Tuesday, May 1, 2012

ఉప ఎన్నికల తరువాత 'జగన్' అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్న CBI

జూన్ లో జరుగబోయే ఉప ఎన్నికల తరువాత 'జగన్' అరెస్ట్ కు CBI రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వాస్తవంగా అయితే ఏప్రిల్ నెలలోనే 'జగన్'ను అరెస్ట్ చేస్తారని అందరు భావించారు. 'విజయసాయి రెడ్డికి' బెయిల్ ఇచ్చిన సందర్భంలో CBI కోర్టులో జడ్జి 'ప్రధాన నిందితుడయిన జగన్' ను వదిలి రెండవ నిందితుడిగా  ఉన్న 'విజయసాయి రెడ్డిని' ఎలా అరెస్ట్ చేస్తారని CBI లాయర్ ను ప్రశ్నించారు.

వాస్తవంగా జగన్ మోహన్ రెడ్డిని అప్పుడే CBI అరెస్ట్ చేసి ఉండాలి కాని, రాబోయే ఉప ఎన్నికలలో 'జగన్ పార్టీకి' అరెస్ట్ విషయం ఒక అస్త్రంలా ఉపయోగ పడవచ్చు అనే భయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం CBIని అర్ధించి జగన్ అరెస్ట్ ను తాత్కాలికం గా వాయిదా వేయించింది.

వై.యస్.ఆర్ ద్వారా ఆర్ధిక లబ్ది పొందిన కంపెనీలు జగన్ సంస్థలలో అత్యధిక ప్రీమియం తో వాటాలు కొనుగోలు చేసాయి. కొన్ని ఉరు పేరు, అడ్రస్ లేని సూట్ కేసు కంపెనీలు కూడా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. ఆర్ధిక నేరాల అదుపు విభాగం ఈ విషయాలన్నింటి పైన దృష్టి పెట్టి పక్కా సాక్ష్యాలను సేకరించింది. వై.యస్.ఆర్ కు ముడుపులు సమర్పించుకుని, జగన్ సంస్థలలో అధిక ప్రీమియం కు వాటాలు కొనుగోలు చేసిన ఆ తరువాత ఆర్ధికంగా ఏంటో నష్టపోయిన దండమూడి, కన్నన్ (జయ జ్యోతి సిమెంట్) వంటి కొందరు పారిశ్రామిక వేత్తలు సిబిఐ వద్ద ఇప్పటికే ఆ వివరాలు తెలియ చేసారు. డెలాయిట్ సంస్థ కూడా 'సాక్షి' కి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చింది.

'జగన్'ను అరెస్ట్ చేయకుండా సిబిఐ వ్యూహాత్మకం గా వ్యహరిస్తుంది. ముందుగా జగన్ కు సహకరించిన వారిని నుండి వివరాలు రాబట్టి  గాలి జనార్ధన రెడ్డి విషయం లో ఎలా తొందరపాటు లేకుండా వ్యహరించిందో అదేవిధంగా  'జగన్' ఆస్తులు స్తంబింప చేసి బెయిల్ కూడా లభించకుండా చేసే విధంగా వ్యవహరించబోతుంది.

విజయసాయి రెడ్డి కి బెయిల్ ఇవ్వటం  ;జగన్' అరెస్ట్ విషయంలో తాత్సారం చేయటం, తద్వారా ప్రతి పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కోర్ట్ ల నుండి ఒత్తిడి ఎదుర్కొని కూడా, 'జగన్' విషయం లో మెతక వైఖరిని అవలంబించింది అనే పేరు తెచ్చుకోవటం కూడా కూడా సిబిఐ వ్యూహంలో భాగమే!

ఇలా కొంతకాలం సాగతీసి 'జగన్' విషయంలో సిబిఐ కాని, కాంగ్రెస్ ప్రభుత్వం కాని కక్ష సాధింపు ధోరణి తో కాక మెతక వైఖరి తోనే ఉన్నాయని నమ్మించి, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్ట్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేయ వలసి వచ్చిందనే ప్రచారం తో, 'జగన్' చీప్ పబ్లిసిటీ చేసుకొనే ఆవకాశం కూడా లేకుండా చేసే విధంగా నిదానంగా పావులు కదుల్చుతున్నారు.

సిబిఐ ప్రస్తుతం 'జగన్' కు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలను చాప కింద నీరులా సేకరిస్తుంది. Enforcement Directorate తన పని తానూ చేసుకు పోతుంది. ఈ జూన్ మొదటి వారానికి 'జగన్' విదేశీ కంపెనీల భాగోతంపై నివేదిక సిబిఐ కి చేరుతుంది, సిబిఐ ప్రస్తుతం విదేశాలలో చురుగ్గా ఈ వివరాలు సేకరిస్తుంది.

అక్రమంగా సంపాదించిన డబ్బు మదంతో రాజకీయాలను శాసించ వచ్చని కలలు గన్న గాలి జనార్ధనరెడ్డి, జగన్ మోహనరెడ్డి కి గట్టి గుణ పాఠం చెప్పాలని 'సోనియా గాంధీ' గట్టి పట్టుదలగా ఉంది. ఇలాంటి నేర పూరిత మనస్తత్వం కల వారిని వదిలేస్తే భావిష్యతులో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం అని న్యాయ వ్యవస్థ, కోర్టులు భావిస్తున్నాయి.

అసెంబ్లీ ఉప ఎన్నికల తరువాత పక్కా సాక్ష్యాలతో 'జగన్'ను అరెస్ట్ చేస్తే ప్రజలనుండి పెద్దగా సానుభూతి వచ్చే ఆవకాశం లేదు. ఒక వేళ కొంత సానుభూతి వచ్చినా దాని వలన ప్రభుత్వానికి వెంటనే వచ్చే నష్టమేమి లేదు.

 'జగన్' కు బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదు, ఈ లోపు జగన్ ను అప్పటివరకు కాపాడుకుంటూ వస్తున్న వారిలో  కొందరు అప్రూవర్లు గా మారే అవకాశం ఉంది. జగన్ అరెస్ట్ వెంటనే Enforcement Directorate 'అవినీతి పునాదులపై నిర్మించుకున్న జగన్ ఆర్ధిక వనరులను' జప్తు చేస్తుంది. ఆ తరువాత పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి హత్యలలో 'జగన్' పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉంది.

 అలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ బ్రతికి బట్ట కడుతుందని, అతని అనుచరులు పార్టీని నడిపిస్తారని అనుకోవటానికి యెంత మాత్రం ఆస్కారం లేదు. 'వ్యక్తి పూజ'కై పుట్టి, కుల బలం తప్ప సంస్థాగత బలం లేని జగన్ పార్టీ అతని అరెస్ట్ వెంటనే కనుమరుగయ్యే అవకాశం ఉంది. అతని కులం వాళ్ళంతా జగన్ కు  చెయ్యిచ్చి మరల కాంగ్రెస్ పార్టీ లోకి 'స్వగృహ' ప్రవేశం చేస్తారు.

రాజశేఖర్ రెడ్డి అరాచకాలను, అవినీతిని చూసిన వారికి 'దేముడనే వాడున్నాడా! ఉంటె కళ్ళు మూసుకున్నడా?' అనే సందేహం కలిగినప్పుడు ఆ కలియుగ దైవం 'వేంకటేశ్వరుడు' తన మహిమను చూపించాడు. 'అవినీతి, అరాచక వాదం ప్రబలిన ప్రతిసారి అందుకు కారకులపై ఆ దేముడు తప్పకుండా తన పంజా విసురుతాడు.

చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ వ్యవస్థకు, దేశానికి అవసరం కనుక అతన్ని రాక్షసుల బారినుండి రక్షించాడు. ఇది ఎవరూ కాదనలేని సత్యం.

ఈ దేశంలో న్యాయ వ్యవస్థకు కళ్ళు చెవులు పనిచేస్తున్నాయి కాబట్టే, అవినీతి పరులైన మంత్రులు, ముఖ్య మంత్రులు, యం.పి లు తమ తప్పులకు శిక్షగా జైల్లో ఉచలు లెక్క పెడుతున్నారు.

తన తమ్ముడు జగన్ సాంగత్యం కోసం జైల్లో కళ్ళు కాయలు కాచేలా ఎదురు తెన్నులు చూస్తున్న 'గాలి జనార్ధనరెడ్డి' కోరిక తీరబోయే రోజు రెండు  నెలల్లోనే ఉంది.

ఇక 'జగన్' కు 'In front crocodile Festivale'

దేముడున్నాడు.. సత్యమేవ జయతే..Post a Comment