జూన్ నెలలో జరుగబోయే 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలలో కమ్మవారి జనాభా ఎక్కువగా ఉండి అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్ణయించగల అసెంబ్లీ నియోజక వర్గాలు ప్రత్తిపాడు (యస్.సి), రైల్వే కోడూరు (యస్.సి), మాచెర్ల, ఒంగోలు, ఉదయగిరి. గెలుపు ఓటములు ప్రభావితం చేయగల స్థానాలు అనంతపూర్ అర్బన్, రాజంపేట, తిరుపతి.
పై ఆరు జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కమ్మ వారికి కేటాయించ లేదు. తెలుగు దేశం పార్టీ మాచెర్ల, ఒంగోలు, ఉదయగిరి స్థానాలు 'కమ్మ వారికి' కేటాయించి మిగిలిన మూడు స్థానాలు 'బలిజ కులస్తులకు' కేటాయించింది.
గుంటూరు జిల్లా 'మాచెర్ల' స్థానంలో 'తెలుగు దేశం' పార్టీని కమ్మవారిలో అత్యధికులు బలపరుస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కాని, 'జగన్' పార్టీలో కాని చెప్పుకో తగ్గ 'కమ్మ' నాయకులు లేరు. రెడ్డి వర్గంలో మెజారిటీ ఓట్లు 'జగన్' పార్టీకి, తక్కువ శాతం వోట్లు కాంగ్రెస్ పార్టీకి పడవచ్చు, ఇక్కడ BC ల వోట్లు అభ్యర్ధుల గెలుపును నిర్దేశించే ఆవకాశం ఉంది. పార్టీలో నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేస్తే ఈ స్థానంలో 'తెలుగు దేశం పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి.
ప్రకాశం జిల్లా 'ఒంగోలు' నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీకి కొంత సానుకూలత కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీల తరుపున 'రెడ్డి' సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్ధులు పోటి పడుతున్నారు. ఇక్కడ తెలుగు దేశం అభ్యర్ధి ఎంతో సౌమ్యునిగా, నిజాయితీ పరునిగా, పెద్దాయన అని అందరు పిలుచుకొనే మాజీ మంత్రి దామచెర్ల ఆంజనేయులు కొడుకు 'జనార్ధన్' నిలబడుతున్నాడు. ఈ నియోజక వర్గంలో మెజారిటీ బలిజ సామాజిక వర్గం వోట్లు కాంగ్రెస్ కు పడే ఆవకాశం ఉంది. రెడ్డి వర్గం వోట్లు రెండు కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోయే ఆవకాశం ఉంది. ఈ నియోజకవర్గం లో గణనీయమైన సంఖ్యలో ఉన్న 'వైశ్య' సామాజిక వర్గం మెజారిటీ వోట్లు, కమ్మవారి వోట్లు మొత్తంగాను తెలుగు దేశం పార్టీకి పోలయ్యే ఆవకాశం ఉంది.
నెల్లూరు జిల్లా 'ఉదయగిరి' స్థానం నుండి గతంలో కమ్మవారు 'ధనేంకుల నరసింహం', 'ముప్పవరపు వెంకయ్య నాయుడు' MLA లు గా ఎన్నికయ్యారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం వోట్లు యెంత మాత్రం చీలిపోయే ఆవకాశం లేక పోగా, కాంగ్రెస్ పార్టీ, వై.యస్.ఆర్ కాంగ్రెస్ ల మధ్య 'రెడ్డి' వర్గం వోట్లు చీలి పోయే ఆవకాశం ఉంది. మెజారిటీ 'రెడ్డి' వర్గం వోట్లు 'జగన్' పార్టీకి పోలయ్యే ఆవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చీల్చుకొనే వోట్లను బట్టి ఇక్కడ అభ్యర్ధుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆర్ధికంగా బలవంతుడు కావటం ఆ పార్టీకి కలసివచ్చే ఆవకాశం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడో స్థానంతో సరి పెట్టుకోవచ్చు. .
కాంగ్రెస్ పార్టీ 'తిరుపతి' స్థానాన్ని కమ్మ కులానికి చెందిన 'గల్లా జయదేవ్' కు కేటాయించి ఉంటె కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానంలో విజయావకాశాలు మెండుగా ఉండేవి. ఇక్కడ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల నుండి 'బలిజ' కులస్తులు పోటి పడుతుండగా 'వై.యస్.ఆర్ కాంగ్రెస్స్ తరుపున 'రెడ్డి' కులస్థుడు పోటి పడుతున్నాడు. ఇక్కడ రెడ్డి వర్గం వోట్లలో మూడు వంతులకు పైగా 'జగన్' పార్టీకి పడే ఆవకాశం ఉంది. 'బలిజ వర్గం' వోట్లు తెలుగు దేశం, కాంగ్రెస్స్ పార్టీల మధ్య సమానంగా చీలిపోయే ఆవకాశం ఉంది. ఇక్కడ తెలుగు దేశం పార్టీకి 'కమ్మ' వర్గం వోట్లు గంప గుత్తగా పడే ఆవకాశం ఉంది. అలాగే ఇక్కడ మరో బలమైన సామాజిక వర్గం 'యాదవ' కులస్థుల మెజారిటి వోట్లు తెలుగు దేశానికి పడే ఆవకాశం ఉంది. కుల సమీకరణాల దృష్ట్యా చుస్తే ఇక్కడ 'తెలుగు దేశం' పార్టీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మూడో స్థానం దక్కవచ్చు.
'అనంతపురం అర్బన్' లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుండి గట్టి సవాల్ ఎదురు కానుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్ధిని నిలపటం వలన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందే! కమ్మ, బలిజ సామాజిక వర్గం వోట్లు మొత్తంగా తెలుగు దేశం అభ్యర్ధికి పోలయ్యే అవకాశం ఉంది. తెలుగు దేశం పార్టీలో రెండు వర్గాలు కలిసి పనిచేస్తే ఇక్కడ ఆ పార్టీ గెలుపు తధ్యంగా కనిపిస్తుంది.
కడప జిల్లా 'రాజంపేట'లో మెజారిటీ 'బలిజ' వర్గం వోట్లు, గణనీయమైన సంఖ్యలో ఉన్న 'కమ్మ వారి' వోట్లు ఇక్కడ 'తెలుగు దేశం' అభ్యర్ధి విజయానికి బాటలు వేయనున్నాయి. కాంగ్రెస్ పార్టీ 'రెడ్డి' అభ్యర్ధికి సీట్ కేటాయించిన పక్షంలో ఇక్కడ తెలుగు దేశం అభ్యర్ధి, ఆర్ధికంగా బలవంతుడు 'పసుపులేటి బ్రహ్మయ్య' గెలుపు నల్లేరు మీద నడకే!
యస్.సి సామాజిక వర్గానికి కేటాయించిన 'ప్రత్తిపాడు' నియోజక వర్గం ఆది నుండి 'కమ్మవారికి' బలమైన స్థానం. వై.యస్.ఆర్ పట్టుబట్టి ఈ స్థానాన్ని నియోజకవర్గాల పునర్విభజనలో 'యస్.సి' లకు కేటాయించారు. ఈ నియోజక వర్గం నుండి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి, మతి స్తిమితం కోల్పోయిన డా.మాకినేని పెద రత్తయ్య ప్రస్తుతం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాని 'కమ్మ' వర్గం వోటర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేడు. యమ.పి రాయపాటి సాంబశివ రావు మాట విని 'కమ్మ వారు' కాంగ్రెస్ పార్టీకి వోటు చేసే అవకాశాలు కూడా ఈ నియోజక వర్గంలో లేవు. ఈ నియోజకవర్గం లో 'తెలుగు దేశం' పార్టీ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది.
కడప జిల్లా 'రైల్వే కోడూరు' (యస్.సి) నియోజక వర్గం గత 30 సంవత్సరాలుగా 'తెలుగు దేశం' పార్టీకి కంచు కోటలా ఉంది. ఈ నియోజక వర్గంలో 'కమ్మ వారి' జనాభా అధికం, కమ్మ, బలిజ, యస్.సి వర్గం వోట్లతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది.
Comments
ఎందుకంటే,TDP వల్ల ప్రయోజనం పొందిన అణగారిన వర్గాల వోట్లు కావచ్చు,కులాభిమానం కావచ్చు,
కొన్ని నియోజకవర్గాలలో ఎక్కువగా ఉన్నటువంటి కమ్మ వారి వోట్ల వలన మనం ఈ విధంగా ఆశ పడ్తున్నామన్పిస్తున్నది.
TDP కి మొదటినుండి ఇప్పటి వరకూ గొప్ప అండ,బలం కార్యకర్తలే.కాని నాయకులు చేస్తున్నదేమిటి? వీరి స్వార్థ ప్రయోజనాల కోసం
ఈ రోజు జగన్ రెడ్డి పార్టీ లోకి Q కడుతున్నారు.ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నారు? ఒక అవినీతిపరుడికి సిగ్గు ఎగ్గు లేకుండా బహిరంగంగా
మద్దతు పలుకుతున్నారంటే వీరంతా ప్రజల గురించి ఏమనుకుంటున్నారు? గొర్రెలని అనుకుంటున్నట్టుంది.
ప్రత్యేకించి కమ్మ కులానికి చెందిన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు.
ఎల్లప్పుడూ కమ్మ వారంటే బహిరంగంగానే ద్వేషం,పగ కనపర్చే జగన్ రెడ్డి వెంట వీరంతా వెళ్దాం అనుకున్ట్టున్నారంటే వీళ్ళని అసహ్యించుకోవటం తప్ప చెయ్యగలిగింది ఇంకోటి ఏమి లేదు.
ఎంత స్వార్థం వున్నా ఇలా ఆత్మాభిమానం చంపుకొని,ఆత్మగౌరవం తాకట్టుపెట్టి,కళ్ళు లేని కభోదుల్ల గుడ్డి గా అతన్ని వీరంతా అనుసరిస్తున్నారంటే చీము,నెత్తురు లేదా వీళ్ళకి?
ఈ వలసల్ని ఆపగలిగింది కేవలం ప్రజలు,కార్యకర్తలే. ఒక అవినీతిపరుడ్ని ఎందుకు ఆమోదించాలని ప్రజలు,రాష్ట్రానికి ఎనలేని సేవ చేసిన పార్టీ ని వదిలి వెళ్తున్నారెందుకు అని TDP కార్యకర్తలు,
మన కుల వ్యతిరేకి వెంట వెళ్లి సాధించేది ఏమిటి అని కమ్మ వారు ఎక్కడికక్కడ నిలదీస్తే కాని వీరికి తాము కోల్పోయిన ఆత్మాభిమానమూ,ఆత్మగౌరవం,జగన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రానికి,దేశానికీ,
జరగబోయే నష్తం ఏంటో గుర్తుకోస్తాయేమో.