ఏదో ప్రయోజనాన్ని ఆశించి తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్న 'ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు' వెళుతూ, వెళుతూ 'తెలుగుదేశం పార్టీ కాపులను దూరం చేసుకుంటుంది' అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. తనేదో కాపు కులానికి ప్రతినిధిగా ఊహించుకుంటూ తనకు 'రాజ్యసభ' సీటు దక్కక పోవటం తన కులానికి జరిగిన అన్యాయంగా భావిస్తున్నాడు.
'ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు' ఒక సారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఉమ్మారెడ్డి కి తెలుగుదేశం పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, ఆయనకు MLA, MP మంత్రి పదవులకు ఎంపిక చేసింది, ఆయన గత 19 సంవత్సరాలుగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇంకా ఆయనకు పదవీ దాహం తీరలేదు, 'రాజ్య సభ' సభ్యత్వం కోసం ఆశ పడ్డారు, ఇలా పదవులన్నీ తనకే కావాలనుకున్నారు. నిజంగా ఆయన పార్టీలో కాపులకు న్యాయం జరగాలని భావిస్తే తనకు కాకుండా పార్టీలోనే మరో కాపు నాయకునికి పదవి కావాలని సిఫార్సు చేస్తే బాగుండేది.
తెలుగుదేశం పార్టీలో ఎన్నో కీలకమైన పదవులు అనుభవించిన 'వృద్ధ జంబుకాలు' పార్టీని వదిలి వెళుతూ పార్టీ మీద, పార్టీ అధినాయకుని మీద విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళెంత ఆత్మ ద్రోహం చేసుకుంటున్నారో అర్ధం చేసుకోవాలి.
కాపు కులాన్ని NTR కాని, చంద్రబాబు నాయుడు కాని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. వీరిద్దరూ తమ మంత్రివర్గంలో, మరియు ఇతర పదవులలో యెప్పుదూ కాపులకు పెద్ద పీట వేశారు. అనాదిగా కమ్మ MP లు మాత్రమే ఎన్నికవుతున్న మచిలీపట్టణం, చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గాలు కాపు వారికీ కేటాయించి వారికి రాజకీయంగా ఎంతో మేలు చేశారు. మంత్రివర్గంలో కీలకమైన పదవులు మరియు స్పీకర్ లాంటి ఉన్నతమైన పదవులెన్నో కట్టబెట్టారు.
కడప జిల్లా నుండి రెండు సార్లు కాపు/బలిజ కులానికి చెందిన సి.రామచంద్రయ్య కు రాజ్యసభ సభ్యతం కట్టబెట్టి రెడ్డి కులస్తులకు విరోధం అయ్యారు. కాని చివరకు అయన చేసిందేమిటి? వంగా గీత, మెంటే పద్మనాభం, యర్రా నారాయణ స్వామి, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆదికేశవులు నాయుడు, ఘంటా శ్రీనివాస రావు, మొదలైన వారికి ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ప్రసాదించిన తెలుగు దేశం పార్టీకి వారు తీరని ద్రోహం చేసారు.

రాబోయే ఉప ఎన్నికలలో బలిజ కులస్తులు అధికంగా కలిగిన 'రాజంపేట', 'రాయచోటి', 'అనంతపూర్ అర్బన్' 'తిరుపతి' స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలు వారికే కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం మాత్రమే వారికి ఇచ్చింది.
తెలుగు దేశం పార్టీ కమ్మవారి పార్టీ కాదు. తెలుగు దేశంలో అన్ని కులాల వారికి సముచిత స్థానం ఉంది. తెలుగు దేశం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల పార్టీగా రామారావు తీర్చి దిద్దారు. చంద్రబాబు నాయుడు ఒక రకంగా, అర్హతలు కలిగిన కమ్మవారిని కూడా పదవులకు దూరంగా ఉంచాడు. కమ్మవారి జనాభా అధికంగా కల ఒంగోలు, చిత్తూరు లాంటి కొన్ని నియోజకవర్గాలలో కాపు మరియు ఇతర కులాల వారికి ప్రాధాన్యత కల్పించారు.
Comments