పేస్ బుక్ లైక్స్ విషయంలో 'సిసింద్రి అఖిల్' ఆదరగొడుతున్నాడు. హీరోగా నటించిన మొదటి చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే నేటి యువతరం హీరోలకు ఎవ్వరికీ లేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు పేస్ బుక్ లో అఖిల్ అక్కినేనిని అభిమానించిన వారి సంఖ్య 8,86,678. చిత్రమేమిటంటే ఎనిమిది సంవత్సరాలనుండి సిని రంగంలో ఉన్న అక్కినేని నాగచైతన్యకు పేస్ బుక్ అభిమానుల సంఖ్య కేవలం 1,63,513 మాత్రమే, 28 సంవత్సరాలుగా హీరోగా వెలుగుతున్న తండ్రి నాగార్జునకున్న పేస్ బుక్ అభిమానుల సంఖ్య 12,00,716. ఈ లెక్కన చూస్తే అఖిల్ అక్కినేని తన మొదటి సినిమా రిలీజ్ ముందే తన తండ్రి అభిమానుల సంఖ్యను దాటిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. కథానాయకుడిగా తన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే పేస్ బుక్ లో ఇంతమంది అభిమానులను సంపాదించుకోవటం నిజంగా పెద్ద రికార్డే.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హీరో నాని కి 31,36,406 మంది, హీరో మహేష్ బాబు 30,48,224, జూనియర్ యన్టిఆర్ 17,58,195 కంటే ఎక్కువ మంది పేస్ బుక్ అభిమానులున్నారు. మోహన్ బాబు సంతానంలో తమ్ముళ్ళ కంటే అక్కకే ఎక్కువ మంది పేస్ బుక్ అభిమానులున్నారు. మంచు లక్ష్మికి 11,20,969, మనోజ్ కు 8,39,848, విష్ణుకు కేవలం 1,07,633 అభిమానులు మాత్రమె ఉన్నారు. వారసత్వ నేపధ్యంలేని నేటి యువతరం చిన్న హీరోల్లో మూల్పూరి నాగ శౌర్య కు అత్యధికంగా 1,32,544 మంది పేస్ బుక్ అభిమానులున్నారు.
Comments