దగ్గుబాటి పురందరేశ్వరి రాజకీయ 'శిఖండి' పాత్రను చాలా చక్కగా పోషిస్తున్నారు. పదవుల కోసం, స్వలాభం కోసం ఎంతకైనా తెగిస్తానని రుజువు చేసుకున్నారు. తాజాగా తన సోదరులైన బాలకృష్ణ, హరికృష్ణ మొదలైన నందమూరి వారసులను హెచ్చరిస్తూ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పత్రికలకు పంపిన బహింరంగ లేఖతో ఆమె తన నీచమైన నైజాన్ని బయటపెట్టుకుంది.
తన సోదరులకు చంద్రబాబు నాయుడు గురించి నిజంగా ఏవైనా జాగ్రత్తలు చెప్పవలసి వస్తే వాళ్ళను తన ఇంటికి పిలిపించుకుని చెప్పవచ్చు లేదా ఫోన్ చేసి చెప్పవచ్చు కాని ఈ ఆ విషయాలని పత్రకలద్వారా బహిరంగ పరచిందంటే ఆమె చర్యల వెనుక ఎవరున్నారో, ఆమె చర్యల వెనుక ఉద్దేశం ఏమిటో చిన్న పిల్లవాడికైనా ఇట్టే అర్ధమౌతుంది.
రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో పచ్చని నందమూరి కుటుంబంలో ఆ ఇంటి ఆడపడుచే విలన్ పాత్ర పోషిస్తోంది. తన కూతురినే అదుపాజ్ఞలలో పెట్టుకోలేని పురందరేశ్వరి ఇతరులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించటం చూస్తుంటే ఏదో నాటు సామెత గుర్తుకు రావటంలేదా?
NTR పదవీచ్యుతి తరువాత తన భర్త వెంకటేశ్వర రావుకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి పదవి ఇప్పించు కున్నప్పుడు కాని, 2004 అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోమని నెలల తరబడి చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ తిరిగినప్పుడు కాని చంద్రబాబు నాయుడు నైజం గుర్తుకు రాలేదా?
ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి స్వర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బద్ధ వ్యతిరేకి NTR ఆత్మను క్షోభ పెట్టిన పురందేశ్వరి ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే 'దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న' చందంగా ఉంది. నందమూరి అభిమానులు ఆమె చర్యలను అసహ్యించు కుంటున్నారనే విషయం పురందరేశ్వరి గ్రహిస్తే బాగుంటుంది.

Comments