వారం రోజుల క్రితం అండమాన్ లో పోర్ట్ బ్లెయిర్ మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 24 స్థానాలకు గాను 18 స్థానాల్లో పోటి చేసి 2 స్థానాలు మంచి ఆధిక్యతతో గెలుపొందింది, మరో 4 స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది. విశేషమేమిటంటే తెలుగుదేశం పార్టీ తరుపున గెలుపొందిన వారిరువురు మహిళా అభ్యర్ధులే, వీరిలో ఒకరు తమిళ మరొకరు బెంగాలి. బిజెపి తరుపున నలుగురు తెలుగువారు గెలుపొందారు. ఇక్కడ బిజెపి, తెలుగుదేశం పార్టీ కలిసి పోటి చేస్తే తెలుగుదేశం పార్టీకి మరొక నాలుగు స్థానాలు, బిజెపి పార్టీకి మరో రెండు స్థానాలు అదనంగా లభించి ఉండేవి. వచ్చే ఎన్నికల్లో తెదేపా, బిజెపి ఇక్కడ కలిసి పోటిచెస్తే తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం ఉంది. అండమాన్ దీవుల్లో తెలుగు వారి జనాభా షుమారుగా 49,000, వీరిలో ఎక్కువ మంది పోర్ట్ బ్లెయిర్ లో ఉంటున్నారు. తెలుగువారి జనాభా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తరువాత అత్యధికంగా తమిళనాడులో సుమారుగా 78,00,000, కర్ణాటక రాష్ట్రంలో 22,00,000, మహారాష్ట్ర లో 14,00,000, ఛత్తీస్ ఘర్ లో 11,50,000, ఒరిస్సాలో 2,30,000 ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో 22 మంది తెలుగు వారు శాసన సభ్యులుగా, ఇద్ద...