29 జనవరి 2011 కమ్మ సంఘాల చరిత్రలో ఒక చారిత్రాత్మక దినం. పుణ్య క్షేత్రం తిరుపతిలో కమ్మవారి సంక్షేమ సంఘం అధ్వర్యంలో 28, 29 తేదిలలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ కమ్మ సంఘాల పరిచయ వేదికలో రాష్ట్రం నలుమూలల నుండి పాల్గొన్న 40 పైగా కమ్మ సంఘాల ప్రతినిధులు ఐక్య సంఘటనగా ఏర్పడి 'ఆంధ్ర ప్రదేశ్ కమ్మవారి సేవా సంఘం' ఏర్పాటు కాబడింది.
28 తేదిన జరిగిన కమ్మ సంఘాల పరిచయ వేదికలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూల్, హైదరాబాద్, నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలనుండి హాజరైన కమ్మ సంఘాల ప్రతినిధులు రాష్ట్రంలో కమ్మ సంఘాల అన్నింటి కలయికలో రాష్ట్రవ్యాప్తంగా ఒక ఐక్య సంఘటన ఏర్పాటు కావాలని తీర్మానం చేయటం జరిగింది.
ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో కమ్మ వారికి జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవటానికి, మన న్యాయమైన హక్కులను సాధించు కోవటానికి, విద్య, ఉపాధి, ఆరోగ్యం మొదలైన విషయాలలో మన వారికి మరింతగా సేవ చేయటానికి, ఒక ఉమ్మడి వేదిక అవసరం అనే నిర్ణయానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంఘం అధ్వర్యంలో పనిచేయటానికి నిర్ణయం తీసుకున్నారు.
29 తేదిన జరిగిన సమావేశంలో ఇటీవల 'సేవా రంగంలో' కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం 'పద్మశ్రీ' అవార్డుకు ఎంపికైన డా.గుత్తా మునిరత్నం నాయుడు గారిని శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, శ్రీ మేడసాని మోహన్, కంచి ఆస్థాన విద్వాన్ 'కలైమామణి' డా.RBN, శ్రీ.చలసాని వెంకటేశ్వర రావు గారి సమక్షంలో కమ్మ సంఘాలవారు ఘనంగా సన్మానించటం జరిగింది.
ఆ తరువాత జరిగిన కమ్మ సంఘాల ప్రతినిధుల సభలో 'ఆంధ్ర ప్రదేశ్ కమ్మవారి సేవా సంఘం' ఏర్పాటైంది. ఈ సంఘం తాత్కాలిక కమిటి రాష్ట్ర అధ్యక్షులుగా హైదరాబాద్, 'భాగ్యనగర్ కమ్మ సంఘాల సమన్వయ సమితి 'సెక్రటరీ' శ్రీ.ఆరెకపూడి గాంధీ, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి కమ్మవారి సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ.కృష్ణమూర్తి నాయుడు మరియు కార్యదర్శులుగా, ప్రకాశం జిల్లా కమ్మ సంఘం కార్యదర్శి శ్రీ.బెజవాడ వెంకట రావు, కర్నూల్ జిల్లా, మహానంది కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీ.వీరగంధం రత్నబాబు, ఖమ్మం జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీ.కాటంనేని రమేష్, పశ్చిమ గోదావరి జిల్లా 'జంగారెడ్డి గూడెం' కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీ.అట్లూరి రామమోహన రావు, మరియు ఉపాధ్యక్షులుగా వినుకొండ కమ్మ సంఘం కార్యదర్శి శ్రీ. రాయుడు , కడప కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీ.మద్దిపట్ల రమణయ్య నాయుడు, కమ్మ యువత కార్యదర్శిగా శ్రీ.కమ్మ వెంకట్, రైతు విభాగం కార్యదర్శిగా శ్రీ.మురకొండ బోస్, ప్రచార విభాగం (వెబ్సైటు, పత్రిక) కార్యదర్శిగా శ్రీ.కనకమేడల శ్రీనివాస చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
త్వరలో హైదరాబాద్ లో జరిగే సమావేశంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల సంఘాలకు ప్రాతినిధ్యం కలిగించేలా మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకొనే విధంగా తీర్మానం చేయబడింది. ఈ సమావేశంలో పూర్తి స్థాయి కార్య వర్గాన్ని ఏర్పాటు చేసుకొని సంఘం ఆశయాలు, విధి విధానాల రూప కల్పన జరుగనుంది, తద్వారా కమ్మ సంఘాల ఉమ్మడి వేదిక ద్వారా రాష్ట్రంలో కమ్మ వారిలో ఐక్యత సాధించేందుకు, అన్ని విషయాలలో మనవారికి అభ్యున్నతికి, వికాసానికి తోడ్పడే విధంగా ప్రణాళికలు రచించటం జరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ కమ్మవారి సేవా సంఘానికి మీ మద్దతు, చేయూతను అందించండి.
Comments