కొద్ది రోజుల క్రితం జగన్ రామోజీని కలవటం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇక్కడ విషయమేమిటంటే ఇద్దరూ ఏదైనా ఫంక్షన్లో కాకతాళీయంగా కలవలేదు లేదా రామోజీ రావు జగన్ ను కలవలేదు, జగనే స్వయంగా రామోజీరావు ఇంటికి వెళ్లి కలిశాడు. రామోజీ రావు తెలివికల వ్యాపారవేత్త, తాము అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని నాగళ్ళతో దున్నిస్తామని ప్రకటించిన కెసిఆర్ నే బుట్టలో వేసుకుని రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అద్భుతం అని, తెలంగాణా రాష్ట్రానికే మకుటాయమానం అని, స్టూడియో కు అన్ని రకాల సహాయం అందించటానికి తాము సిద్ధంగా ఉన్నానని కితాబు ఇప్పించుకున్న ఘనుడు. శత్రువునైనా ఏదోరకంగా తనదారిలోకి తెచ్చుకుంటాడే తప్ప, తనంతట తాను ఎవరికైనా లొంగిపోవటం రామోజీ రావు జీవితంలో ఇంతవరకు జరగలేదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రామోజీరావును తన దారిలోకి తెచ్చుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమై ఆ తరువాత అతన్ని అన్ని రకాల వేధింపులకు గురిచేయటమే కాకుండా రామోజీరావు ఆర్ధిక మూలాలను దెబ్బతీయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా సఫలంకాలేక పోయాడు. రామోజీ రావు జీవితంలో అత్యంత గడ్డు రోజులు ఎదుర్కొంది ఆ సమయంలోనే అనే విషయం ...
visit www.kammavelugu.org for more information and History of Kamma caste, kammavar, కమ్మ, కమ్మ వారు, కమ్మ నాయుడు, Kamma Naidu, Naidoo community people across the Globe