తెలుగుదేశం పార్టీలో నందమూరి వారసుల ప్రవేశం మూలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, నందమూరి వారసులలోనే గ్రూపులు ఏర్పడ్డాయని, చంద్రబాబు స్థానానికే ముప్పు వచ్చేట్లుందని ఈమధ్య మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.
గ్రూపులు అనేవి అన్ని పార్టీల్లోనూ సహజమే. తెలుగుదేశంలో గ్రూపుల సంస్కృతి ఇప్పటివరకు పెద్దగా లేదు. పార్టీలో చంద్రబాబు నాయుడే కీలకమైన వ్యక్తి, పార్టీ వర్గాలలో ఎన్ని విభేదాలున్నా చంద్రబాబే చొరవ తీసుకుని పరిష్కరించేవారు.
కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గ్రూప్, డి.శ్రీనివాస్ గ్రూపు, వి.హనుమంత రావు గ్రూప్, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గ్రూప్, జైపాల్ రెడ్డి గ్రూప్, BC గ్రూప్, SC గ్రూప్, మైనారిటీ గ్రూప్ అని రకరకాల గ్రూపులు ఉన్నాయి.
ఇప్పుడే పుట్టిన 'ప్రజారాజ్యం' పార్టీలో కూడా చిరంజీవి గ్రూప్, మిత్రా గ్రూప్, అరవింద్ గ్రూప్, పవన్ కళ్యాణ్ గ్రూప్, కాపు కులసంఘాల గ్రూప్ అంటూ రకరకాల గ్రూపులు ఉన్నాయి.
కమ్యూనిస్ట్ పార్టీలలో, బి.జే.పి లో కూడా గ్రూపులున్నాయి. ఈ లెక్కన చూస్తే ఒక రకంగా 'తెలుగు దేశం' పార్టీలో గ్రూపుల సంస్కృతి తక్కువే!
తెలుగు మీడియా మిగిలిన పార్టీలను వదిలేసి 'తెలుగుదేశం' పార్టీలో చిన్న చిన్న విషయాలపైన ఎక్కువ దృష్టిపెట్టి 'గోరంతను కొండంతలు'గా చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది.
నందమూరి అభిమానుల్లో గ్రూపులు లేవు. అభిమానులందరూ హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ యన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ లను ఒకే రకంగా అభిమానిస్తారు. కాకపోతే 30 సంవత్సరాలలోపు వారిలో జూనియర్ యన్.టి.ఆర్ కు, 30 సంవత్సరాలు పైబడిన వారిలో బాలకృష్ణకు, హరికృష్ణకు ఎక్కుగా అభిమానులున్నారు.
చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి హరికృష్ణ, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి, చంద్రబాబు నాయుడుని 'ముఖ్య మంత్రి' చేయటమే తమ ధ్యేయమని ఇప్పటికే చాలాసార్లు బహిరంగంగా ప్రకటించారు.
సినిమాలలో రాణించలేకపోయినా 'తారకరత్న' రాజకీయాలలో సంచలనం సృష్టించటానికి ఏవో సంచలన ప్రకటనలు చేస్తున్న వాటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. 'బాలకృష్ణ' భవిష్యత్తులో ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించాడు కాని, కాబోయే ముఖ్య మంత్రి అని ఎక్కడా ప్రకటించలేదు. పార్టీలో మెజారిటీ శాసనసభ్యులు ఎన్నుకొంటే ముఖ్యమంత్రి అవుతారు కాని, నందమూరి కుటుంబంలో ఏ ఒక్కరో కోరుకుంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని రాజకీయాలలో జూనియర్ అయిన తారకరత్న కు తెలియకపోవచ్చు.
నందమూరి అభిమానులకు 'తెలుగుదేశం' పార్టీని గెలిపించటం లేదా ఓడించగల శక్తి ఉందేమో కాని, ఒంటరిగా తమ వారిని గెలిపించుకోలేరని గతంలో 'నందమూరి హరికృష్ణ' గుడివాడ నుండి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయినప్పుడే స్పష్టమైంది.
'గన్నవరం' అసెంబ్లీ సీటు అభ్యర్ధిత్వం విషయంలో తెలుగుదేశం పార్టీలో, నందమూరి కుటుంబంలో అభిప్రాయ భేదాలున్నాయని వస్తున్న వార్తలు కొంతవరకు బహిరంగ రహస్యమే.
2004 అసెంబ్లీ ఎన్నికలలో 'గన్నవరం' నుండి కాంగ్రెస్ పార్టీలో రెండు రెండు బలమైన వర్గాలు పోటీ చేసినా తెలుగుదేశం అభ్యర్ధి 'బాలవర్ధన రావు' గెలవకలేకపోవటం జిల్లా తెలుగుదేశం వర్గాలని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే అభ్యర్ధికి మరల వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్ధిత్వాన్ని కోరటం జిల్లా తెలుగుదేశం వర్గాలకు కూడా రుచించటంలేదు.
చంద్రబాబు నాయుడు 'నందమూరి అభిమానులకు', యువతకు అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించిన ప్రకారం 'వల్లభనేని వంశీ' కి 'గన్నవరం' సీట్లు కేటాయిస్తే బాగుంటుందని తెలుగు యువత, నందమూరి అభిమానులు కోరుతున్నారు.
గతంలో జూనియర్ యన్.టి.ఆర్ 'గుడివాడ' నుండి తెలుగుదేశం అభ్యర్ధిగా పట్టుబట్టి సీటు ఇప్పించుకున్న 'కొడాలి నాని'కి అనుకూలంగా సుడిగాలి ప్రచారం చేసి తెలుగుదేశం వ్యతిరేక పవనాలలో కూడా గెలిపించుకున్న విషయం చంద్రబాబు నాయుడు మర్చిపోయే అవకాశంలేదని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
'కలసిఉంటే కలదు సుఖం' అనే సామెతను 'తెలుగుదేశం' పార్టీ, నందమూరి అభిమానులు గుర్తుంచుకుంటే ఇరువురికి ప్రయోజనం ఉంటుందని శ్రేయోభిలాషుల భావన....

Comments