ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రాంతం వాళ్ళలో ఎక్కువ మంది మన ప్రాంతంలో సరైన ఉపాధి, వ్యాపార అవకాశాలు లేక ఇక్కడికి బ్రతుకుతెరువు కోసం వచ్చిన వారే. గత 15-20 సంవత్సరాలలో ఈ సంఖ్య బాగా ఎక్కువైంది. ఆంధ్ర ప్రాంతం లో విద్యాధికులు ఎక్కువగా ఉన్నా కాని, పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం మూలంగా ఉపాధి కోసం హైదరాబాద్ వలస రావటం తప్పనిసరైంది.
ఒక పధకం ప్రకారం గతంలో పాలకులు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణాలను పారిశ్రామిక రంగంలో నిర్లక్ష్యం చేసారు. ఉక్కు కాకాని 'ప్రత్యేక ఆంధ్ర' రాష్ట్రాన్ని 35 సంవత్సరాల క్రితం సాధించ కలిగి ఉంటే, విద్యాధికులు, ఆర్ధికంగా బలవంతులైన ఆంధ్ర ప్రాంతం వారు, విదేశాలలో స్థిరపడిన వారు ఈ ప్రాంతాన్ని 'గుజరాత్', 'మహారాష్ట్ర' వంటి రాష్ట్రాలకు దీటుగా వ్యాపార, పారిశ్రామిక రంగాలలో తీర్చిదిద్దేవారు.
కొంతమంది ఆంధ్ర ప్రాంతం వారు చేస్తున్నవాదం ప్రకారం, గత ఐదు దశాబ్దాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలలో పన్ను వసూళ్ళు, ఇతర ఆదాయంలో ఎక్కువ భాగం 'హైదరాబాద్', 'తెలంగాణా' రాష్ట్రాలలో ఖర్చు చేశారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రం విడిపోకూడదు, ఒకవేళ విడిపోయినా 'హైదరాబాద్' కేంద్రపాలిత ప్రాంతం గా ఉండాలని అంటున్నారు. 'హైదరాబాద్' తెలంగాణా నడిబొడ్డు, గుండెకాయ లాంటిది. 'హైదరాబాద్' కేంద్రపాలిత ప్రాంతం గా ఉండాలనే హక్కు మనకి లేదు, హైదరాబాద్ తెలంగాణా లో కలిసిఉన్నా, లేకపోయినా 'ఆంధ్ర ప్రాంతం' వారికి వచ్చే నష్టం లేదు. నష్టం అంటూ ఉంటే 'ఆర్ధికంగా' బలిసిన కొంతమంది ఆంధ్ర ప్రాంత 'బడా బాబులకు' మాత్రమె.
ఇప్పటికే ఆంధ్ర ప్రాంతం లో సంపద అంతా హైదరాబాద్ లో ఖర్చు చేశారు. ఈ సంపద అంతా ఆంధ్ర ప్రాంతం వారికి 'సముద్రం లో పోసిన మంచినీరే!', సముద్రంలో మంచినీరు పారబోస్తే మళ్లీ అదే మంచినీరు వెనక్కు తెచ్చుకోలేము. ఇంకా కొంతకాలం ఇదే విధంగా జరిగితే మనకు మరింత నష్టం.
ప్రభుత్వ సమాచారం ప్రకారం రాష్ట్ర ఆదాయం లో ఎక్కువ భాగం తెలంగాణా కు ఖర్చు చేస్తున్నామని లెక్కలు చెపుతున్నారు. అంటే ఆంధ్ర ప్రాంతం వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లే కదా! మనం మన ఆదాయాన్ని వేరొకరి ఖర్చుచేసి మరింతగా వెనుకబడిపోతున్నప్పుడు, ఇంకా కలిసి ఉండటం కంటే విడిపోటం మంచిది కదా!
హైదరాబాద్, తెలంగాణా బీడు భూములు లక్షలు, కోట్లు పలుకుతున్నాయి, ఇక్కడి ప్రజల ఆర్ధిక స్థితి, జీవన ప్రమాణాలు మెరుగు పడుతున్నాయి, కాని మన ప్రాంతంలో రైతన్నలు మాత్రం గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చదువుకున్నవారికి ఉపాధి లేక నిరాశ, నిసృహలో ఉన్నారు.
'ప్రత్యేక ఆంధ్ర' ఏర్పడితే, మనకు SEZ లు వస్తాయి, పారిశ్రామిక వాడలు ఏర్పడతాయి, మన సంపాదన మనకే ఖర్చు చేసుకోవచ్చు, మన రైతుల భూములు లక్షలు పలుకుతాయి, మన యువకులకు మన ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
లగడపాటి రాజగోపాల్ వంటి కొందరు స్వార్ధపరులు తమ ఆస్తులు, సంపద పెంచుకోవటానికి 'తెలంగాణా' రాష్ట్రానికి వ్యతిరేకంగా అనవసర రాద్చాంతం చేస్తున్నారు. 'ఆంధ్ర ప్రాంతం' ఎంతగా వెనుకబడినా వీరికి నష్టం లేదు, ఎందుకంటె వీళ్ళు ఫక్తు వ్యాపారవేత్తలు, శవాలను పీక్కుని తినే రాబందులు.
లగడపాటి రాజగోపాల్ తనకు సంబంధం లేని తెలంగాణా విషయం లో తలదూర్చి గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తన్నులు తిన్నాడు, ఈ విషయం ప్రపంచం అంతా TV లో చూసారు. ఈ సారి చెప్పు దెబ్బలు తినకుండా నోరుముసుకుని ఉంటే మంచిది. లగడపాటి రాజగోపాల్ వంటి పనికిమాలిన వారి కారణంగా హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ముఖ్యంగా కమ్మవారు, 'తెలంగాణా' వ్యతిరేకులుగా చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంతం లో ఏ ఒక్క పార్టీ వారు కాని, కులం వారు కాని 'తెలంగాణా' వారికి వ్యతిరేకం గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం లేదు. అవతలి వారిని రెచ్చగొట్టి రాజగోపాల్ తన్నులు తింటే ఆంధ్ర ప్రాంతం వారు వినోదం చూస్తారు కాని, మద్దతు పలకరు అనే విషయం రాజగోపాల్ గుర్తుంచుకుని ఇకనయినా నోరు మూసుకుని ఉంటే మంచిది. అహంకారం, నియంతృత్వ పోకడలు కలిగినవాళ్ళు చరిత్రలో చెడ్డవారిగా మిగిలిపోయారు.
'ప్రత్యేక ఆంధ్ర' వచ్చి తీరుతుంది. రాజగోపాల్ కు ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలలో పరాభవం జరిగి తీరుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో రాజగోపాల్ సీట్ తెచ్చుకుంటే కనుక తగిన బుద్ధి చెప్పటానికి విజయవాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు...
'జై ఆంధ్ర' 'జై జై ఆంధ్ర'

Comments