కమ్మవారిలో దాతృత్వ గుణం అనాది కాలంగా ఉంది. పూర్వకాలం నుండి రాజులు, జమిందార్లు, ధనికులైన కమ్మవారు దేవాలయాలు, విద్యా సంస్థలు, సత్రాలు మొదలైన ప్రజా ప్రయోజనం కలిగిన వాటిని ఎన్నింటినో నిర్మించి, ఒక్క తమ కులానికే పరిమితం కాకుండా సమాజానికి మొత్తం ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేశారు.
పదమూడవ శతాబ్దంలో హనుమకొండలో కాకతీయ చక్రవర్తుల నిర్మించిన 'వేయి స్థంబాల దేవాలయం' మరియు పాలంపేట లోని 'రామప్ప దేవాలయం' గొప్ప శిల్ప సంపదకు ప్రసిద్ధి చెందాయి, ఇవే కాకుండా మరెన్నో దేవాలయాలను కాకతీయ చక్రవర్తుల నిర్మించారు.
మదురై, తంజావూర్ కమ్మ నాయక రాజులు 'శ్రీరంగం' లో నిర్మించిన 'శ్రీ రంగనాధ దేవాలయం;. 'తంజావూర్' లో నిర్మించిన 'బృహదీశ్వర ఆలయం', 'మదురై' లో నిర్మించిన ప్రసిద్ధ 'మీనాక్షి దేవాలయం', 'రామేశ్వరం' లోని 'రంగనాధ స్వామి ఆలయం' యెంతో ప్రసిద్ధి గాంచిన నిర్మాణాలు.
పద్నాలుగవ శతాబ్దంలో తాడిపత్రిలో పెమ్మసాని రామలింగ నాయుడు తన పేరుమీద 'రామలింగేశ్వర దేవాలయం' నిర్మించాడు.
పద్దెనిమిదవ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎన్నో దేవాలయాలు కట్టించాడు, అమరావతి, చేబ్రోలు, మంగళగిరి, పొన్నూరులో ఉన్న పురాతన దేవాలయాలను పునర్నిర్మించాడు, ఆ దేవాలయాల నిర్వహణ నిమిత్తం భారీగా భూములు దానం చేశాడు.
పద్దెనిమిదవ శతాబ్దంలో చల్లపల్లిలో 'రాజా యార్లగడ్డ అనికినీడు బహదూర్' నిర్మించిన 'శివ గంగ' ఆలయం వారణాసి లోని 'అన్నపూర్ణేశ్వరి దేవి' ఆలయాన్ని పోలి ఉంటుంది.
కోస్తా జిలాల్లో, ముఖ్యంగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం మరియు ఖమ్మం జిల్లాల్లో కమ్మ వారు ఎన్నో విద్యాసంస్థలు, కళాశాలలు నిర్మించి మంచి విద్యను అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చారు.
కృష్ణ జిల్లాలో విజయవాడ, గుడివాడ, వుయ్యూరు, గన్నవరం, గుడ్లవల్లూరు గుంటూరు జిల్లాలో గుంటూరు, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట, వినుకొండ, రేపల్లె, సత్తెనపల్లి ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, కందుకూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, తణుకు, తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి, మండపేట, రామచంద్రాపురం మొదలైన పట్టణాల్లో భూరి దానాలతో కమ్మవారు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కళాశాలలకు భవనాలు ఏర్పాటు చేశారు, మరెన్నో తామే స్వయంగా నిర్వహించి ఆ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి యెంతో కృషి చేసి ఎందరో విద్యా వంతులుగా తీర్చి దిద్ది, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందటానికి సహాయం చేశారు.
ఈ జిల్లాల్లో కమ్మవారు పల్లెటూర్లలో కూడా అనేక ప్రాధమిక పాఠశాలలు నిర్మించి విద్యా వ్యాప్తికి అవిరళమైన కృషి చేశారు. ఇప్పటికి ఈ జిల్లాల్లో కమ్మవారు నిర్మించి ఇచ్చిన భవానాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి.
కోస్తాజిల్లాల్లో విద్యా రంగంలో యెంతో ప్రసిద్ధి గాంచిన విజయవాడ లయోలా కాలేజి స్థాపనకు చొరవ తీసుకుని ఆర్ధికంగాను మరియు విలువైన భూమిని విరాళంగా ఇచ్చింది కమ్మవారే. అలాగే విజయవాడ లో సిద్దార్ధ కాలేజి, గుడివాడలో ఏ.యన్నార్ కాలేజి, ఏలూరులో సి.ఆర్.రెడ్డి కాలేజి లో (ఈ కాలేజి కి రెడ్డి కులం వారికి ఏ విధమైన సంబంధం లేదు, ఈ కాలేజి ఏర్పాటు చేసింది మాగంటి సీతారామ దాస్ గారు మరియు అల్లూరి బాపినీడు గారు) చదువుకుని దేశ విదేశాల్లో ఉన్న్నత మైన స్థానాల్లో ఉన్నవారెందరో!
గుంటూరు మెడికల్ కాలేజి స్థాపనలో చొరవ తీసుకుని భూరి విరాళాలు ఇచ్చింది కమ్మవారే, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజి ముఖ్య దాత ఆ రోజుల్లోనే ఇదు లక్షలు విరాళమిచ్చిన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ బావమరిది 'దొమ్మేరు జమిందార్' పెండ్యాల రంగారావు' పేరు మీదుగా ఏర్పాటైంది. విజయవాడ లో కమ్మవారిచే నిర్వహించబడుతున్న సిద్దార్థ అకాడమి వారు స్థాపించిన 'సిద్దార్థ మెడికల్ కాలేజి' ఆ తరువాత ప్రభుత్వంచే జాతియం చేయబడి 'యన్.టి.ఆర్ యునివర్సిటిగా రూపాంతరం చెందింది.
అంతే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా ఎన్నో విద్యాలయాలు, సాంకేతిక కళాశాలలు మరెన్నో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను ఈ సమాజానికి అందించి విద్యా వ్యాప్తికి ఏంటి కృషి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రైవేటు యూనివర్సిటీలు (గీతం, విజ్ఞాన్, కే.యల్.యు) కమ్మవారివే.
తమిళనాడు రాష్ట్రంలో కమ్మసంఘాలు 13 పాటశాలలు, 2 కళాశాలలు, ఒక పాలిటెక్నిక్ కాలేజి, ఒక ఇంజనీరింగ్ కాలేజి నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి పాటుపడుతున్నాయి.
ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారిచే నిర్వహించ బడుతున్న హాస్టల్స్ లో ఇతర కులాలలోని పేద విద్యార్ధులకు కూడా ఆశ్రయం ఇచ్చి తద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. యస్.సి వర్గానికి చెందిన మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ కోట పున్నయ్య, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి 'ఖమ్మం పట్టణంలో కమ్మ హాస్టల్లో ఉంది విద్యను అభ్యసించినవారే! రాష్ట్రంలో కమ్మ సంఘాలు ప్రతి ఏటా పేద విద్యార్ధులకు ఇచ్చే ఉపకార వేతనాల్లో కనీసం ఇరవై శాతం కుల ప్రమేయం లేకుండా ఆర్ధికంగా, సామాజికంగా వెనుక బడిన వర్గాలకు అందచేయబడుతుంది.
వివిధ పట్టణాల్లో మరియు శ్రీశైలం వంటి పుణ్య క్షేత్రాలలో కమ్మవారిచే నిర్వహించబడుతున్న 'సత్రాల్లో' అన్ని కులాల వారికీ ఉచితంగా ఆశ్రయం కల్పించి, అన్నదానం కూడా చేయటం జరుగుతుంది. కమ్మనైన భోజనం తినాలంటే కమ్మవారి ఇళ్లలోనే తినాలని అన్ని కులాలవారు ఒప్పుకోవటం మనకు గర్వకారణం.
కమ్మవారిచే సహాయం పొంది ఉన్నత స్థితిలో ఉన్న వారెందరికో కమ్మవారిలో దాతృత్వం, దయాగుణం గురించి తెలుసు. కమ్మవారెప్పుడూ 'కమ్మనైన' మనసు కలవారు. మనం భవిష్యత్తులో కూడా సమాజం పట్ల, ఇతర కులాలవారి పట్ల ఇదే విధమైన వైఖరితో ఉండి మన కులానికి, మన పూర్వీకుల గౌరవానికి వన్నె తెద్దాం!
Comments
సాయిరాం కుర్ర.