Sir.Edpuganti Raghavendra Rao
రాజకీయ రంగంలో రచ్చ గెలిచిన కమ్మవారు
కమ్మవారికి ముఖ్య వృత్తి వ్యవసాయం. 19వ శతాబ్దం నుండి కమ్మవారు వ్యసాయం నిమిత్తం కోస్తా జిల్లాలనుండి తెలంగాణా ప్రాంతానికి, తమిళనాడు, ఒరిస్సా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు, రాయలసీమ జిల్లాలనుండి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుకు వలస వెళ్ళారు. 20వ శతాబ్దంలో వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల నిమిత్తం పొరుగు రాష్ట్రాలకు ఎక్కువగా తరలి వెళ్ళారు. అలా వలస వెళ్లి ఆయా రంగాల్లో విశేషంగా రాణించి, ఆర్ధికంగా, సామాజికంగా బలవంతులైన కొంతమంది కమ్మవారు రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా ప్రకాశించారు. తెలుగువారి జనాభా, మరీ ముఖ్యంగా కమ్మవారి జనాభా ఏమాత్రం లేని ప్రాంతాల్లో కూడా కమ్మవారు MLA మరియు MP లు గా ఎన్నికయ్యారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో రాణించిన కమ్మవారు.
* కృష్ణా జిల్లా 'పెదమద్దాలి' గ్రామం నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రం బిలాసపూర్ పట్టణానికి దగ్గర 'కంప్టీ' గ్రామానికి వలస వెళ్ళిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన 'శ్రీ. ఈడ్పుగంటి రాఘవేంద్రరావు' 1916వ సంవత్సరంలో బిలాసపూర్ నగర పాలిక మొట్టమొదటి ఛైర్మన్ గా పనిచెసారు. ఈయన మే 1935 నుండి సెప్టెంబర్ 1936 వరకు 'మధ్య పరగణాలు 'మరియు బేరార్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. రాఘవేంద్రరావు గారు 1937వ సంవత్సరంలో బిలాసపూర్ నుండి ఇండిపెండెంట్ గా పోటి చేసి MLA గా ఎన్నికయ్యి మధ్య పరగణాలు (మధ్య ప్రదేశ్) రాష్ట్రానికి ఏప్రిల్ 1937 నుండి జూలై 1937 (మూడు నెలల 14 రోజులు) మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కమ్మవారిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో ఈయన రెండవ వారు (అక్టోబర్ 1930, నవంబర్ 1932 మధ్య కాలంలో ఉమ్మడి మదరాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ బోల్లిని మునుస్వామి నాయుడు కమ్మవారిలో మొట్టమొదటి ముఖ్యమంత్రి). రాఘవేంద్రరావు గారు 1941వ సంవత్సరంలో వైస్రాయ్ Executive Council లో Civil Defense Minister గా పనిచేసిన భారతీయునిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఈయన జీవిత చరిత్ర ప్రతి కమ్మవాడికి ఎంతో గర్వ కారణం.
* కృష్ణా జిల్లానుండి వలస వెళ్ళిన నార్ల వెంకటరమణ గారు కట్ని జిల్లా బద్వారా నియోజకవర్గం నుండి 1972-77 మరియు 1990-93 మధ్య కాలంలో రెండు సార్లు మధ్యప్రదేశ్ అసెంబ్లీకి MLA గా ఎన్నికయ్యారు.
* ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారి తనయుడు ఈడ్పుగంటి అశోక్ రావు బిలాసపూర్ మునిసిపల్ కార్పోరేషన్ కు 1982-84 మధ్య కాలంలో మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. ఈయన 1980-1987 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (MPCC) కోశాధికారిగా ఉన్నారు అశోక్ రావు 1991-98 మధ్య కాలంలో రెండు సార్లు బిలాసపూర్ నుండి మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి MLA గా ఎన్నికయ్యారు, 1993-97 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
* శ్రీమతి ఈడ్పుగంటి వాణిరావు 'బిలాసపూర్' మునిసిపల్ కార్పోరేషన్ కు మేయర్ గా ఎన్నికైన ప్రధమ మహిళ. ఈవిడ డిసెంబర్ 2009 సంవత్సరంలో మేయర్ గా ఎన్నికయ్యారు. ఆవిడ నార్ల వారి ఆడపడుచు, ఈడ్పుగంటి అశోక్ రావు గారి కోడలు.
Comments