కేంద్రంలో, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి.
సోనియా గాంధీ ఆదేశంపై, ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలకు సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి యన్.గోపాలస్వామి తో హోంమంత్రి 'శివరాజ్ పాటిల్', పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి 'వయలార్ రవి' సమావేశమైనట్లు తెలిసింది.
కూలుతున్న స్టాక్ మార్కెట్లు, కుంగిపోతున్న ఆర్ధిక వ్యవస్థ, బలహీనపడుతున్న రూపాయి విలువ, కాంగ్రెస్ పార్టీకి కలవరం కలిగిస్తుంది.
ప్రధాని పదవిపై కన్నేసిన 'లాలు ప్రసాద్ యాదవ్' ఆ దిక్కుగా తన ప్రయత్నాలు తను చేసుకుంటున్నాడు. యాదవ్ ద్వయం ములాయం, లాలు వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకొన్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి సంకేతాలు అందాయి.
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలలు జరిగే ఐదు రాష్ట్రాలలో బి.జే.పి పరిస్థితి మేరుగుపడితే ఆ పార్టీతో జట్టుకట్టటానికి ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.
వామపక్షాలు, తెలుగుదేశం, బి.యస్.పి మరికొన్ని పక్షాలతో కలిపి జట్టుకట్టి 'మాయావతి'ని 'ప్రధాని' అభ్యర్ధిగా ముందుకు తీసుకురావటం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంప్రదాయ వోట్ బాంకైన దళితుల్లో చీలికవచ్చే అవకాశం కుడా కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటివల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో, మార్చి నెల తరువాత ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పదని స్పష్టమైంది.
కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ యమ్.పి లున్న 'ఆంధ్ర ప్రదేశ్'లో కూడా ఆ పార్టీ బాగా బలహీన పడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీలో అసమ్మతి, గ్రూపు తగాదాలు కూడా ఎక్కువయ్యాయి. పరిస్థితి ఇదే విధంగా ఉంటె ఎన్నికలు సమీపించే సమయానికి కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు కూడా ఉండవని కాంగ్రెస్ అధిష్టానవర్గానికి సమాచారం అందింది.
రాజశేఖర రెడ్డి తన మనసులో భావనను ఇదే విధంగా అధిష్టానం ముందు ఉంచారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ మరింత బలం పుంజుకోక ముందే ఎన్నికలకు వెళితే బాగుంటుందని, మార్చి నెల తరువాత ఎన్నికలు పెడితే, ఎండాకాలంలో పెరిగే కరంట్ కోతలు, నిత్యావసర వస్తువుల ధరలు ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టవచ్చని అధిష్టాన వర్గానికి సూచించినట్లు తెలిసింది.
అధిష్టానం కూడా 'పచ్చ జెండా' ఉపిన నేపధ్యంలో అన్ని వర్గాలకు కొత్త వరాలు ప్రకటించటానికి సిద్ధమయ్యారు, అసమ్మతిని బుజ్జగించటానికి అవసరమైతే ఒక మెట్టు దిగటానికి కూడా నిర్ణయించుకొన్నారు.
శీతాకాలం లో ఎన్నికలవేడి రగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇక రాబోయే కాలం 'ఎన్నికల కాలమే?'

Comments