కుల సంఘాల ఏర్పాటు తప్పని విమర్శించేవారు చాలామంది ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఒక శిశువు జన్మించిన వెంటనే ఆ శిశువు జాతీయత, మతం, కులం ఈ మూడు విషయాలు 'జనన ధృవీకరణ పత్రం' లో నమోదు అవుతాయి, ఆ వివరాలు లేనిదే అతని జననం కూడా చెల్లుబాటు కాదు.
ఈ వ్యవస్థలో మనకు కులం పేరు ప్రస్తావించనిదే ఎక్కడా ఏ పనికాదు. స్కూల్ అడ్మిషన్ దగ్గరనుండి ప్రతి ప్రభుత్వ ధరఖాస్తులో కూడా కులం ప్రమేయం లేనిదే చెల్లుబాటు కాదు. అంతెందుకు, ఈ ప్రభుత్వమే కులాల వారి జన గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రిజర్వేషన్ విధానంతో ప్రభుత్వమే సమాజాన్ని కులాల పరంగా విడగొట్టింది. చదువు, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాలు, ఇలా ప్రతి విషయంలో కుల ప్రమేయాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది.
ఒక ప్రతిభ కల పేద విద్యార్ధికి మంచి మార్కులు వచ్చినా మంచి కాలేజి లో సీటు రాదు, ఎలాగోలా కస్టపడి చదువుకున్న తరువాత గవర్నమెంట్ ఉద్యోగం రాదు, తన కన్న తక్కువ మార్కులు వచ్చిన డబ్బున్న విద్యార్ధికి మంచి కాలేజి లో సీటు వస్తుంది, ఉపకార వేతనం లభిస్తుంది, తరువాత మంచి ఉద్యోగం కూడా వస్తుంది ఆ తరువాత ప్రతిభావంతులను కాదని ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ లభిస్తుంది, . కారణం అడిగితె ఈ ప్రభుత్వ వ్యవస్థ చెప్పే సమాధానం ఒక్కటే! "పేద వాడైనా, ప్రతిభావంతుడైనా, అగ్ర కులం వాడికి అడిగే హక్కు లేదు", వాడు పేదరికంతో అడుక్కోవటమో లేదా చనిపోవటమో చేయాలి, కాని ఒక IAS, IPS ఆఫీసర్, లేదా MLA, MP మంత్రి కొడుకైనా కొన్ని కులాల్లో పుడితే వారి, ఆర్ధిక పరిస్థితి, మార్కులతో పని లేకుండా అన్ని కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతారు. "ప్రపంచం లో ఇటువంటి నీచమైన వ్యవస్థ మరింకే దేశం లోను లేదు".
ఈ ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం ప్రజలను కులాలుగా విభజించి, ప్రతివ్యక్తికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే రోజు వరకు ఏదో విధంగా తన కులాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది.
అప్పటి వరకు కులం అంటే తెలియని వారికి కూడా మన ప్రభుత్వ వ్యవస్థ, రాజ్యాంగంలో ఉన్న ఈ అసమానతలు, తన కులం కారణంగా తమకు జరిగిన అన్యాయానికి అప్పటినుండే కులాభిమానం వైపు ఆకర్షితున్ని చేస్తుంది.
ఎప్పుడైతే ఈవిధానం తొలగిపోతుందో, కులాల పరంగా ఈ అసమానతలు తొలగిపోతాయో, ప్రతిభ కలవారికి, ఆర్ధికంగా వెనుకబడినవారికి కుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుందో బహుశా అప్పుడీ కుల సంఘాల ప్రభావం తగ్గవచ్చు.
"మనం, మన జాతీయ గురించి, మతం గురించి గొప్పగా చెప్పుకుంటే తప్పుకాదు కానీ కులం గురించి చెప్పుకుంటే మాత్రం తప్పా? "
ముఖ్యంగా ఈ విధంగా కుల అసమానతల కారణంగా అవకాశాలు కోల్పోయిన ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభావంతులకు విద్య, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం చేయలేని సహాయాన్ని కొన్ని 'కుల సంఘాలు' చేస్తున్నాయి.
మనం కుల సంఘాలు పెట్టుకుంటుంది వేరే కులాలవారికి వ్యతిరేకంగా కాదని, మనకులంవారి ప్రయోజనాలు కాపాడుకుంటూ, మనకులంలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి విద్య, ఉపాధి మొదలైన విషయాలలో తోడ్పాటునందిస్తూ, ఇతరకులాలవారితో సామరస్య పూర్వకంగా ఉంటూ, తద్వారా సమాజసేవ చేస్తున్నామనే భావనతోనే గమనించాలి.
Comments