తమిళనాడు కమ్మవారి చరిత్ర, సమాచారం:
తమిళనాడులో కమ్మవారి జనాభా దక్షిణ తమిళనాడు జిల్లాలు తిరునల్వేలి, తూత్తుకుడి, తేని, దున్డిగల్, విరుదునగర్ జిల్లాలలో ఎక్కువగా ఉంది. తరువాత కోయంబత్తూరు, కడలూరు, వేలూరు, తిరువన్నామలై, విల్లుపురం, మదురై, నీలగిరి, కంచి జిల్లాలు మరియు చెన్నై పట్టణంలో కమ్మవారి జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంది.
దక్షిణ తమిళనాడులో కమ్మవారి చరిత్ర:
తమిళనాడు రాష్ట్రంలో కమ్మవారి జనాభా కోవిల్పట్టి, సాత్తూరు, రాజపాల్యం, విరుడునగర్, తేని, శివకాశి, శ్రివిల్లిపుత్తూరు, దున్డిగల్ మొదలైన ప్రాంతాలలో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కమ్మవారిని ఎక్కువగా 'నాయకర్' పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో కమ్మవారు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడి కమ్మవారు మన కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాల రైతులవలె ఎక్కువగా నల్లరేగడి నేలల్లో వ్యవసాయం చేస్తూ, ప్రత్తి, పొగాకు, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తున్నారు. నీటి వసతి కలిగిన ప్రాంతాలలో చెరుకు, వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ప్రత్తి పంటకు ప్రసిద్ధి చెందింది,
ఈప్రాంతంలో అనేక నూలు మిల్లులు ఉన్నాయి. దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన 'జయవిలాస్' గ్రూప్, అరుప్పుకొట్టై తాలూకా, విరుదునగర్ జిల్లాలో ఉంది. కమ్మవారిలో ప్రసిద్ధి గాంచిన సాధు రామస్వామి నాయుడు ఈ గ్రూప్ వ్యవస్తాపకులు, వీరు ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించారు. వీరికి నూలు మిల్లులు, ట్రాన్స్పోర్టు వ్యాపారం మినీ పవర్ ప్లాంట్ ఉంది. వీరు తమ పరిశ్రమలలో కమ్మవారికి, ముఖ్యంగా స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి ఆర్దికభివ్రుద్ధికి తోడ్పడుతున్నారు. ఈ ప్రాంతంలో 'జయలలిత' గత మూడుసార్లు గెలుస్తూ వచ్చిన 'అందిపట్టి' నియోజకవర్గంలో కమ్మవారి జనాభా ఎక్కువ. ఇక్కడ కమ్మవారిచే స్థాపించబడిన 'రాజశ్రీ షుగర్స్' ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
ఇక్కడి కమ్మవారు మిగిలిన ప్రాంతాలవారితో పోల్చితే కొంచెం ఆర్ధికంగా వెనుకబదినవారు, అందువలన తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాంతంలో కమ్మవారిని బి.సి కులంలో చేర్చి విద్య మరియు ఉద్యోగ రంగాలలో కొన్ని రాయితీలు ఇచ్చింది. తమిళనాడులో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, మరియు ఇతర ఉన్నత పదవులలోని కమ్మవారు ఎక్కువమంది ఈ ప్రాంతంనుండి వచ్చినవారే.
ప్రముఖ రాజకీయ నాయకుడు, యం.డి.యం.కే. వ్యస్తాపకుడు, వైకో (పులిపాటి. వాయుపురి. గోపాలస్వామి) కలింగాపట్టి గ్రామం, తిరునల్వేలి జిల్లాకు చెందినవాడు. మాజీ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టీస్.కే.వీరాస్వామి, వి.రామస్వామి, అలగిరిస్వామి, జస్టీస్.చెరుకూరి.రామానుజం, కే.వెంకటస్వామి, కే.గోవిందరాజన్ మొదలైన వారు శివకాశి, శ్రివిల్లిపుత్తూరు, తేని ప్రాంతాలకు చెందినవారు. ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ దున్డిగల్ జిల్లాకు చెందినవారు. రాజశేఖర్ బావ, తమిళనాడు అడిషనల్ డి.జి.పి వి.బాలచంద్రన్ ఐ.పి.ఎస్. కుడా ఇక్కడి వారే.
to be continued.....
http://kammasworld.blogspot.com/2008/01/tamilnadu-kammavaari-charitra-2.html
Comments