Tuesday, May 1, 2012

కమ్మ వారంతా జగన్ కు జై కొడుతున్నారా?

జగన్ పార్టీలో ఇప్పటికే చాలా మంది చోటా, మోటా కమ్మ నాయకులూ ఎందరో చేరారు. కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో  తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో దిగువ శ్రేణి నాయకులు, ముందుగా చేరితే ముఖ్య నాయకులుగా గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరారు.

వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు ఆ పార్టీలో నెల జీతానికి పనిచేస్తున్నారు. (ఈవిడ ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ నాయకుడికి చెక్క భజన బాగా చేస్తారు, ఆయన మీద ఈగ వాలిన సహించారు, తను తీసుకునే జీతానికి పూర్తి న్యాయం చేస్తారు) మాకినేని పెదరత్తయ్య లాంటి మతి భ్రమించిన నాయకులు, జేష్ట రమేష్ బాబు, తాతినేని పద్మావతి, పువ్వాడ అజయ్ లాంటి పలుకుబడి లేని నాయకులు, తమ తమ పార్టీలలో ఎప్పటికి ఎదగలేమని భావించి, వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీలో సీటు ఆశించి ఆ పార్టీలో చేరారు. విచిత్రమేమిటంటే గత ఎన్నికలలో ఈ బృందం అంతా 'రాజశేఖర రెడ్డి'ని అత్యంత అవినీతి పరుడిగా, నేరస్తుడిగా విమర్శలు చేసిన వాళ్ళే.

ఇకపోతే ఈ మధ్యనే జగన్ పార్టీలో చేరిన 'గద్దె బాబూ రావు, గిరిబాబు' చెబితే వాళ్ళ భార్యలు కూడా ఆ పార్టీకి ఓటు చేయరు. వీళ్ళు 'గుడ్డి కన్ను' లాంటి వారు. గుడ్డికన్ను మూసినా, తెరిచినా ఒక్కటే! పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు విజయనగరం జిల్లాలో పెత్తనం చెలాయించి, ఆర్ధికంగా బలపడి కార్యకర్తలను పట్టించుకోకుండా పార్టీని సర్వ నాశనం చేసిన 'గద్దె బాబురావు' తెలుగు దేశం పార్టీ నుండి బయటకు వెళ్ళటం ఆ పార్టీకి మంచి పరిణామమే.

ప్రస్తుతం జగన్ కు లోపాయకారీగా మద్దతు తెలియచేస్తూ, 'తనువొక చోట మనసొక చోట' అన్న చందంగా వ్యహరిస్తున్న 'జూ.యన్.టి.ఆర్, వంశీ లాంటి వాళ్ళు గత ఎన్నికలలో వై.యస్.ఆర్ ని కాని, జగన్ ను కాని తిట్టినన్ని తిట్లు మరెవ్వరు తిట్టి ఉండరు. వీరికి ఇప్పుడు జగన్ లో ఒక జీసస్, మహాత్మా గాంధీ, రామకృష్ణ పరమ హంస, వివేకానందుడు కనిపిస్తున్నారంటే ఇంతకన్నా బూతు మరొకటి ఉంటుందా?  

 జూ:యన్.టి.ఆర్ తో తెలుగు దేశం కొంత పార్టీకి ప్రయోజనం ఉండవచ్చు కాని వల్లభనేని వంశీ తో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. ఇట్లాంటి వాళ్ళు మరికొంతమంది పార్టీని విడిచి వెళితేనే తెలుగు దేశం పార్టీ ప్రక్షాళన అవుతుంది.

త్వరలో గొట్టిపాటి నరసయ్య, మరికొందరు ఆ పార్టీలో చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పార్టీలన్నీ కులాల వారిగా చీలి పోయాయి.  అవునన్నా, కాదన్నా మనందరం ఈ విషయాన్ని నిస్సంకోచంగా ఒప్పుకుని తీరాలి.

రెడ్డి సామాజిక వర్గం మొత్తం జగన్ పార్టీకి అనుకూలంగా, కాపు సామాజిక వర్గం మెజారిటీ కాంగ్రెస్ కు అనుకూలంగా, కమ్మ సామాజిక వర్గం మెజారిటీ తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తాయనేది అందరికి తెలిసిన విషయమే. నాయకులే 'కులానికి' అనుగుణంగా నడవాలి తప్ప,  నాయకుల వెంట 'కులం' నడిచే మార్గం ఎక్కడా కనపడటం లేదు.

కాంగ్రెస్ లేదా తెలుగు దేశం 'రెడ్డి' సామాజిక వర్గానికి సీటిచ్చినా, జగన్ 'కమ్మ' సామాజిక వర్గానికి సీటిచ్చినా ఆ వర్గం ఓట్లు చీలిపోయే ప్రసక్తే లేదనేని సత్యం.

'కమ్మ వారిలో' చాలామంది అప్పటికి, ఇప్పటికి 'కాంగ్రెస్' పార్టీ అభిమానులుగా ఉన్నారు. గతంలో తెలుగుదేశం తో సమానంగా కాంగ్రెస్ పార్టీలో కమ్మ వారు ఉన్నారు, కాని రాజశేఖర రెడ్డి 'కమ్మ వారి' పట్ల అనుసరించిన వ్యతిరేక భావం వలన కొదరు ఆ పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ, ఆ పార్టీ కమ్మవారిని ప్రోత్సహించి, అవకాసమిస్తే కమ్మవారు ఆ పార్టీకి మద్దతు తెలియ చేస్తారు కాని, 'కమ్మ వారిని' రాజకీయంగా మరియు అన్ని రంగాలలోను అణచివేసే ధోరణి అవలంబించిన రాజశేఖర రెడ్డి కొడుకు, 'పరిటాల రవి' హత్య కేసులో ముద్దాయి,   'జగన్' వెంట కొంతమంది స్వార్ధ పరులైన 'కమ్మ' సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉంటే ఉండవచ్చు కాని, వారికి కమ్మ వారి ఓట్లు చీల్చి, జగన్ పార్టీకి వేయించే అంత శక్తి లేదు. 

కమ్మవారెప్పుడు ఏ కులానికి, పార్టీకి వ్యతిరేకం కాదు, తమకి అన్యాయం చేసిన, అణగదొక్కాలని చూసిన వ్యక్తులకు మాత్రమే వ్యతిరేకమనే విషయం అందరూ  గుర్తుంచుకోవాలి.

Post a Comment