తిరునల్వేలి జిల్లాలో కోవిల్పట్టి, కలింగాపట్టి, సత్తెరపట్టి, వరహనూర్, ముక్కుట్టుమలై, ఇలరసనందల్, పులియంకలవ్, సిత్తరంపట్టి, అప్పనేరి, అయ్యనేరి, నక్కల ముత్తంపత్తి (కమ్మ క్రిస్టియన్స్ ఎక్కువ), నడువపట్టి, మైపార, సంగనట్టి, వెల్లకులవ్, ఆకరిశంకులవ్, అలమనయకర్పట్టి, వడక్కు కుర్వికులం, కురింజకులం, సుందరేశపురం, కులకట్టకురుచ్చి, వాడక్కుపట్టి, పిల్లియార్నట్టం, జమిన్దేవర్కులం, రామలింగాపురం, తెర్కుకుర్వికులం, మలయాన్కులం, మరుదాపురం, కే.అలంగులం, నలంతుల, నడువకురుచ్చి, కులశేఖర మంగళ, అచంబట్టి, వెల్లపనేరి, తిరువెంగులం పెరురచ్చి మొదలైన ప్రాంతాలలో కమ్మవారి జనాభా అధికంగా ఉంది.
తిరునల్వేలి జిల్లా, కోవిల్పట్టి తాలుకా లో తమిళనాడు కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యాలయం ఉంది. ఇక్కడ ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తుంటారు, మ్యారేజ్ బ్యూరో ఉంది. ఈ జిల్లాలో, కమ్మవారి సంఘం విశ్వనాధపేరి లో 'కమ్మవార్ హైస్కూల్' మరియు కోవిల్పట్టి లో 'కమ్మవారి బాలికల హైస్కూల్' నిర్వహిస్తున్నారు. తమిళనాడు కమ్మ మహజన సంఘం అధ్యక్షులు గెంగుస్వామి నాయుడు గారి సహకారంతో ఈ రెండు విద్యాలయాలు స్తాపించబడ్డాయి.
ఈ జిల్లాలో పెరియకులం పార్లమెంట్ స్థానం నుండి గతంలో ఆర్.జ్ఞానస్వామి, నారాయణస్వామి నాయుడు యం.పి గా ఎన్నికయ్యారు. ఈ జిల్లాలో గతంలో గోవిందస్వామి నాయకర్, లక్ష్మీపతి నాయకర్, రామస్వామిదాస్, అలగిరిస్వామి, వెంకటస్వామి నాయకర్, ది.కే.నాయుడు, రెంగస్వామి, డి.వేణుగోపాల్ నాయుడు, వి.కృష్ణస్వామి, అయ్యలుస్వామి, బాలకృష్ణన్, ఎస్.కే.రామస్వామి మొదలైనవారు యం.యల్.ఏ లు గా ఎన్నికయ్యారు. కోవిల్పట్టి ప్రస్తుత యం.యల్.ఏ, యల్.రాధాకృష్ణన్ (ఏ.ఐ.డి.యం.కే) కమ్మవారే.
కోవిల్పట్టి పట్టణంలో కమ్మవారు అనేక ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఈ పట్టణంలోని డాక్టర్లలో 40% మంది కమ్మవారే. ఈ జిల్లానుండి అనేకమంది కమ్మవారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు.
to be continued......
Comments