Unity is Strength |
ఈ రాష్ట్రంలో ప్రతి కులం వారికి రాష్ట్ర స్థాయిలో ఒక సమాఖ్య ఉంది, కాని మన కులం వారికి మాత్రం రాష్ట్ర స్థాయిలో ఒక సమాఖ్య అంటూ లేకపోవటం వలన రాజకీయంగా మనం చాలా వెనుకబడి పోతున్నాం. ఇప్పటికే మనవారు అధికంగా ఉన్న చాలా నియోజకవర్గాలు రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్ళాయి. రాష్ట్ర రాజకీయాల్లో మనం కీలక పాత్ర వహిస్తున్నాం కానీ, రాష్ట్ర మంత్రివర్గంలో మన సంఖ్య నామ మాత్రమే. ఇక్కడ అతి కష్టం మీద గల్లా అరుణ కుమారికి ఒక అప్రధాన శాఖ కేటాయించి చేతులు దులుపుకున్నారు. (తమిళనాడు ప్రభుత్వంలో ఇద్దరు కమ్మవారు మంత్రులుగా వున్నారు.) కేంద్రంలో రాయపాటి, కావూరి వంటి సీనియర్ యం.పి లను విస్మరించి ఇతర కులాల్లో జూనియర్లకు కూడా మంత్రి పదవులు కట్టబెట్టారు. దీనికి ముఖ్య కారణం మనకు సంఖ్యా బలం ఉన్నా కాని, ఐకమత్యం, ఉమ్మడి వాదం లేకపోవటమే.
ఏపార్టీలో ఉన్నామనం కమ్మవారమే, మనకు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటే. అన్ని రాజకీయ పార్టీలలో మనకు సరైన న్యాయం జరగాలి, సరైన ప్రాతినిధ్యం లభించాలి.
ఎం.ఎల్.సి కోటాలో ఇతర కులాల వారికి మాత్రం మంత్రి పదవులు కట్టబెడ్తున్నారు, కాని మన కులంలో పాలడుగు వెంకటరావు లాంటి సీనియర్ నాయకులను మాత్రం విస్మరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవి లాంటి యువ ఎం.ఎల్.ఏని కూడా విస్మరించారు. కమ్మవారి జనాభా అధికంగా ఉన్న కృష్ణ, ప్రకాశం జిల్లాల నుండి ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కక పోవటం విచారకరం. కాంగ్రెస్ పార్టీకి ఆర్ధిక వనరులు చేకుర్చటానికి మాత్రం కమ్మవారు కావాలి కాని, పదవుల విషయంలో మాత్రం వీరితో పనిలేదు. కాంగ్రెస్ పార్టీలో కమ్మ వారికి ఈ రాష్ట్రంలో రాజ్యసభకు నామినేట్ చేయబడి రెండు దశాబ్దాలు అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో మరే ఇతర కులం వారికి ఇంత అన్యాయం జరగలేదు.
ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన ప్రతివారు తమ కుల సంఘాల సమావేశాలకు అతిధులుగా హాజరయ్యారు, ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప. ఈయన మాత్రం ఇతర కుల సంఘాల సమావేశాలకు అతిదిగా వెళ్ళాడు, తన కులం వారికి మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ విషయంలో మాత్రం మనం శ్రీమతి పురందేశ్వరిని ఎంతో అభినందించవచ్చు. ఈవిడ కేంద్రంలో మంత్రిగా బిజీగా ఉన్నాకూడా కమ్మ సంఘాల సమావేశాలకు హాజరై తన సంఘిభావాన్ని తెలియచేస్తారు.
కుల సంఘాలు తప్పని విమర్శించేవారు చాలామంది ఇక్కడో విషయం గమనించాలి. మనకు కులం పేరు ప్రస్తావించనిదే ఎక్కడా పనికాదు. స్కూల్ అడ్మిషన్ దగ్గరనుండి ప్రతి ప్రభుత్వ ధరకాస్తులో కూడా కులం ప్రమేయం లేనిదే చెల్లుబాటు కాదు. అంతెందుకు, ఈ ప్రభుత్వమే కులాల వారి జన గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రిజర్వేషన్ విధానంతో ఈ ప్రభుత్వాలే సమాజాన్ని కులాల పరంగా విడగొట్టింది. చదువు, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాలు, ఇలా ప్రతి విషయంలో కుల ప్రమేయాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఎప్పుడైతే ఈవిధానం తొలగిపోతుందో, కులాల పరంగా ఈ అసమానతలు తొలగిపోతాయో, ప్రతిభ కలవారికి, ఆర్ధికంగా వెనుకబడినవారికి కుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రోస్థాహం లభిస్తుందో బహుశా అప్పుడీ కుల సంఘాల ప్రభావం తగ్గవచ్చు. మనం, మన జాతీయ గురించి, మతం గురించి చెప్పుకుంటే తప్పుకాదు కానీ కులం గురించి చెప్పుకుంటే మాత్రం తప్పా?
మనం కుల సంఘాలు పెట్టుకుంటుంది వేరే కులాలవారికి వ్యతిరేకంగా కాదని మనకులంవారి ప్రయోజనాలు కాపాడుకుంటూ, మనకులంలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి విద్య, ఉపాధి మొదలైన విషయాలలో తోడ్పాటునందిస్తూ, ఇతరకులాలవారితో సామరస్య పూర్వకంగా ఉంటూ, తద్వారా సమాజసేవ చేస్తున్నామనే భావనతోనే గమనించాలి.
మన ఇకమత్యాన్ని, ఉమ్మడి వాదాన్ని ఇతరులకు తెలియ చేయాలన్నా, మన హక్కులను మనం కాపాడుకుంటూ, ఇతర హక్కులను సాధించాలన్నా మనకంటూ ఒక వేదిక ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమ్మ సంఘాలన్నీ కలిసి ఉమ్మడిగా ఒక వేదిక ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది.
సుసంపన్నమైన నాగరికత, చరిత్ర కలిగిన కమ్మ వారిగా పుట్టినందుకు గర్విద్దాం. ఇతరకులాలవారితో స్నేహ, సోదర భావంతో కలసి మెలసి ఉంటూ సమాజ సేవ చేద్దాం.
ఆంధ్ర ప్రదేశ్ కమ్మ సమాఖ్య ఏర్పాటు దిశగా ప్రయత్నం మొదలైంది, త్వరలోనే కార్యరూపం దాల్చనుంది.
ఈ విషయంలో మీ అభిప్రాయాలను తెలియ చేయండి.
email: kammavelugu@gmail.com
Mobile: 08125682058
Comments
We have to form like a Union, which never happend.. We have to show our POWER to the Nation..
All The Best and waiting for this..
that's the problem with our kamma community.instead of growing will pull other legs.
We need positive attitude in this case to form KAMMA SANGAM(than we can raise voice)
Thanks,
Lenin.