సైతాను రాజశేఖరరెడ్డి పాలనకు 'count down' మొదలయ్యింది. కేవలం తన కుటుంబం వారికి, తన కులం వారికి తప్ప మిగిలిన అన్ని కులాల, వర్గాల వారికి ఈ ప్రభుత్వ పాలనలో అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో అన్ని కీలక ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పదవులు ఒకే కులం వారికి కట్టబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మొదలుకుని విజయవాడ కనకదుర్గ దేవస్థానం వరకు రెడ్డి జనాభా లేని ప్రాంతాలలో కూడా అన్ని పదవులు, కీలకమైన యునివర్సిటి వైస్ చాన్సలర్ పదవులు, కీలకమైన కార్పోరేషన్ పదవులు ఒకే కులం వారికి కట్టబెట్టారు. ప్రభుత్వ భూముల పందేరం, గ్రానైట్, ఇనుము, మొదలైన ఖనిజాలున్నవిలువైన గనులు, నీటి పారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టులు నిబంధనలను తుంగలో తొక్కి నిర్భయంగా, నిస్సిగ్గుగా తస్మదీయులకు కట్టబెట్టాడు.
రాష్ట్రం లో శాంతి భద్రతలు మునుపెన్నడూ లేనంతగా దిగజారాయి. 'ఆయెషా' హత్య కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసి క్లిష్టమైన కేసుగా చూపించి ఏదో ఒక రకంగా నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా పోలీసు శాఖ అసమర్ధతను ఎత్తి చూపుతూ సాక్షాత్తు హోమ్ మంత్రే స్వయంగా, ఈ కేసులో నిందితులను పట్టించే సమాచారాన్ని అందించే వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఒక సాధారణ హత్య కేసులో నిందితులను గుర్తించలేనంత చేతకాని పోలీసు వ్యవస్థను రద్దు చేసి ప్రవేటు రంగానికి అప్పచెప్పటం శ్రేయస్కరం. నిందితులెవరో తెలిసినా, వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న ఈ కళ్ళుఉంది చూడలేని ద్రుతరాష్ట్ర ప్రభుత్వం నిజంగా 'సైతాను' ప్రభుత్వమే! గతంలో పోలీసు కమిషనరేటు పై దాడి లో, మక్కా మసీదు బాంబు దాడిలో , లుంబిని పార్క్ మారణ కాండలో ఈ గుడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క నిందితుడిని పట్టుకోలేక పోయింది.
ప్రస్తుతం పోలీసు వ్యవస్థ మొత్తం రాజశేఖరరెడ్డికి అతని కుటుంబానికి, హోమ్ మంత్రి మిగిలిన మంత్రుల రక్షణకు, కాంగ్రెస్ గుండాలకు, ఫాక్షనిస్తులకు భద్రత కల్పించటానికే వినియోగిస్తున్నారు తప్ప వీళ్ళు సామన్యుడికేమి రక్షణ కల్పిస్తారు. Z కేటగిరి రక్షణ ఉన్న చంద్రబాబు నాయుడికి భద్రతను గణనీయంగా తగ్గించి, 'జగన్' లాంటి 'బచ్చా' గాళ్ళకు అంతకు మించిన భద్రత కల్పించారు. నిజాయతి కలిగిన పోలీసు అధికారులను అప్రధాన పోస్టులలో నియమించి, తమ తాబేదారులను, అసమర్ధులను, అవినీతి అధికారులను అందలం ఎక్కించి తమ అవసరాలు తీర్చుకుంటూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రం లో క్షీణించిన శాంతి భద్రతలపై కేంద్రం నివేదిక ఈ విషయాన్ని బలపరుస్తుంది.
'శకుని మామ' ఉండవల్లి అరుణకుమార్, అహంకారంతో, వెకిలితనంతో రాజమండ్రిలో అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని హేళన చేస్తూ మాట్లాడితే, ఈ ముఖ్యమంత్రి, అరుణకుమార్ ను సమర్ధిస్తూ, అతనో గొప్ప విద్యావేత్త అని, గొప్ప సంస్కారి అని బిరుదులిస్తూ, అసలు జరిగిన సంఘటనను వక్రీకరించారని, తప్పంతా రామోజీరావుది, ఆంధ్రజ్యోతిది, చంద్రబాబు నాయుడిది అని ఎదురు దాడికి దిగాడు. కాని ఆ సంఘటన TV9, NTV, TV5 సహా అన్ని చానళ్ళు, కవర్ చేసాయి. సూర్య, వార్తతో సహా అన్ని పేపర్లు ప్రచురించాయి. ఆ సంఘటనకు స్పందించిన కాంగ్రెస్ MLA, MP లు కూడా అరుణకుమార్ వ్యాఖలు తీవ్రంగా ఖండించారు. కాని, ఈ అంధ ముఖ్యమంత్రికి కమ్మవారి పేపర్లలోను, చానళ్లలోను మాత్రమె ఆ వార్తలు కనిపించాయి, అంతే కాదు, దలితులంటే చులకన భావంతో, ఆ వార్తలకు అనవసర ప్రాధాన్యం ఇచ్చారని ఓ దరిద్రపు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తరువాత ఉండవల్లి తన తప్పును బహిరంగా ఒప్పుకుని దళితులకు క్షమాపణ చెప్పినప్పుడు ఈ కుసంస్కార ముఖ్యమంత్రి తన మొహం ఎక్కడ పెట్టుకున్నాడు?
ఈ ఫాక్షన్ ముఖ్యమంత్రికి ఉండవల్లి అరుణకుమార్ లో ఓ గొప్ప సంఘసంస్కర్త, గౌరు వెంకట రెడ్డిలో ఓ గొప్ప మానవతావాది, సూరీడులో ఓ మహాత్మా గాంధీ, మొద్దు శీనులో ఓ యేసు ప్రభువు కనిపించడంలో ఆశ్చర్యం లేదు!
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీలో తీర్మానం చేయించి తనే సంతకంపెట్టి, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ మహానుభావుడు ఇప్పుడు ఆ విషయం గుర్తు చేస్తే, తను ఆ తీర్మానంలో ఏముందో సరిగా చదవకుండా సంతకం పెట్టానని తప్పించుకో చూస్తున్నాడు. గతంలో కూడా ఈ ముఖ్యమంత్రి పత్రికా స్వేచ్చ ను హరించే బిల్లు రూపొందించినప్పుడు, గౌరు వెంకటరెడ్డి బెయిలు పిటిషన్ పై సంతకం పెట్టిన సందర్భాలలో కూడా తను చూడకుండా సంతకం పెట్టానన్నాడు.
ఈ అసమర్ధ ముఖ్యమంత్రి కీలకమైన విషయాలలో తన ప్రమేయం లేకుండా, తనకు తెలియకుండా నిర్ణయాలు జరిగాయని చెప్పి తన భాద్యతలనుండి తప్పించుకుంటున్నాడు. ప్రస్తుతం, గతంలో వోట్లేసిన ప్రజలు కూడా తెలియక కాంగ్రెస్ కు వోటేసామని, వచ్చే ఎన్నికలలో తమ తప్పు సరిదిద్దుకుందామని భావిస్తున్నారు.
ఈ భజన ముఖ్యమంత్రి మన రాష్ట్రం లో ప్రతి పధకానికి, ప్రతి నిర్మాణానికి రాజీవ్, ఇందిరల పేర్లు తగిలించి 'వ్యక్తిపూజ' ను పరాకాస్థకు చేర్చాడు. ఈ రాష్ట్రం నుండి అనేకమంది అనేక రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన వారిని, గతంలో ప్రధాని, రాష్ట్రపతిగా చేసిన వారిని కూడా విస్మరించి కేవలం ఒక మారు ప్రధానిగా చేసిన 'రాజీవ్ గాంధీ' నామ స్మరణలో ఈ ముఖ్యమంత్రి పునీతమౌతున్నాడు, తద్వారా సోనియాగాంధి ని ప్రసన్నం చేసుకుని తన పదవికి ధోకా లేకుండా చూసుకుంటున్నాడు.
ఈ ముఖ్యమంత్రికి నిజంగా ఇందిరా, రాజీవ్ ల పైన అంత ప్రేమ ఉంటే కనుక ప్రజాభీస్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పధకాలకు వారి పేర్లు బలవంతంగా రుద్దే బదులుగా తన మనవలకో, మనవరాల్లకో ఇంకా వాళ్ళు చాలకపోతే తన పెంపుడు కుక్కలకో, ఇతర జంతువులకో వారి పేర్లు పెట్టుకుంటే ఆంధ్ర ప్రజలకు ఎటువంటి అభ్యంతరము ఉండదు.
రాష్ట్రంలో తాగటానికి మంచినీరు దొరకక పోయినా మద్యం మాత్రం ఏరులై పారుతుంది. ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చి ఆర్జించిన పాపిష్టి సొమ్ముతో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ, వేలకోట్లు స్వాహా చేస్తున్నారు. లోకాయుక్త, CAG రిపోర్టులలో ఈ విషయం తేటతెల్లమైనా భయం లేకుండా, కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ బరితెగించిన ముఖ్యమంత్రి 1200 కోట్ల రూపాల వ్యయంతో బెంగుళూరు నుండి కడపకు తన ఇడుపులపాయ వ్యసాయ క్షేత్రం గుండా వెళ్ళే విధంగా రైలు మార్గం ఏర్పాటుకు లాలూ ప్రసాద్ యాదవ్ తో లాలూచి పడి రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో అన్యాయం జరిగినా మిన్నకుండి పోయాడు. ఈ 1200 కోట్ల వ్యయంలో 600 కోట్లు రైల్వే శాఖ భరిస్తుంది కాని మిగిలిన 600 కోట్లు మాత్రం ఆంధ్ర ప్రజల ఆదాయం నుండి ఖర్చు చేసేవిధంగా, తనకు లాభం ఆంధ్ర ప్రజలకు నష్టం కలిగే విధంగా ఈ పులివెందుల ముఖ్యమంత్రి రైల్వే శాఖతో ఒప్పందం చేసుకున్నాడు.
ఈ ముఖ్యమంత్రికి తను, తన కుటుంబం, తన ఆస్తులు, తన వూరు బాగుంటే చాలు, మిగిలిన రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు. ఈ ముఖ్యమంత్రి స్థాయి సర్పంచి కి ఎక్కువ, MPTC కి తక్కువ.
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు, ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే ఆస్థిలో అంబానీ, టాటా, బిర్లాలను తలదన్నే స్థాయిలో అక్రమార్జన గావించాడు. మరోమారు ప్రజలు అవకాసం ఇస్తే 'బిల్ గేట్స్'ను మించిపోయి, అతి తక్కువ వ్యవధిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరి గిన్నిస్ బుక్ లో ఎక్కిపోదామనుకుంటున్నాడు. కాని ప్రజలు రాజశేఖరరెడ్డి అంత తెలివి కలవారు కాకపోయినా మూర్ఖులు మాత్రం కారు. ఒకసారి తెలియక చేసిన తప్పు మరోమారు చేయరు.
'భారత్ వెలిగి పోతుంది' అనే నినాదంతో గత ఎన్నికలలో బి.జే.పి గత పార్లమెంటు ఎన్నికలలో వాతావరణం తనకే అనుకూలంగా ఉన్నట్లు భ్రమించ చూపింది కాని, ప్రజలు 'అంత లేదులే' అని తీర్పు ఇచ్చారు. ప్రస్తుతం వై.యస్.ఆర్ కూడా అభివృద్ధి మంత్రం జపిస్తూ లేని అభివృద్ధిని ఉన్నట్లుగా 'మసి పూసి, మారేడు కాయ' చేయాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం కాంగ్రెస్ కు 'ముందుంది మొసళ్ళ పండగే'! ఒకవైపు తెలుగుదేశం, వామపక్షాలు, మరోవైపునుండి టి.ఆర్.యస్, కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర, తెలంగాణా ప్రాంత అసమ్మతి వాదులు, మరీ ముఖ్యంగా చిరంజీవి కొత్తగా పెట్టబోయే పార్టీనుండి ఎదురయ్యే పెను సవాళ్లను ఎదుర్కోవటం ఇక సాధ్యంకాదు. ఈ అరాచక, అసమర్ధ, అవినీతి ప్రభుత్వానికి 'కౌంట్ డౌన్' మొదలయ్యింది.

Comments