Wednesday, May 16, 2012

కమ్మ వారిపై కొన్ని వర్గాల వారికి అకారణ ద్వేషం ఎందుకు?

అనాదిగా కమ్మ వారు వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. "కమ్మ వారికి భూమి భయపడుతుంది", "తుమ్మ ఉన్న చోట (నీటి వసతి కలిగిన భూములు) కమ్మ ఉంటారు" అనే సామెతలు కూడా ఈ విధంగా వ్యాప్తి లోనికి వచ్చినవే!

కాలక్రమేణా విద్యారంగం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో వచ్చిన అభివృద్ధి, అవకాశాలు కమ్మవారు త్వరగా అంది పుచ్చుకున్నారు.  వ్యవసాయ కుటుంబాల్లోని వారు తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించి విద్యావంతులను చేయటం ద్వారా ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగాలలో ప్రవేశించ గలిగారు. అదే సమయంలో కొంతమంది ఉన్నత విద్యావంతులు, ఆర్ధిక స్థోమత కలిగిన వారు, భూస్వాములు (ఉదా. వెలగపూడి రామకృష్ణ, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, జి.డి.నాయుడు, పి యస్.జి నాయుడు) పారిశ్రామిక రంగంలో ప్రవేశించి విజయం సాదించారు. వీరి ప్రేరణ తో అనేకమంది ఆ తరువాత పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లోకి ప్రవేశించి 'కమ్మ వారికి వ్యవసాయం తరువాత వ్యాపార రంగమే ప్రధాన వృత్తి' అనే విధంగా ఆ రంగంలో స్థిరపడి, గట్టి పట్టు సాధించారు.

కమ్మవారు ఏ రంగంలో ప్రవేశించినా ఆనతి కాలంలోనే ఆ రంగంలో ఆధిపత్యం వహించే స్థాయికి వెళ్ళ గలిగారు. ఈరోజు కొన్ని రంగాల్లో కమ్మ వారి గుత్తాధిపత్యం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో, చిత్ర రంగంలో, మీడియా రంగంలో, కార్పోరేట్ విద్యా రంగంలో, పారిశ్రామిక రంగంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ వారిదే 'ఆగ్ర స్థానం'. ఆయా రంగాల్లో మన వారిని ఆదర్శంగా తీసుకుని అనేకమంది ఇతర కులాల వారు కూడా మనల్ని అనుసరించారు.

భారత దేశంలో అనేక కులాల వారు తర తరాలుగా తమ 'కుల వృత్తినే' జీవనాధారంగా ఎంచుకుని మనుగడ సాగిస్తున్నారు. మారుతున్న ప్రపంచంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అన్ని కులాలవారు తమ జీవనాధారం కోసం ఇతర వృత్తులలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ఆ విధంగా కమ్మ వారు కూడా తమ కుల వృత్తి వ్యసాయంతో పాటుగా జీవనాధారం కోసం అన్ని రంగాల్లోకి, వృత్తులలోకి ప్రవేశించారు.

వాణిజ్య రంగంలో మనవారు ప్రవేశించి కిరాణా దుకాణాల స్థానంలో 'డిపార్ట్మెంట్ స్టోర్స్', స్థాపించటం, బంగారు దుకాణాలు మొదలుకొని వివిధ ఉత్పత్తుల 'టోకు', మరియు 'చిల్లర' వ్యాపార రంగాల్లోకి ప్రవేశించటం, ఇంతవరకు కొన్ని వర్గాల వారికే పరిమితమైన 'హోటల్స్', 'కేటరింగ్'  రంగాల్లో కూడా పైచేయి సాదించటం ఆయా వర్గాల వారికి కొంత కంటగింపు కలిగించింది.

కొంతమంది కమ్మవారు పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించిన వారు కూడా ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కమ్మవారు ప్రవేశించటం వలన అప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడిన ఒక కులం వారికి మనం పోటీగా తయారయ్యమనే భావనతో మనపట్ల కొంత ద్వేష భావం ఏర్పరచుకొన్నారు.

రాష్ట్ర జనాభాలో అతి కొద్ది శాతం ఉన్న కమ్మవారు రాజకీయాల్లో కూడా రాణించి 'ముఖ్యమంత్రి' పదవి అందుకోవటం ఆ రంగంలో అప్పటివరకు పెత్తనం చెలాయిస్తున్న ఒక వర్గం వారితో పాటు మరి కొన్ని వర్గాల వారికి కూడా అసూయ కలుగ చేసింది.

వ్యక్తుల్లో ప్రధానంగా మూడు కోవలకు చెందిన వారు ఉంటారు. మొదటి కోవకు చెందిన వ్యక్తులు 'అవకాశాల కోసం ఎదురు చూస్తారు'. రెండవ కోవకు చెందిన వారు 'అవకాశాల కోసం అన్వేషిస్తారు'. మూడో కోవకు చెందిన వ్యక్తులు 'అవకాశాలను సృష్టించుకుంటారు'. కమ్మ వారిలో మూడో కోవకు చెందిన వారు ఎక్కువగా కనిపిస్తారు.

'దక్షిణ భారత దేశంలో' ప్రత్తి, పొగాకు, పసుపు వంటి వాణిజ్య పంటలను అన్ని జిల్లాల రైతులకు  పరిచయం చేసింది కమ్మ వారే. 'స్వగృహ ఫుడ్స్', 'మ్యారేజ్ బ్యూరోలు' వంటి కొత్త కాన్సెప్ట్స్ కనిపెట్టింది కమ్మవారే.

గుడిసెలో ఉన్నవాడిపై  అందరూ జాలి చూపిస్తారు, కోటలో ఉన్న వాడిపై ఎక్కవ మంది ఈర్ష్య పడతారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్న 'కమ్మ వారిపై' కొన్ని వర్గాల వారికి అకారణంగా అసూయ, ద్వేషాలు ఏర్పడ్డాయి. తెలివి, ప్రతిభ, కష్టించే తత్వం ఉన్న వారు ఏ కులం వారైనా పైకి రావచ్చు.
 

'ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమని' మన పెద్దవాళ్ళు  చెప్పారు. మనం కూడా యెంత ఎదిగినా ఇతర కులాల పట్ల సోదర భావంతో కలిసిపోతే క్రమేపి వారికి మనపట్ల ఉన్నఅసూయ, ఈర్ష్య  భావాలు తగ్గు ముఖం పడతాయి.
Post a Comment