వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తో కలిసి పోటి చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వుంది. తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇంకా మంచి పట్టు వుందని ఈ మధ్య జరిగిన పంచాయతి ఎన్నికలలో రుజువయ్యింది. తెలుగుదేశం పార్టీ ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలలో మెజారిటీ స్థానాలు, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాదు, వరంగల్ జిల్లాలలో చెప్పుకోదగిన స్థానాలు సాధించింది.
భారతీయ జనతా పార్టీకి మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాదు, నల్గొండ జిల్లాల్లో కొన్ని నియోజక వర్గాలలో చెప్పుకోదగిన బలం ఉంది.
హైదరాబాద్ నగరం లో భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ఈ నగరంలో పార్టీలకు అతీతంగా మెజారిటి యువత, విద్యాధికులు వాణిజ్య, పారిశ్రామిక వర్గాలవారు భావి ప్రధానిగా మోడీ కి మద్దతు తెలియచేస్తున్నారు.
తెలంగాణా జిల్లాల్లో కమూనిస్ట్ పార్టీలకు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తప్ప మరే జిల్లాలలోను బలం లేదు, పైగా ఆ రెండు పార్టీలు తమకు బలం, పట్టు లేని నియోజక వర్గాలకోసం తెలుగుదేశం పార్టీ తో ఎన్నికల సమయంలో పేచిలకు దిగి చివరి నిముషం వరకు సమస్యలు సృష్టిస్తాయి.
జాతీయ స్థాయిలో బలం పుంజుకుంటున్న భారతీయ జనతా పార్టీ దక్షిణ భారత దేశం లో కర్ణాటకలో బలం పెంచుకునే తరుణంలో నాయకుల కుమ్ములాటల్లో నష్ట పోయింది.
ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఆ పార్టీకి ప్రస్తుత తరుణంలో తెలంగాణా రాష్ట్రంలోనే అవకాశం ఉంది. ఒంటరిగా పోటి చేస్తే అక్కడ ఆ పార్టీకి రెండు మించి పార్లమెంట్ స్థానాలు వచ్చే పరిస్థితి లేదు, అందువలన నమ్మకమైన మిత్ర పక్షం కోసం ఎదురు చూస్తుంది. ఈ పరిస్తితుల్లో తెరాస కంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకోవటం పైనే ఆ పార్టీ మొగ్గు చూపిస్తుంది. KCR ఏ పార్టీకి కూడా నమ్మ దగిన వ్యక్తి కాదు, ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో బలం పూర్తిగా తెలంగాణా ప్రాంతంలో బలం పూర్తిగా కోల్పోయిన ఆ పార్టీ గొంతెమ్మ కోర్కెలు తీర్చే సాహసం ఏ పార్టీ చేయక పోవచ్చు. ఆ పార్టీ ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి ఫలితాలు వెలువడిన తరువాత ఏదో ఒక పార్టీకి మద్దతు తెలియ చేయవచ్చు.
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం తో చంద్ర బాబు నాయుడుకు ఇప్పటికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణాలో ఆ పార్టీలొ మెజారిటీ శాసన సభ్యులు ఇప్పటికే భారతీయ జనతా పార్టీతొ పొత్తుకు తహ తహ లాడుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడిగా అక్కడి ప్రాంతం వ్యక్తే ఉండటం వలన మెజారిటీ సభ్యుల ఒత్తిడికి చంద్రబాబు నాయుడు తలవంచక తప్పదు. ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తుకు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Comments
మీరు
చెప్పింది అక్షరాలా నిజం.. తెలుగుదేశం B J P కలసి పోటీ చేస్తే తెలంగాణాలో కచ్చితం గా పార్టీ అధికారంలోకి వస్తుంది.