tag:blogger.com,1999:blog-3649531851358580000.post2927326081866693213..comments2024-03-26T13:01:02.027+05:30Comments on Kammas World: కమ్మ వారిపై కొన్ని వర్గాల వారికి అకారణ ద్వేషం ఎందుకు?Sreenivasa Chakravarthy Kanakamedalahttp://www.blogger.com/profile/02518770044209505844noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-3649531851358580000.post-20458326276753549242012-07-04T15:43:25.746+05:302012-07-04T15:43:25.746+05:30సామెతల్లో మూఢనమ్మకాలు,కులవివక్ష,అవహేళన
ప్రజలకు విష...సామెతల్లో మూఢనమ్మకాలు,కులవివక్ష,అవహేళన
ప్రజలకు విషయం మరింత సులువుగా అర్ధమవడానికి ఉపన్యాసాల్లోనూ, రచనల్లోనూ సామెతలూ, ఉపమానాలూ వాడతారు . ఇవన్నీ భాషను పరిపుష్టం చేసేవీ, అలంకారమైన అంశాలే. అయితే కొన్ని సామెతలు స్త్రీలనూ, నిమ్నవర్గాలనూ, వికలాంగులనూ కించపరిచేవిగా ఉన్నాయి.ఆకాలంలో చెల్లాయిగానీ ఈనాడు ఏవిధంగానూ సమర్ధించలేని సామెతలివిగో:

నల్లబ్రామ్మడినీ ఎర్రకోమటినీ నమ్మకూడదు
ముందువెళ్ళే ముతరాచవాడినీ ప్రక్కన బోయే పట్రాతి వాడినీ నమ్మరాదు
ముందుపోయే ముతరాచవాడినీ వెనుకవచ్చే ఈడిగ వాడినీ నమ్మరాదు
నీ కూడు నిన్నుతిననిస్తే నేను కమ్మనెలా ఔతాను?
తుమ్మనీ కమ్మనీ నమ్మరాదు
రెడ్లున్నఊరిలో రేచులున్న కొండలో ఏమీ బ్రతకవు
నరంలాంటివాడికి జ్వరం వస్తే చెయ్యి చూచినవాడు బ్రతకడు
తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు
మాలవానిమాట నీళ్ళమూట
చాకలి అత్త మంగలి మామ కొడుకు సాలోడైతేనేమి సాతానోడైతేనేమి?
విధవముండకు విరజాజి దండలేల?
కాశీలో కాసుకొక లంజ
నంబీ నా పెళ్ళికి ఎదురురాకు
నియోగి ముష్టికి బనారసు సంచా?
మాలదాన్ని ఎంగటమ్మా అంటే మదురెక్కి దొడ్డికి కూర్చుందట
కులం తక్కువ వాడు కూటికి ముందు
చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు
మాలలకు మంచాలు బాపలకు పీటలా?
మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు
తురక సాయిబుల మీద సామెతలు
తురకా దూదేకుల తగాదాలో మురిగీ ముర్దార్ [మంచిదాన్నీ చెడ్డదనుకుంటారు]
మేకలు తప్పిపోతే తుమ్మల్లో, తురకలు తప్పిపోతే ఈదుల్లో (ఈతచెట్లలో) [ఆ అనుబంధం అలాంటిది]
తురకా కరకా రెండూ బేధికారులే. మొదటిది దగ్గరకు వస్తేనే చాలు, రెండోది లోపలికి పోవాలి. [అంత బెదురన్నమాట]
తురక కొట్టవస్తే చుక్కెదురని కదలకుంటారా? [కుండలేదని వండుకుతింటం మానేస్తామా?]
తురక దయ్యము మంత్రించినట్లు [ఏ కులందయ్యం ఎవర్ని పడుతుందోమరి]
తురకదాసరికి ఈతమజ్జిగ [బాంచేతు దేవుడికి మాదర్చోదు పత్రిలాగా]
తురకమెచ్చు గాడిదతన్ను [రెండూ అంతగట్టిగా ఉంటాయన్నమాట]
తురకలసేద్యం పెరిక లపాలు [రాజులసొమ్ము రాళ్ళపాలు లాగా]
తురకవాడకు గంగెద్దు పోతే కోసుకు తిన్నారట [అవసరం అసుంటిది ఎవరి అలవాటు వారిది ]
ఇదేందోయ్ పెంట తినే కోమటీ అంటే, పోవోయ్ బెల్లంతినే సాయిబా అన్నాడట.అట్లా అంటావేంటి కోమటీ అంటే ఎవరి అలవాటు వారిది అన్నాడట
తురక వీధిలో సన్యాసి భిక్షలాగా [కుంటోడైనా ఇంటోడు మేలు]
తురక వీధిలో విప్రుడికి పాదపూజ చేసేమి చెయ్యకేమి?[విప్రుల వీధిలో తురకాయనకు చేస్తే సరి]
తురక మరకా తిరగేసి నరకా [ఎల్లిశెట్టిలెక్క ఏకలెక్క]
తురకలలో మంచిఎవరంటే తల్లికడుపులో ఉన్నవాడూ,గోరీ లో ఉన్నవాడు [పగవాణ్ణి పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నాడట]
తురక ఎంతగొప్పవాడైనా ఇంటికి పేరులేదు,తలకు జుట్టు లేదు, మొలకు తాడు లేదు [ఎంత పెద్దకులస్తులకైనా ముడ్డి పీతికంపే]
పాకీదానితో సరసం కంటే అత్తరుసాయిబు తో కలహం మేలు [ గూని దున్న కంటే గుడ్డి దున్న మేలు]
సాయిబూ చిక్కిపోయావేంటంటే,ఇంకా చిక్కుతాం,మరీ చిక్కుతాం,మనసువస్తే చచ్చిపోతాం నీకేం అన్నాడట [ ఒంటేలు కి పోయి ఇంతసేపేంటిరా అంటే రెండేళ్ళు కు వచ్చింది అన్నాడట]
సన్నెకల్లు కడగరా సయ్యదాలీ అంటే కడిగినట్లే నాకినా కుదా తోడు అన్నాడట
ఆవో అంటేనే అర్ధంగాక అగోరిస్తుంటే కడో అనేదాన్ని అంటగట్టావా? [ఒకరుంటే దేవులాట ఇద్దరుంటే తన్నులాట ]
ఫకీరుసాయిబును తీసుకొచ్చి పక్క లో పడుకోబెట్టుకుంటే లేచిలేచి మసీదు లోకి వెళ్ళాడట
ముద్ద ముద్దకీ బిస్మిల్లా నా
నమాజు చెయ్యబోతే మసీదు మెడమీద పడిందట
ఉర్సు లకు పోతే కర్సులకు కావాలి [ గోకుడు కి గీకుడు మందు ]
ఊదు వేయనిదే పీరు లేవదు [ గోల గోవిందుడిది అనుభవం వెంకటేశ్వర్లుది]
మునిగింది ముర్దారు తేలింది హలాలు [ గుంత కు వస్తే మరదలు మిట్ట కు వస్తే వదిన ]
కాజీ ని ఫాజీ గా ఫాజీని కాజీగా మార్చినట్లు [ గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు]
ఖానా కు నహీ ఎల్లీకి బులావ్ అన్నట్లు
గుర్రం పేరు గోడా ఐతే గోడ పేరు గుర్రం గదా? ఇక నాకు ఉర్దూ అంతా వచ్చేసింది అన్నాడట
నవాబు తల బోడి నా తలా బోడేనని వితంతువు విర్రవీగిందట
దర్జీ వాణ్ణి చూస్తే సాలె వాడికి కోపం

దూదేకుల సాయిబుల మీద సామెతలు

దూదేకులవానికి తుంబ తెగులు (అందుకే ఆ వృత్తి జిన్నింగ్ మిల్లులకొదిలేశారు)
దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (ఏంలోటూ లేదు ఇంకో పని చేసుకొని బ్రతకొచ్చు)
తురకలు లేని ఊళ్ళో దూదేకులసాయిబే ముల్లా (ఏచెట్టూలేనిచోట ఆముదంచెట్టులాగా)
కాకర బీకర కాంకు జాతారే అంటే దూబగుంటకు దూదేకను జాతారే అనుకున్నారట. (ఉర్దూ రాక పాట్లు)

నూర్ బాషా రహంతుల్లాNrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.com