ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ కొంగర విజయలక్ష్మి సెప్టెంబర్ 21వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ ప్రధాన కోర్టు హాల్‌లో ప్రమాణస్వీకారం చేయించారు.
కొంగర విజయలక్ష్మి
1960 సెప్టెంబరు 20న జన్మించారు. ఏలూరు సీఆర్‌ఆర్ న్యాయ కళాశాల నుంచి బీఎల్ పూర్తి
చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1985 జులై 12న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. హైకోర్టు
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్ పర్వతరావు వద్ద అప్పట్లో న్యాయవాద వృత్తి జీవితాన్ని
ప్రారంభించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హైకోర్టులో
ఏఏజీగా పనిచేసినప్పుడు ఆయన కార్యాలయానికి అటాచ్ ప్రభుత్వ న్యాయవాది(జీపీ)గా విజయలక్ష్మి
పనిచేశారు. ప్రభుత్వ న్యాయవాదిగా, సహాయ ప్రభుత్వ న్యాయవాదిగానూ సేవలు అందించారు. హైకోర్టు
న్యాయవాదిగా ఈనెల 21వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Comments