Sunday, December 31, 2017

ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గా శ్రీ మన్నం మాలకొండయ్య.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1985 బాచ్ IPS అధికారి  శ్రీ మన్నం మాలకొండయ్య రాష్ట్ర నూతన డిజిపి గా నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకూ ఆయన ఏపిఎస్ ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నారు. డిజిపి శ్రీ సాంబశివురావు స్థానంలో ఆయన రానున్నారు.న్యాయ శాస్త్రంలో పట్టభద్రులైన వీరు క్రిమినాలజీ లో డాక్టరేట్ , బిజినెస్ మానేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.వీరు ప్రకాశం జిల్లాకు చెందినవారు.

వీరి సతీమణి శ్రీమతి పూనమ్ మాలకొండయ్య IAS అధికారి. వీరు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ , మెడికల్ & ఫామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు ప్రిన్సిపల్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Post a Comment