Tuesday, January 29, 2008

Come on Stalin, we will follow you...

హీరో రాజశేఖర్ పైన నిన్నజరిగిన పైశాచిక దాడిలో పాత్రలు, పాత్రధారులు బయటకు వచ్చారు. ఒక పకడ్బందీ పధకం ప్రకారం పోలిసుల వద్ద లొంగిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు దర్శకత్వం వహించిన ఘనత వహించిన 'కసాయి తమ్ముడు' గారు చెప్పిన ప్రకారమే పోలిసుల వద్ద నటించారు. కాని పోలిసులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేసారు.

దాడి చేసిన వాళ్ళు తాము చిరంజీవి రిజిస్టర్డ్ ఫాన్స్ అని ఒప్పుకున్నారు. తమ హీరోపైన విమర్శలు చేసిననందుకు దాడి చేశామని చెప్పుకున్నారు. దాడి చేసినవాళ్ళు మా రిజిస్టర్డ్ ఫాన్స్ కాదు, అన్ రిజిస్టర్డ్ ఫాన్స్. వాళ్ళు మా 'నెట్ వర్కు' లో వ్యక్తులు కాదు అని పిచ్చి, పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చిన 'పిచ్చి నా.. పెద్ద తమ్ముడు 'నాగు పాము' ఇప్పుడు ఇంకేమి స్టేట్మెంట్ ఇస్తావు..

ముందుగానే ఉహించినట్లుగా గుంటూరు ట్రైన్ ఎపిసోడ్ నుండి సికిందరాబాద్ రైల్వే స్టేషన్, పంజాగుట్ట వరకు చేజింగ్, దాడి, ఈ మొత్తం పధకానికి కథ, దర్శకత్వం వహించింది 'Common man Harassment Force' వ్యవస్థాపకులు శ్రీ.శ్రీ.శ్రీ.చిన్నసాడిస్ట్ గారు అని అర్ధమైపోతుంది. చట్టం ప్రకారం నేరస్తుడి కంటే, నేరం చేయటానికి ప్రేరేపించిన వాడికే ఎక్కువ శిక్ష పడుతుంది. 'చిన్నసాడిస్ట్' గారి సాడిజాన్ని, బెదిరింపులను గతంలో చవిచూసిన చిరంజీవి చిన్న కూతురు, అల్లుడు, పెద్ద అల్లుడు కాబోయి కొంచెం లో మిస్ అయ్యిన 'ఉదయ కిరణ్' ను అడిగితే బాగా చెబుతారు. ఇటువంటి సైకో, మానవ మృగాలు ఉండవలసిన చోటు 'సెంట్రల్ జైలు' లేదా 'పిచ్చాసుపత్రి'.

శ్రీ.శ్రీ.చిరంజీవి గారు చెప్పినట్టు గా ఈ నేరస్తులని సమాజం నుండి వేలివేయాలి. 'ముందు కాల్చి, ఆ తరువాత గాయానికి వెన్నపూస రాస్తే' మంచి అనిపించుకోదు. ప్రస్తుతం చిరంజీవి అదే పని చేసాడు.

'శ్రీమాన్ మహాత్మా చిరంజీవి' గారు తన 'బ్లడ్ బ్యాంకు' లో రోజూ జరిగే అక్రమ అమ్మకాలపైన ద్రుష్టి పెట్టిన వాళ్ళను, కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీ తో సంసారం చేసి పిల్లలని కని, అదేదో అందరికి ఆదర్సంగా ప్రభోదించే లుచ్చా నాయాళ్ళను, అర్ధరాత్రి తాగి రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నటుడికి జిందాబాద్ కొడుతూ, ఇతర నటుల పైన దాడి చేసి గుండాయిజం చేసే పోరంబోకు వెధవలని, రోడ్డు పైకి ఈడ్చి శిక్షిస్తే, తను ప్రజల దృష్టిలో '
స్టాలిన్' అవుతాడు. లేకపొతే కనుక జీరో అవుతాడు.

చిరంజీవి పార్టీ పెట్టిన మరుక్షణమే చిరంజీవి ట్రస్టు వెనుక భాగోతం, 'పద్మభూషణ్' అవార్డు వెనుక లాబియింగ్, మరిన్ని కుటుంబ సంభందమైన వివరాలు 'సీరియల్ ఎపిసోడ్' రూపంలో అందించటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.

చిరంజీవి గారు, మీలో స్టాలిన్, టాగోర్ లను నిద్రలేపండి, మీరెప్పుడు ప్రవచించే, అవినీతి రహిత, నేర రహిత, సమాజాన్ని నెలకొల్పే దిశగా ముందడుగు వేయండి. ముందుగా మీ కుటుంబం తోనే ప్రక్షాళన ప్రారంభించండి, మీకు అండగా మేముంటాం..
Post a Comment