డా.మంచు మోహన్ బాబు కుమారుడు యువ హీరో 'మంచు విష్ణువర్ధన్ బాబు' వివాహ నిశ్చితార్ధం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సోదరుడు సుధీకర రెడ్డి కుమార్తె 'వేరోనిక' తో హైదరాబాద్ HITEX లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, చిత్ర రంగాలలోని ప్రముఖులు విచ్చేసి కాబోయె వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు హాజరైన ప్రముఖులలో 'తెలుగుదేశం' పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత డా.రామానాయుడు, ఈనాడు యమ్.డి చెరుకూరి కిరణ్, ప్రముఖ దర్శకుడు కోవెలమూడి రాఘవేంద్ర రావు మొదలైన వారు ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న రెండు కులాల వారి మధ్య వియ్యం త్వరలోనే కొన్ని అనూహ్య మార్పులకు దారి తీయవచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
'ప్రజారాజ్యం' పార్ట్టి అధ్యక్షుడు చిరంజీవి గతంలో నటరత్న నందమూరి బాటలోనే 'తిరుపతి' నుండి అసెంబ్లీ కి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చిరంజీవికి పోటిగా తిరుపతి నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున 'మోహన్ బాబు'ను పోటీ చేయించే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి ఉన్నట్లు తెలిసింది. తిరుపతి నియోజకవర్గంలో ఈ రెండు బలమైన కులాల వారి వోట్లు, చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన వారికంటే ఎక్కువే. మోహన్ బాబు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన పక్షంలో 'చిరంజీవికి' తిరుపతి లో గెలుపు కష్టం అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కొసమెరుపు: ఈ వివాహ నిశ్చితార్దానికి హాజరైన కొంతమంది ప్రముఖులు, వచ్చే మార్చి 1 వ తేదిన జరుగబోయే విష్ణు వివాహ సమయానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హొదాలొనూ, రాజశేఖర రెడ్డి ప్రతిపక్షనేత హొదాలొనూ హాజరయ్యే అవకాశాలున్నాయని, 'కుడి ఎడమయ్యే' అవకాశాన్ని తోసిపుచ్చలేమని గుసగుస లాడుకున్నారు.

Comments