోస్తా జిల్లాల్లో బలంగా ఉన్న ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికలు సమీపించే సమయానికి అసెంబ్లీ టిక్కెట్లు ఆశించి పార్టీలో చేరిన అసంఖ్యాక అభ్యర్దులనుండి తిరుగుబాట్లు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని సర్వేలో విశ్లేషించారు. ఈ పరిణామం తెలుగుదేశానికి ఆఖరి క్షణంలో లాభం చేకూరుస్తుందని అంచనా వేసారు.
కాంగ్రెస్ పరిస్థితి కోస్తా, తెలంగాణా ప్రాంతాలలో దారుణంగా ఉన్నట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం 12 - 15 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాలు, రాయలసీమ ప్రాంతంలో 25 - 30 స్థానాలు, మొత్తంమీద 50 స్థానాలు మించి దక్కక పోవచ్చునని సర్వేలో పేర్కొన్నారు.
'లోక్ సభ' ఎన్నికలలో తెలుగుదేశం భారీగా లాభపడే అవకాశం ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. బి.ఎస్.పి పార్టీతో పొత్తు ఆ పార్టీకి శాసనసభ ఎన్నికలలో కంటే పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కువ లబ్ది కలుగజేస్తుందని అంచనా! మూడో ఫ్రంట్ మాయావతిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించటం, ఈ ఎన్నికలలో తెలుగుదేశం మిత్రపక్షాలు సాధించే పార్లమెంట్ సీట్లు మాయావతికి అభ్యర్ధిత్వానికి కీలకం కానుండటం కారణంగా సహజంగా కాంగ్రెస్ పార్టీకి వోట్ బాంక్ గా ఉన్న యస్.సి వర్గాలు ఈ సారి ఎన్నికలలో ఇష్టమున్నా, లేకపోయినా లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం కూటమికి అనుకూలంగా వోటు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కారణంగా పార్లమెంట్ ఎన్నికలలో యస్.సి వోట్లలో కొంత క్రాస్ వోటింగ్ జరుగవచ్చు అని సర్వేలో విశ్లేషించారు.
పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 22 స్థానాలు, ఆ పార్టీ మిత్రపక్షాలకు 10, ప్రజారాజ్యం పార్టీకి 5, కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు లభించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది.
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అవిశ్వాసం, ప్రస్తుత శాసన సభ్యుల, మంత్రుల అవినీతి, ఆ పార్టీకి ఎన్నికలలో తీరని నష్టం కలిగిస్తుందని సర్వేలో వెల్లడైంది.
మార్చి నెలలో ఎన్నికలు జరిగే పక్షంలో కరంట్ కోతలు, గిట్టుబాటు కాని వ్యవసాయోత్పత్తుల ధరలు ఈ ప్రభుత్వానికి మరింత కష్టాన్ని కలిగించవచ్చని అంచనా వేసారు.
కోస్తా జిల్లాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన బలంగా ఉన్న ఒక కులం వారు మూకుమ్మడిగా 'ప్రజా రాజ్యం' పార్టీకి మద్దతు తెలియచేయటం వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో బాగా నష్టం కలిగించ వచ్చని సర్వేలో పేర్కొన్నట్లు తెలిసింది.
సర్వే ఫలితాలను విశ్లేషించిన 'ముఖ్యమంత్రి' పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు తీసే ప్రయత్నాలను మొదలు పెట్టారని తెలిసింది. పార్టీలో తనకు ప్రత్యర్దులుగా ఉన్నవారిని మచ్చిక చేసుకొనే ప్రయత్నాలకు తెరతీసారని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు.
ఈ సర్వే ఫలితాలు కొంతవరకు నిరాశ కలిగించినా ముఖ్యమంత్రి దూకుడుకి అధిష్టానం వద్ద అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అసమ్మతివాదులు లోలోపల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరల 'ప్రత్యెక తెలంగాణా' అంశం తెరమీదకు తెచ్చేందుకు డి.ఎస్, యమ్.యస్, వి.హనుమంత రావు, మధు యాష్కి, ఉప్పునూతల మొదలైనవారు తమ ఆయుధాలను సిద్ధం చేసుకొంటున్నారు.

Comments