అనుకున్నదంతా ఐపొయింది, ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలైంది. ఇప్పుడు మనముందున్న పెద్ద సమస్య సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని. మనం తలుచుకుంటే ఒక దశాబ్ద కాలంలోనే హైదరాబాద్ ను తలదన్నే రాజధానిని తయారు చేసుకోగలం. కొత్త రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పడినా కాని అభివృద్ధి, పారిశ్రామీకరణ అన్ని జిల్లాలలో సమానంగా జరిగినప్పుడే భవిష్యత్తులో కొత్త రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల్లో ఏ విధమైన అసంతృప్తి తలెత్తకుండా ఉంటుంది.
రాజధాని ఏర్పాటు చేయాలంటే స్థల రాజకీయాలు, కుల రాజకీయాలు, వెనకబడిన ప్రాంతాల ఉద్ధరింపు ఇవేమీ ముఖ్యం కాదని అన్ని జిల్లాల వారు, ప్రాంతాల వారు గుర్తుంచు కొవాలి. రాజధాని ఏర్పాటుకు మౌలిక వసతులు, వనరులు, రవాణా, నీరు, భౌగోళిక స్వరూపం, జనాభా అతి ముఖ్యమైనవి.
కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా వుండే అర్హతలు కలిగిన పట్టణాలలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు వున్నాయి. ఈ పట్టణాలలో జనాభా పరంగా విశాఖపట్నం, గ్రేటర్ విజయవాడ పదిహేను లక్షలు పైగా జనాభా కలిగి ఉన్నాయి, మిగిలిన మూడు పట్టణాల జనాభా ఐదు, ఆరు లక్షల లోపు గానే ఉంటుంది.
భౌగోళికంగా చూస్తే విజయవాడ, రాష్టంలో అన్ని ప్రాంతాలకు, తెలంగాణాకు కు కూడా అనుకూలంగా ఉండే పట్టణం. ఇక్కడ నుండి రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాలు నాలుగు వందల కిలోమీటర్ల లోపు దూరంలోనే ఉన్నాయి. విజయవాడ పట్టణం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు బస్సు, మరియు రవాణా సౌకర్యం కలిగి ఉంది. ఈ పట్టణం నుండి రాష్ట్రం లోని ముఖ్య పట్టణాలు, మరియి దక్షిణ భారత దేశంలో ముఖ్య పట్టణాలు కలిపే రోడ్డు మార్గం కలిగి ఉంది. భారత దేశంలో అన్ని ప్రధాన పట్టణాలను కలిపే అతి పెద్ద రైల్వే కూడలి పట్టణంగా విజయవాడ నగరం యెంతో ప్రసిద్ధి చెందింది.
విజయవాడలో విమానాశ్రయం ఉండటం కూడా ఎంతో అనుకూలాంశం. ఇప్పటికే విజయవాడ విమానాశ్రయానికి నాలుగు వందల నలభై ఎకరాల స్థలం కలిగి ఉంది, మరియు ఇంకో నాలుగు వందల ముప్పది రెండు ఎకరాల స్థల సేకరణకు రంగం సిద్ధమైంది. ఈ విమానాశ్రయం జాతీయ రహదారిని ఆనుకుని, విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉంది. త్వరలోనే మచిలీపట్టణంలొ అతి పెద్ద నౌకాశ్రయం రాబోతుంది.
ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సచివాలయం మొదలైన ముఖ్యమైన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలంటే పెద్ద మొత్తంలో ప్రభుత్వ స్థలాలు ఉన్న నగరం ఐతే రాజధానికి అనుకూలం గా ఉంటుందనే వాదన ఒకటి ఉంది. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు పెద్ద మొత్తంలో స్థలం అవసరం అయ్యేది కానీ, ప్రస్తుతం తక్కువ స్థలంలోనే బహుళ అంతస్తుల భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించే అవకాశం వుంది, అందువలన ప్రభుత్వ మిగులు భూమి లభ్యత అనేది ముఖ్యమైన విషయం కానే కాదు, ఈ విధంగా చూసినా కూడా విజయవాడ పట్టణాన్ని ఆనుకొని మంగళగిరి, మరియు గన్నవరం ప్రాంతాలలో వందల ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు ఉన్నాయి.
విజయవాడ నగరంలో పుష్కలమైన నీటి లభ్యత ఉంది. ఈ నగరం నుండి కృష్ణా నది ప్రవహిస్తుంది, అదే విధంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా యెంతో ఎక్కువగా లభిస్తాయి. ఇన్ని అనుకూలతలు కలిగిన పట్టణం ఆంధ్ర రాష్ట్రంలో మరొకటి లెదు. ఇప్పటికే విజయవాడ నగరాన్ని వాణిజ్య, రాజకీయ, కళా రంగాలకు రాజధానిగా అభివర్ణిస్తారు.
కోస్తా జిల్లాల్లో ఆర్ధికంగా బలపడిన వారు వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎన్నో విజయాలు సాధించారు, హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో మరియు విదేశాలలో ఎన్నో పరిశ్రమలు స్థాపించారు, ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించారు, యెంతో సంపద సృష్టించారు. విజయవాడ రాజధానిగా ఏర్పడే పక్షంలో ఆ ప్రాంతంలో వీరు అనేక పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంది తద్వారా ఈ ప్రాంతం ఆర్ధికంగా, పారిశ్రామికంగా యెంతో అభివృద్ధి చెంది హైదరాబాద్ ను సవాలు చేసే అవకాశం వుంది.
ఉమ్మడి మదరాసు రాష్ట్రం విడిపోయి ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పుడు రాష్ట్ర రాజధానిగా కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రానికి నడిబొడ్డు పట్టణం విజయవాడ ని పరిగణలోకి తీసుకున్నారు, కాని అప్పటికే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉండటం, ఈ జిల్లాలో కమ్మ వారి ప్రాబల్యం అధికంగా వుండటం వంటి కారణాల వలన, రాష్ట్ర రాజకీయాల్లో మరియు కాంగ్రెస్ పార్టీలో బలమైన రెడ్డి వర్గం విజయవాడ రాజధానిగా ఏర్పాటు చేయాలనే అంశానికి ఆదిలోనే తెర దించి తాత్కాలిక రాజధానిగా కర్నూలు పట్టణాన్ని ఎంపిక చేశారు. కాని ఆ తరువాత మౌలిక వనరులు, వసతులు, భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలోకి ఉంచుకొని శాశ్వత రాజధానిగా హైదరాబాదు ను ఏర్పాటు చేశారు.
పై విషయాలను పరిగణలోకి తీసుకున్నపుడు త్వరలో ఏర్పడబోయే ప్రత్యెక రాష్ట్రానికి విజయవాడ రాజధానిగా ఏర్పాటు చేయాలనే విషయంలో మరే విధమైన సందేహాలకు తావుండకూడదు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రెడ్డి కులం వారి లాబీ పనిచేసే అవకాశం లెదు.. కమ్మ, కాపు మరియు ఇతర వర్గాలవారికి అనుకూలమైన విజయవాడ నగరానికే కాంగ్రెస్ పార్టీలో మెజారిటి వర్గాలు, అధిష్టానం అంగీకరించే అవకాశం ఉంది.

Comments