దయచేసి సినిమా హీరోలకు కులం రంగు పులమకండి. హీరోలను అభిమానించటానికి కులంతో నిమిత్తం లేదు. కాని ఈమధ్య జరిగిన కొన్ని సంఘటనలలో కొంతమంది స్వార్ధపరులు అభిమాన సంఘాల మధ్య జరిగే ప్రతి చిన్న సంఘటనలోను తలదూర్చి కుల విద్వేషం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దయచేసి వారిని గమనించండి, ఇటువంటి చీడపురుగులను సమాజానికీ దూరంగా ఉంచండి. కులంతో నిమిత్తం లేకుండా అందరు నిర్మాతలు హీరోలతో సినిమాలు తీస్తున్నారు, ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. హీరోలకు కులాలని అన్ట్టగడితే వారికి నష్టమే తప్ప లాభం ఉండదు. కులాభిమానం మంచిదే కానీ ఇతరకులాల వారిని కులం పేరుతో విమర్శిస్తే వారు కుసంస్కారులు, చరిత్రహీనులు అవుతారు. సద్విమర్శలు భరించలేని వారు, జోక్స్ ఎంజాయ్ చేయలేని వారు పేపర్లు చదవకుండా, టీవీ చూడకుండా ఉంటే మంచిది.
visit www.kammavelugu.org for more information and History of Kamma caste, kammavar, కమ్మ, కమ్మ వారు, కమ్మ నాయుడు, Kamma Naidu, Naidoo community people across the Globe
Comments