అనంతపురం, జనవరి 24 : దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర 3వ వర్థంతిని అనంతపురంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈరోజు ఉదయం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయ చౌదరితోపాటు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. పరిటాల రవీంద్ర పార్టీకి, జిల్లా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
అనంతరం సాయంత్రం వెంకటాపురంలో లక్షలాది అభిమానుల మధ్య జరిగిన స్వర్గీయ పరిటాల రవి వర్ధంతి సభలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవేశంగా మాట్లాడుతూ, తొమ్మిదేళ్లు తాము అధికారంలో ఉన్నప్పుడు హింసా రాజకీయాలకు పాల్పడి ఉంటే కాంగ్రెస్ నేతలు మిగిలి ఉండేవారు కారని అన్నారు. రవిని కాంగ్రెస్‌వారే చంపారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పరిటాల సునీత, జిల్లాకు చెందిన తెదేపా నేతలు రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రవి పేరిట రూపొందించిన ఓ వెబ్‌సైట్‌ను బాబు ప్రారంభించారు. వర్ధంతి సభకు రవి అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో ఇక్కడ తొక్కిసలాట జరిగి ఇరవై మంది తెదేపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
స్వర్గీయ పరిటాల రవి గురించిన సమాచారం మరియు ఫోటోలు, తాజా వివరాల కోసం www.paritalaravi.com
Comments