గత దశాబ్ద కాలంలో ఈ దేశంలో, రాష్ట్రంలో ఎన్నో స్కాములు బయట పడ్డాయి. నిందితుల్లో కొందరికి శిక్ష పడింది, కొందరు తప్పించుకున్నారు, మరి కొన్ని సుదీర్ఘ కాలంగా విచారణలో ఉన్నాయి. ఇటీవల "అగ్రి గోల్డ్" సంస్థ తన డిపాజిట్ దార్లకు వేలాది కోట్ల రూపాయల మెచ్యురిటి డిపాజిట్ల తిరిగి చెల్లింపులో విఫలం కావటంతో ఆ సంస్థ నిర్వహిస్తున్న పోంజీ స్కీం వ్యహారం బయట పడింది. వంద కోట్లు అంతకు మించి పబ్లిక్ నుంచి వసూలు చేసే కంపెనీలు తమ అనుమతిని తప్పనిసరిగా సెబీ నిబంధనలు చెబుతున్నాయి. సెబి వద్దనున్న సమాచారం మేరకు ఈ సంస్థ ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని పేద, మధ్యతరగతి వర్గాల నుంచి రకరకాల స్కీంల రూపంలో 7,000 కోట్ల రూపాయల వరకు సేకరించినట్లు తెలుస్తుంది. దీనిలో ఒక్క ప్రకాశం జిల్లా నుండే 1,500 కోట్లు మదుపు దారులనుండి సేకరించారు. ఇటీవలి కాలంలో సంస్థ వసూళ్ల కన్నా మెచ్యూర్ అయిన డిపాజిట్లకు చెల్లించాల్సిన మొత్తం పెరగటంతో లిక్విడిటీ సమస్య ఏర్పడింది. దీంతో డిపాజిటర్లకు చెక్కులు బౌన్స్ కావటం ప్రారంభమయింది. ఫలితంగా మదుపర్లు వీధిన పడ్డారు. ఇప్పటివరకు కంపెనీ జారీ చేసిన దాదాపు 290 కోట్ల ర...
visit www.kammavelugu.org for more information and History of Kamma caste, kammavar, కమ్మ, కమ్మ వారు, కమ్మ నాయుడు, Kamma Naidu, Naidoo community people across the Globe