Skip to main content

జై ఆంధ్ర... జై జై ఆంధ్ర....

ప్రత్యేక ఆంధ్రకు జై కొడదాం!

ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్ వచ్చి ఎన్నో ఏళ్ళ క్రితం స్థిరపడిన వారిని కూడా ప్రస్తుత కరడు కట్టిన తెలంగాణా వాదులు ఆంధ్రా ప్రాంతంలోకి తరిమి కొద్తామంటున్నారు. ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల వారు, లేదా ఇతర దేశాల వారు వచ్చి ఉద్యోగం, వ్యాపారం చేసుకోవచ్చు కాని ఆంధ్ర వారికి మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు కొంతమంది అవకాశవాదులు. రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు.

ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో వసూలు చేసిన పన్నులతో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాలైన మెదక్, రంగారెడ్డి ప్రాంతాలలో ఎన్నోకేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంలో ఎన్నో పరిశ్రమలు స్థాపించారు. హైదరాబాదులో కొన్ని లక్షల కోట్లు వ్యయం చేసి మౌలిక వనరులు ఏర్పాటు చేశారు.

తెలంగాణా జిల్లాలలో ఆంధ్ర ప్రాంతం వారు పరిశ్రమలు స్థాపించటం వలన ఎక్కువగా లబ్ది పొందింది ఈ ప్రాంతం వారే. అక్కడి వారెందరో తమ ప్రాంతంలోనే ఉపాధి సంపాదించుకొన్నారు, ఆ ప్రాంతంలో భూముల విలువ పెరగటం మూలంగా లబ్ది పొందింది కూడా వారే. తెలంగాణా ప్రాంతంలో పరిశ్రమ స్థాపించిన ఒక్క ఆంధ్ర ప్రాంతం పారిశ్రామికవేత్త ప్రయోజనం పొందితే అనేకమంది తెలంగాణా ప్రాంతంవారికి ఉపాధి పొందటం ద్వారా ప్రయోజనం కలిగింది.

తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంవారు కార్పరేట్ కళాశాలలు ఏర్పాటు చేయటం వలన గత రెండు దశాబ్దాలుగా లబ్ది పొందిన ఈ ప్రాంతం వారు ప్రస్తుతం విద్య, ఉద్యోగ పరంగా కూడా మంచి స్థానాలలో ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతాల నుండి ధనికులైన వారూ మాత్రమె తమ పిల్లలని ఆంధ్ర ప్రాంతంలోని కళాశాలల్లో చదివించేవారు. కాని ప్రస్తుతం మంచి నాణ్యమైన విద్య అందుబాటులో లభించటం కారణంగా ఈ ప్రాంతంలోని మధ్య మరియు దిగువ మధ్య తరగతి విద్యార్ధులు కూడా ఎంతో ప్రయోజనం పొంది మంచి ఉపాధి అవకాశాలను పొందగలిగారు.

ఆంధ్ర ప్రాంతంలో విద్యావంతులు, పెట్టుబడిదారులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించటానికి సరైన మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పోవటంతో తెలంగాణా ప్రాంతంలో మరియు ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ప్రత్యేక ఆంధ్రా రాష్ట్రం ఏర్పడిన పక్షంలో వీరిలో ఎంతోమంది ఆంధ్ర ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించటానికి ముందుకు వస్తారు, తద్వారా ఇక్కడి వారికి ఉపాధి మరియు మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి.

కొత్తగా ఉద్యోగం, ఉపాధి పొందినవారి వలన, రైతుల భూములకు మంచి విలువ లభించటం మూలంగా ఇక్కడి వారి వ్యక్తిగత ఆదాయం మరియు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆంధ్ర ప్రాంతం తెలంగాణా నుండి విడిపోయిన పక్షంలో ఒక దశాబ్దంలోనే హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో సమానంగా వ్యసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో గుజరాత్ మరియు మహారాష్ట్ర లతో పోటి పడగలదు.


పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి, పులిచింతల ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యంగా కృష్ణ డెల్టాకు, వ్యవసాయానికి, తాగునీటికి కరువు ఉండదు. కృష్ణ, గోదావరి జలాల నీటి వాటా  విషయంలో ఇరు ప్రాంతాలవారికి  ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఒక ప్రధాన సమస్య తీరినట్లె.  ఇప్పటికే   విద్యుత్ ఉత్పత్తిలో కోస్తా ఆంధ్ర రాయలసీమ మిగులు విద్యుత్ కలిగి ఉంది. కొత్తగా ఈ ప్రాంతంలో  పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయటానికి ఇది యెంతో అనుకూలమైన అంశం.

రాష్ట్రం విడిపోతే నష్టపోయేది ఎవరో కొద్ది మంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమె. లబ్ది పొందేవారు మాత్రం ఆంధ్ర ప్రాంతంలో 
అంతకు కొన్ని వేల రెట్లు ఉన్నారు.


ఈ ప్రాంతంనుండి ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఎన్నికైనా, వారు హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు ఆస్తులు కూడా ఆప్రాంతంలోనే ఏర్పాటుచేసుకున్నారు. వారివలన మన ప్రాంతానికి ఏవిధమైన ప్రయోజనం కలగలేదు, కలగదు కూడా. రాష్ట్రం విడిపోతే వీరికి నష్టం, అందుకే వీళ్ళు రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. కొందరి ప్రయోజనం కోసం ఎంతోమంది ప్రయోజనాలు తాకట్టు పెడతారా?

అందుకే ఆలోచించండి ఆంధ్రులారా.. మన రాష్ట్రంలో, మన రాజధానిలో మనం ప్రధమ శ్రేణి పౌరులుగా బ్రతుకుదాం.

జై ఆంధ్ర.. జై జై ఆంధ్ర.. జై కాకాని వెంకటరత్నం...

Also read: http://kammasworld.blogspot.com/2008/01/need-of-separate-andhra.html
http://kammasworld.blogspot.com/2008/01/need-for-separate-state-2.html

Comments

Anonymous said…
Very good and encouraging article...kindly spend this word as much as possible.
Suresh said…
May someone kindly help us to translate it in English for the benefit of TN Kamms. Thanks suresh